ముంబాయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ల అధికారిక ప్రసార హక్కుదారు సెట్‌మ్యాక్స్ సుమారు రు.1000 కోట్ల రెవెన్యూ ఆదాయాలను పొందనుంది. మునపటి రెండు సీజన్ మ్యాచ్‌ల రెవెన్యూ రికార్డులను బద్దలు కొడుతూ ఈ హిట్ రికార్డును సృష్టించనుంది. పెరిగతున్న టీ20 మ్యాచ్‌ల వీక్ష కుల కారణంగా సెట్‌మ్యాక్స్ ఈ ఘనత సాధించనుందనీ మీడి యా విశ్లేష కులు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. మొదటి రెండు సీజన్లకు గాను సంస్థ 1,100 కోట్ల రూపాయల ఆదాయాల్ని సంపాదించింది. సెట్‌మ్యాక్స్ కనీ సం రు.2,100 కోట్లను సేకరిస్తుందనీ, ఇందులో ఐపీఎల్2 నుండి ఐపీఎల్5 మ్యాచ్‌ల సీజన్ వరకు బీసీసీకు సుమారు 2,460కోట్ల రూపాయలను ప్రసార హక్కుల కొరకై చెల్లించాల్సి ఉందనీ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు.
సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ వారి మల్టీ స్క్రీన్ మీడియా సంస్థ సెట్‌మ్యాక్స్ బీసీసీఐతో గత సంవత్సరం ఒప్పందం కుదుర్చుకుంది. 2009 నుండి జరిగే మొత్తం తొమ్మిది సీజన్ మ్యాచ్‌లకు గాను 8,200 కోట్ల రూపా యలను చెల్లించాలి. ఐపీఎల్2 సీజన్ నుండి ప్రతి సీజన్‌కు 615 కోట్ల రూపా యలను ఐపీఎల్5 సీజన్ వరకు ఈ సంస్థ బీసీసీఐకు చెల్లించాల్సి ఉంది. మిగతా రు.5,740 కోట్లను ఐపీఎల్6 సీజన్ నుండి చెల్లించాలి.
డైరక్ట్-టు-హోమ్ (డీటీహెచ్) సేవల ద్వారా తమ ఛానెల్ సబ్‌స్క్రిబ్షన్ మరింత పెరిగిందనీ, సెట్ మ్యాక్స్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. దీని వల్ల అడ్వర్టైజింగ్ రెవెన్యూలు కూడా ఊపందుకున్నాని అన్నారు. గత సీజన్ కన్నా సెట్‌మ్యాక్స్ రేటింగ్‌లు ఈ సీజన్‌లో పెరిగాయి, దీంతో పాటు యాడ్ రెవెన్యూలో కూడా రూ.750కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. గత సీజన్‌లో సౌత్ ఆఫ్రికాలో జరి గిన యాడ్ రెవెన్యూ కన్నా ఈ సారి రెండింతలు ఆశిస్తోంది. ఐపీఎల్2 సీజన్‌లో ప్రతి 10సెకండ్ల కమర్షియల్ బ్రేక్ సమయానికి రూ.3-3.5 లక్షలుగా నిర్ణ యించారు. ఈ సీజన్‌లో ఈ రేటును పెంచేస్తూ రూ.4-5లక్షలుగా సవరిం చారు. ఊహించని రీతిలో ఐపీఎల్ విజయం సాధించడంతో ఈ ఏడాది కూడా సెట్‌మ్యాక్స్ రికార్డులను బ్రేక్ చేయనుందనీ, అడ్వర్టైజర్లు కూడా ఈ మ్యాచ్‌లను లాభదాయకంగా మార్చుకునేందుకు ప్రీమియం రేట్లకే యాడ్‌లను ఇస్తున్నారనీ, లోదెస్టర్ యూనివర్సల్ సంస్థ సీఈఓ శశి సిన్హా తెలిపారు.
ప్రారంభ దశ నుండి ఐపీఎల్ రేటింగ్‌లలో అగ్రభాగాన ఉందనీ, ఈ సీజన్‌లో కూడా 4.7 రేంజ్‌లో రేటింగ్‌లు నమోదయ్యాయని టామ్ మీడియా రీసర్చ్ సంస్థ తెలిపింది. దేశం లోని టాప్ టెన్ రేటింగ్ హిందీ, ఇతర వినోద ఛానెల్లలో, 7స్లాట్లను సెట్‌మ్యాక్స్ ఛానల్ భర్తీ చేసిందనీ టామ్ రిపోర్ట్ తెలిపింది. ఐపీఎల్5 సీజన్ తరువాతే అసలు వృద్ధి రేటు సెట్‌మ్యాక్స్ సంస్థ కనబరుస్తుందనీ పలువురు మీడియా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ 6 నుండి బీసీసీఐకు ముఖ్యమైన ఫీజును చెల్లించాల్సి ఉన్నందున, వృద్ధిరేటుతో పాటు ఆదాయాల్ని కూడా సెట్ మ్యాక్స్ ఓ సవాల్‌గా తీసుకుని సాధించాలనీ క్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మార్కెటింగ్ సొల్యూషన్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్, ఇంద్రనీల్ దాస్ బ్లాహ్ తెలి పారు.