Wednesday, March 24, 2010

దుగ్గిరాల యార్డులో భారీగా పెరిగిన పసుపు ధర

దుగ్గిరాల, మేజర్‌న్యూస్‌: స్థానిక పసుపు మార్కెట్‌ యార్డులో సోమవారం జరిగిన వేలం పాటలో క్వింటాల్‌ పసుపు ధర రూ.11303లు భారీగా పెరిగింది. గత వారం క్వింటాల్‌ ధర రూ.10900 పలకగా, శుక్రవారం రూ.500 తగ్గి రూ.10400 వరకు చేరింది. అయితే రెండు రోజుల వ్యవధిలో ఒక్కసారిగా రూ.11303లు పెరగడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. కడప జిల్లా నుంచి భారీగా పసుపు తరలిరావడంతో ధరలు తగ్గుతాయని భావించినప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి ఆర్డర్లు ఉండడంతో స్టాకిస్టులు ముందుగా రావడంతో ధరలు వేగంగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో అనుకున్న రీతిలోనే పసుపు ధరలు భారీగా పెరిగాయి.

యార్డుకు పసుపు తీసుకున్నప్పటికీ ప్రస్తుతం టేకూరుపేట రకానికి మంచి ధర లభిస్తుంది. మిగిలిన రకాలు అంతంతమాత్రంగా ఉండడంతో రైతులు తమ సరకును అమ్మేం దుకు వెనుకాడు తున్నారు. దూరాభారంపై వచ్చి వ్యవసాయ అవసరాలున్నవారు తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిన ధరకు అమ్ముకుని వెళ్తున్నారు. అంతేకాకుండా ఒకే ప్రదేశం నుంచి వచ్చిన రైతుల్లో ఒకరిద్దకి మాత్రమే మంచి ధర లభిస్తుంది. సోమవారం పసుపు ధరలు భారీగా పెరగడంతో యార్డులో 800 బస్తాల అమ్మకాలు జరిగాయి. సరకు కనిష్ట ధర రూ.10500 నుంచి రూ.11100కు చేరింది. అదేవిధంగా కాయ కనిష్ట ధర రూ.10500 నుంచి రూ.11303 వరకు పలికింది. యార్డులో ప్రస్తుతం సుమారు మూడు వేల బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు అధికారులు తెలిపారు.