Monday, March 29, 2010

బఫెట్‌ సూత్రావళి టెక్నాలజీ షేర్లకు ఈయన దూరం!

బఫెట్‌ సూత్రావళి
టెక్నాలజీ షేర్లకు ఈయన దూరం!
బఫెట్‌ ఆదాయం 48 బిలియన్‌ డాలర్లు. అంటే దాదాపు రూ.2,20,800 కోట్లు. ఆయన కేవలం 100 డాలర్లతోనే తన పెట్టుబడి ప్రయాణం మొదలెట్టారాంటే నమ్ముతారా? అది కూడా ఎలాంటి కంపెనీని స్థాపించకుండా.. ఒక్క డాలరు కూడా టెక్నాలజీ షేర్లలో పెట్టుబడులు పెట్టకుండా.. ఆశ్చర్యమే మరి. కేవలం స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడుల ద్వారానే ఆయన అంత స్థాయికి ఎదిగారు. ఇది ఎలా సాధ్యమైంది?

ఫెట్‌ పెట్టుబడి మంత్రాంగం ఏమంత సంక్లిష్టమైనదేమీ కాదు. మంచి కంపెనీలు నష్టాల్లో ఉన్నపుడు ఆ షేర్లు కొనడం..ఆయన పాటించిన ఏకైక సూత్రం. కేవలం ఈ సూత్రంతోనే ఆయన బిలియన్లల కొద్దీ డాలర్లను సంపాదించారు.

సంపద ఎక్కువైతే సంపాదించడం కష్టం!: 1957-66 మధ్య కాలంలో ఎస్‌&పీ-500 ఆర్జించిన లాభం కంటే 14.5 రెట్ల మేర సంపదను బఫెట్‌ తన జేబులో వేసుకున్నారు. తాజా దశాబ్దంలో మాత్రం సూచీ కంటే కేవలం 2.2 రెట్ల మేర ధనాన్నే ఆయన కూడగట్టుకోగలిగారు. ఏమైంది? బఫెట్‌ మంత్రం బఫెట్‌కే పనిచేయలేదా..అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే..

బఫెట్‌ మొత్తం పెట్టుబడులు ఇపుడు 110 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయనుకుంటే.. మొత్తం మీద తేడా కనిపించాలీ అంటే కనీసం 2 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాలి. ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఏదైనా కంపెనీలో 10 శాతం కంటే ఎక్కువ షేర్లను కొనలేం, అమ్మలేం. ఆ లెక్కన బఫెట్‌ 2 బిలియన్‌ డాలర్లు పెట్టాలంటే ఆ కంపెనీ మార్కెట్‌ విలువ కనీసం 20 బిలియన్‌ డాలర్లు పైగా ఉండాలి. మరి ఆ స్థాయి కంపెనీలు ఎన్ని ఉంటాయి.

బఫెట్‌ మాటల్లో చెప్పాలంటే.. 'ఒక మిలియన్‌ డాలర్లపై ఏడాదిలో 50 శాతం లాభాలను తెచ్చిపెట్టగలను.. అందుకు నేను హామీ ఇవ్వగలను' అంటారాయన. దీన్ని బట్టి భారీ స్థాయి పెట్టుబడులున్నా కష్టమేనని తెలుస్తోంది. అయితే ఈ తరహాలో బఫెట్‌ లాంటి వ్యక్తులే ఉంటారు. కేవలం ఆరు నెలల్లోపు తన సంపదను 50 శాతానికి పెంచుకున్న మోనిష్‌ పబ్రాయ్‌ అనే హెడ్జ్‌ ఫండ్‌ మేనేజరు ఏం చెబుతారంటే..' నేను బఫెట్‌ను ఏమాత్రం సంకోచం లేకుండా అనుకరించా.. ఈ ఘనతంతా ఆయనదే'నంటారు. ఈయన ఇటీవలే క్రిప్టోలాజిక్‌ అనే కంపెనీలో షేర్లు కొన్నారు. ఆ సమయంలో కంపెనీ మార్కెట్‌ విలువ 250 మిలియన్‌ డాలర్లే.

ఇక గ్రీన్‌బ్లాట్‌ అనే మరో హెడ్జ్‌ ఫండ్‌ మేనేజరు కూడా తొలి పదేళ్లలో ఏటా 50 శాతం లాభాలు పొందారు. ఇరవై ఏళ్లలో మాత్రం 40 శాతానికే పరిమితమయ్యారు. అంటే బఫెట్‌లాగే ఎక్కువ పెట్టుబడులుంటే తక్కువ లాభాలొస్తాయని అర్థమైంది. ఆయన ఏం చేశారంటే మొత్తం బయటి పెట్టుబడుదారులందరినీ ఫండ్‌ నుంచి బయటకు పంపించి తన సొంత డబ్బుతో పెట్టుబడులను కొనసాగించారు.

వ్యాపారం అద్భుతంగా ఉంటే ఆకంపెనీ షేరు విలువ దానికదే పెరుగుతుంది.
- బఫెట్‌