Saturday, March 27, 2010

సెకండ్‌ హ్యాండ్‌ కార్లపై జీఎస్‌టీ సుంకం ప్రభావం ఉండనుందా ?

కేంద్ర బడ్జెట్‌లో పన్ను సుంకాన్ని 2శాతం మేర పెంచే యడంతో దేశీయ ఆటోమోబైల్‌ సంస్థలన్నీ కూడా వరుసపెట్టి తమ ఉత్ప త్తుల ధరలను పెంచేశాయి. మరి ఈ సుంకం ప్రభావం సెకండ్‌ హ్యాండ్‌ కార్ల విక్రయాలపై కూడా పడనుందా అనే విషయంపై దేశీయ ఆటో ఉత్పత్తుల సొెసైటీ (సియామ్‌) అధ్యయనం ఆరంభించింది. దేశీయంగా ఏటా 2 మిలియన్‌ కార్లు చేతులు మారుతుంటాయి. ఇంతే సంఖ్యలో కొత్త కార్ల విక్రయాలు కూడా జరుగుతాయి. ఈ కార్ల మార్కెట్‌లో అధి కంగా 3.5లక్షల విలువగల వాహనాల వినియోగం అధికంగా నమో దవుతోంది. ప్రస్తుతం ఈ విభాగం మార్కెట్‌ విలువ 70 వేల కోట్ల రూపాయలంటే నమ్మశక్యంగా లేదు.

దేశీయంగా అధికంగా మధ్య- తరగతి, ఎగువ మధ్య-తరగతి వారు ప్రాముఖ్యతను ఇచ్చేది రూ. 4 లక్ష లకు దిగువన ఉన్న కార్లకే కాబట్టి వీటి వినియోగం కూడా ఇప్పుడు వృద్ధి దిశగా సాగుతోంది. ఈ రోజుల్లో ఒక కారును అమ్మాలన్నా, లేదా సెకండ్‌ హ్యాండ్‌ వాహన సంస్థలు కారును కొని మరో వినియోగదారుకు విక్ర యించాలన్నా, ఇక్కడ ఎటువంటి ట్యాక్స్‌ క్రెడిట్లు ఉండబోవు. దీంతో పూర్తి స్థాయి రెవెన్యూ మొత్తాలపై పన్ను భారం పడే అవకాశాలున్నాయనీ ట్యాక్స్‌ కన్సల్టెంట్‌, ఛైర్మన్‌, ఎంసీసీఐ కమిటీ (ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్స్‌) కె వైదీశ్వరన్‌ తెలి పారు. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా వాట్‌ పన్నును కదిలించకుండా 4 శాతంగానే ఉంచాయి. ఇప్పుడు ప్రశ్నల్లా వ్యాట్‌ స్థానేన జీఎస్‌టీను అమలు పరిస్తే పరిస్థితి ఏంటి అని.