Wednesday, March 24, 2010

లిక్కర్‌ విక్రయాల్లో ఢిల్లీ నెంబర్‌ వన్‌..

న్యూఢిల్లీ : దేశంలో అత్యధికంగా లిక్కర్‌ విక్రయాలు దేశరాజధానిలో జరుగుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దేశీయ బ్రాండ్‌ల కన్నా ఫారెన్‌ లిక్కర్‌, దిగుమతి అయిన బ్రాండ్లకే ఢిల్లీ వాసులు ఓటు వేస్తున్నారు. ఢిల్లీ ప్రభు త్వం తాజా గణాంకాల ప్రకారం, అత్యంత ప్రాము ఖ్యతను సంతరించుకున్న పానీయంగా బీరు రెండవ స్థానాన్ని సంపాదించుకుంది. బీర్‌ తరువాతే వైన్‌ ఇతర ఫారిన్‌ బ్రాండ్‌ లిక్కర్‌లకు ఇక్కడి వాసులు ప్రాధా న్యాన్ని ఇస్తున్నారు. 2007-08 సంవత్సరంలో దేశీయ బ్రాండ్‌ లిక్కర్లలో 11.26కోట్ల లిక్కర్‌ బాటిల్స్‌ రాజధానిలో అమ్ముడయ్యాయి. ఇందులో 8.41కోట్ల బీర్‌ బాటిల్స్‌ ఉన్నాయి. ఈ ఏడాదిలో దేశీయ లిక్కర్‌ వ్యాపార వృద్ది రెండంకెలుగా నమోదైంది. అంతకు క్రితం 2006-07 సంవత్సరాల్లో కేవలం 6.05కోట్ల లిక్కర్‌ బాటిళ్ళ విక్రయాలు జరిగాయని ఎకై్సజ్‌ శాఖ గణాంకాలు తెలి పాయి. వీటితో పాటు ఫారెన్‌ బ్రాండ్‌ లిక్కర్‌లలో కూడా వృద్ధి చోటు చేసుకుంది.

2007-08 సంవత్సరంలో 8.36కోట్ల లిక్కర్‌ బాటిల్స్‌ ఫారిన్‌ బ్రాండువి అమ్ముడయ్యాయి. అంతకు క్రితం సంవత్సరం ఈ బ్రాండు విక్రయాలు 7.75శాతంతో నమోద య్యాయి. ఢిల్లీలో సుమారు 300 లిక్కర్‌ కౌంటర్లు ప్రభుత్వానికి చెందినవి కాగా, మిగతా 91 ప్రయివేటు లిక్కర్‌ కౌంటర్లు. గత కొద్ది సంవత్సరాలతో పోలిస్తే ఇక్కడి బీర్‌ విక్రయాలలో కూడా వృద్ది శాతం పెరిగింది.
2001-02 సంవత్సరాల్లో 3.39 కోట్ల లిక్కర్‌ బాటిళ్ళ విక్రయాలు నమోదవగా, 2007-08 లో 8.42కోట్ల లిక్కర్‌ బాటిళ్ళ విక్రయాలు నమోదయ్యాయి. ఈ విక్రయాల ద్వారా ప్రభుత్వ ఆదాయం 2009-10 సంవత్సరంలో (ఫిబ్రవరి 28వరకు) రూ.1494 కోట్లుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం లక్ష్యం ఈ ఏడా దిలో 1600 కోట్ల రూపాయలుగా ఉందనీ, ఈ మార్చి నెల పూర్తయ్యే నాటికి తామనుకున్న లక్ష్యాన్ని చేరు కుంటామని అధికారులు చెబుతున్నారు.

పది సంవత్సరాల క్రితం 2000-01లో ప్రభుత్వం ఆదాయం కేవలం 560కోట్ల రూపాయలుగా ఉండగా, 2007-08 సంవత్సరంలో 1295 కోట్ల రూపాయల వృద్ధి విక్రయాలు నమోదయ్యాయి. లిక్కర్‌ ద్వారా ఆదాయాలను పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నకిలీలను పసి గట్టేందుకు బార్‌- కోడింగ్‌ పద్ధతి ని లిక్కర్‌ బాటిళ్ళపై అమలులోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను గత నెలలోనే ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రాజెక్టుకు ప్రారంభ దశ లో 100 కోట్ల పెట్టుబడులు అవసరమౌతాయనీ, ఈ భారం మొదట ఉత్పత్తిదారులపైనే ఉండబోతుందనీ అధికారులు తెలి పారు. మరో ఆరు మాసాల్లో అన్ని విభాగాల లిక్కర్‌ బాటిళ్ళపై ఈ బార్‌-కోడింగ్‌ పద్ధతి తప్పనిసరి అవనుందని వారన్నారు.