Tuesday, March 30, 2010

విశాఖ ఉక్కు ధరల మోత

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ధరలకు తిరిగి రెక్కలు వచ్చాయి. టన్నుకు రూ.3,000 చొప్పున పెంచేస్తూ సోమవారం కంపెనీ నిర్ణయం తీసుకుంది. పిగ్‌ఐరన్‌పై టన్నుకి రూ.2,500 చొప్పున, ఇతర లాంగ్‌ ప్రొడక్ట్స్‌పై టన్నుకి రూ.3000 చొప్పున పెంచింది. దీనికి 4% వ్యాట్‌ అదనం. పెంచిన ధరల ప్రకారం పిగ్‌ ఐరన్‌ టన్ను రూ.27,600కి చేరింది. 8 ఎం.ఎం., 10 ఎం.ఎం. రీబార్స్‌ ధర టన్ను రూ.40,560కి, 12 ఎం.ఎం. నుంచి 32 ఎం.ఎం. వరకు టన్ను రూ.40,460కి పెరిగింది. ఏప్రిల్‌ 1 నుంచి మరోసారి ధరలు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాజా పెంపు తర్వాత విశాఖ ఉక్కు ధరలు టన్ను రూ.40,000 దాటిపోయాయి. కర్మాగారం మార్చి 1న టన్నుపై రూ.1500 వరకు ధర పెంచిన విషయం విదితమే.

విశాఖ ఉక్కుకు ఐఎఫ్‌టీడీవో పురస్కారం
ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎఫ్‌టీడీవో) ప్రపంచ మానవ వనరుల అభివృద్ధి పురస్కారం-2010ను విశాఖ ఉక్కు కర్మాగారం అందుకోనుంది. అవార్డును ఏప్రిల్‌ 20న లండన్‌లో జరగనున్న 39వ ఐఎఫ్‌టీడీవో సదస్సులో అందజేస్తారు.