Saturday, March 27, 2010

10 రోజుల్లో భారతీ- జైన్‌ ఒప్పందంపై సంతకాలు

హెల్సింకీ: రానున్న పది రోజుల్లో కువైట్‌ టెలికాం సంస్థ జైన్‌కు చెందిన ఆఫ్రికా వ్యాపారం కొనుగోలు ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ శుక్రవారం తెలిపింది. 'డ్యూ డిలిజెన్స్‌ను ముగించాం. మా ఆఫర్‌కు జైన్‌ బోర్డు సమ్మతి తెలిపింది. దీనికి భారతీ బోర్డు కూడా ఆమోద ముద్ర వేసింది. ప్రత్యేక చర్చల గడువూ ముగిసింది. ఇప్పుడిక కసరత్తును పూర్తి చేయడానికి మాకు ఇంకా కొన్ని రోజులే ఉంది. నిర్ణయాత్మక ఒప్పంద పత్రాలపై సంతకాలే తరువాయి..'అని భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వైస్‌-ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజన్‌ భారతీ మిట్టల్‌ రాజన్‌ మిట్టల్‌ వివరించారు.