Friday, March 26, 2010

కాసులు కురిపిస్తున్న ఖనిజ సంపద

హుజూర్‌నగర్‌, మేజర్‌న్యూస్‌: రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా జిల్లాలో సున్నపు రాయి గనులు విపరీతంగా ఉండడం వలన పలువురు పారిశ్రామిక వ ేత్తలు మేళ్ళచెర్వు, మఠంపల్లి, నేరేడుచర్ల, దామరచర్ల మండలాలలో సిమెంట్స్‌ పరిశ్రమలు విరివిగా స్థాపించారు. శిలలపై శిల్పాలు చెక్కినారు... అన్న సిని గీతం అలా ఉంచితే గత పుష్కర కాలం వరకు దేనికి పనిరావని అందరు అనుకుంటూ వస్తున్న రాళ్ళు నేడు కనక వర్షం కురిపిస్తున్నాయి. దానితో జిల్లా రూపురేఖలు మారిపోయి సున్నపురాయి నుంచి ప్రతిరోజు వివిధ సిమెంట్‌ పరిశ్రమ నుండి లక్ష నుండి లక్ష యాభైవేల వరకు బస్తాలు సిమెంట్‌ ఉత్తత్పి అవుతూ నల్లగొండ జిల్లా నేడు సిమెంట్‌ ఇండస్ట్రిస్‌ దేశానికే తలమానిఖంగా నిలిచాయి.


సున్నపురాయితో పాలిస్‌ ఇండస్ట్రి అనూహ్యంగా అభివృద్ధి చెంది, జిల్లాలో 250 వరకు పాలిస్‌ మిల్లులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. దామరచర్ల మండలం అడవిదేవులపల్లిలో పాలిస్‌ మిల్లుల నుండి తయారైన గృహోపయోగకరమైన బండలు అమెరక, మలేషియా, సింగాపుర్‌ దేశాలకు ఎగుమతి అవుతున్నయంటే ఇక్కడి రాళ్ళు ఎంతటి ప్రాముఖ్యత కలదో వెల్లడవు తుంది. ఒక్కపుడు జిల్లాలో ఏ ముంది రాళ్ళు, రప్పలు తప్ప అన్న వృద్దులు నేడు వాటి ఆధారంగా వచ్చిన పరిశ్రమలు చూసి ఆశ్చర్యచకీతులు అవుతున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఉన్న అపారమైన ఖనిజ సంపద వివిధ పరిశ్ర మలలో ఉపయోగించే ముడి సరుకుగా ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా జి ల్లాలో లభ్యమయ్యే ఖనిజ సంపదలో పరిశ్రమలో లైమ్‌స్టోన్‌ మరియు విదేశా లలో కూడా అమ్ముడు పోయే గ్రానైట్‌ రాళ్ళు ఉన్నవి, వాటితో పాటుగా అణు బాంబులు తయారీలో ఉపయోగించే యూరేనియం నిల్వలు కూడా మన ప్రాంతంలో ఉండడం డిండి, పెదవూర మండలాలో నిక్షేపాలు భారీ స్థాయిలో ఉన్నట్లు పరిశోధనలో తేలింది. క్వార్జ్‌ లెవలు నిడమనూరు, దేవరకొండ మండలాలలో పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ పాలిస్‌ చేసిన బండలు విదేశాలకు తరిలించడం, జిల్లాలో వివిధ ప్రాంతాలలోని కొండలు, గుట్టలలో ఖనిజ సంప ద అపారంగా ఉద్దేశంతో కేంద్ర ్రపభుత్వం హెలికాప్టర్‌ ద్వారా కేంద్ర అటామిక్‌ రిసెర్చ్‌ బృందం ద్వారా ఏరియల్‌ సర్వే నిర్వహిస్తుంది.

పూర్వ కాలంలో కృషా నది తీరం వెంబడి గల మేళ్ళచెర్వు మండలం అటవి ప్రాంతంలో వజ్రాలు భారీ స్థాయిలో దొరికేవని, వెల్లటూరు గ్రామంలో వజ్రాలకు సాన పట్టే మిషన్‌ ఉంద ని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఖనిజ సంపద అపారంగా ఉండడం వలన పలువురు పరిశ్రమలు స్థాపించడం వలన స్థానికులకు ఉపాధి అవకా శాలు మెండుగా లభించడం సిమెంట్‌ పరిశ్రమల వలన ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి దొరుకుంది.