Monday, April 12, 2010

ఉత్పత్తులకే కాదు...

actorsహైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సినిమా తారల పేరు చెబితే చింతకా యలు రాలే కాలమిది. అయితే సినిమా స్టార్‌ కాకపోతే పొలిటికల్‌ స్టార్‌ వీరిద్దరికి ఉండే సెలెబ్రిటీ హోదా ఎవరికి ఉండదేమో. వారు దగ్గినా, తుమ్మినా వార్తగా చెలామణి అవుతున్న నేటి రోజుల్లో...వారు ఫలానా ఉత్పత్తిని కొనండి..నేను అదే వాడుతున్నాను అని ఒక ప్రకటన ఇస్తే చాలు వ్యాపారులకు కాసులు రాలినట్లే. కార్లు, బైకులు, ఎలక్ట్రానిక్స్‌, సౌందర్య సాధనాలు, శీతల పానీయాలు ఇలా ఎన్నో ఉత్పత్తులకు తారలు ప్రచార కర్తలుగా అదే (బ్రాండ్‌ అంబాసిడర్లు)గా వ్యవహరి స్తున్నారు. తెలుగు సినీ తారల విషయానికి వస్తే చిరంజీవి, మహేష్‌ బాబు థమ్స్‌అప్‌కు, పవన్‌ కల్యాణ్‌, రామచరణ్‌తేజ పెప్సికోకు భారీ ప్రచారం కల్పించారు. నవరత్న తైలంకు కూడా చిరు మెగా క్యాంపె యిన్‌ నిర్వహించారు.

తాజాగా నాగార్జున, భూమిలు ప్యారచూట్‌ కూల్‌ ఆయిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిమ్రాన్‌ కురుకురేకు, ప్రకాష్‌రాజ్‌ వోడాఫోన్‌కు ప్రచారం కల్పిస్తున్నారు. గతంలో గొల్లపూడి మారుతీరావు అమృతాంజన్‌కు, దాదాపు ప్రముఖ హీరోయిన్లందరూ వస్ర దుకాణాల రీటైల్‌ చెయిన్లకు పబ్లిసిటీ నిర్వహించారు. ఇక సినిమా తారలకు సౌందర్యాన్నిచ్చే సబ్బు లక్స్‌కు ప్రచారం నిర్వహించడం ఈనాటికి హీరోయిన్లకు ప్రతిష్టాత్మకంగా మారిందంటే ఆశ్చర్యం లేదు.

ఇక జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న బాలీవుడ్‌ తారలు బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌, సునీల్‌ శెట్టి, అమీర్‌ఖాన్‌, సెలీనా జైట్లీ, మాధవన్‌, జాన్‌ అబ్రహామ్‌ వంటి వారు ఉత్పత్తులకే కాకుండా ఇతర సాంఘిక పరమైన అంశాలు, సమాజంలో చైతన్యం కలిగించే వి షయాలకు నేడు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. క్యాడ్‌ బరీస్‌, రీడ్‌ అండ్‌ టేలర్‌, పార్కర్‌ పెన్నులు మొదలైన వాటికి ప్రచారం నిర్వహించిన అమితాబ్‌ ఇప్పుడు రాష్ట్రాలను ప్రమోట్‌ చేసే పనిలో పడ్డారు. ఆమధ్య ఎన్నికల సీజన్‌లో ఉత్తరప్రదేశ్‌ సాధించిన విజయా లకు ప్రచార భూమిక నిర్వహించారు. ఆ రాష్ట్రంలో పర్యాటక ప్రాం తాల గురించి మాట్లాడారు. తాజాగా గుజరాత్‌, మహారాష్ట్ర, కేరళ టూ రిజం శాఖలకు కూడా ప్రచారం నిర్వహించే పనిలో ప్రస్తుతం బిగ్‌బి ఉన్నారు. బాలీవుడ్‌ సెక్సీ స్టార్‌ జాన్‌ అబ్రహాం ప్రపంచ వ్యాప్తంగా పేదల కు ఇల్లు కట్టించే హ్యాబిటేట్‌ ఫర్‌ హ్యూమానిటీ సంస్థకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఈయన ఫుట్‌బాల్‌ క్రీడను కూడా ప్రోత్సహిస్తున్నాడు.

త్రీ ఇడియట్స్‌ చిత్రంలో నటించడానికి బ్యాంకాక్‌ వెళ్ళిన సమయంలో మాధవన్‌ అక్కడ ఈ సంస్థ నిర్మిస్తున్న ఇళ్ళకు ఇటుకలు కూడా మోశాడు. వీరిద్దరూ ఆ సంస్థకు ప్రచార కర్తలే. మన కు క్రీడలంటే ముందు గుర్తొచ్చేది క్రికెట్‌. అయితే సాంప్రదాయ భార తీయ క్రీడలు నేడు కనుమరుగై పోతున్నాయని, వీటికి ప్రచారం కల్పిం చి పునరుద్ధరించాలని కంకంణం కట్టుకున్న కండల వీరుడు సునీల్‌ శెట్టి రెజ్లింగ్‌, కుస్తీ వంటి క్రీడలకు ప్రచార కర్తగా పనిచేస్తున్నాడు. దేశంలో ఎక్కడ రెజ్లింగ్‌ పోటీలు జరిగినా అక్కడ ముఖ్య అతిధిగా హాజరై హుషారు కలిగిస్తున్నాడు. ఇక వెండితెరపై మార్షల్‌ ఆర్ట్స్‌లో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించే అక్షయ్‌కుమార్‌ కరాటేను ప్రోత్సహించడానికి ముందుకొస్తున్నాడు. గత ఏడాది ముంబైలో జరిగిన కరాటే ఛాంపియన్‌ షిప్‌కు అక్కీయే ప్రధాన అతిధి. అంతేకాదు ఈ ఏడాది ఫిబ్రవరి 12 నుండి కెనడాలో జరిగిన కరాటే వింటర్‌ ఒలింపిక్స్‌ భారత్‌ నుండి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. జనవరిలో ఒంటారి యో వెళ్ళి అక్కడ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు.

లగాన్‌, తారే జమీన్‌ పర్‌, గజనీ, త్రీ ఇడియట్స్‌ చిత్రాల ద్వారా ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన అమీర్‌ఖాన్‌ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం నిరసిస్తూ..వారిలో చైతన్యం కలిగించడానికి పాటు పడుతున్నాడు. పరీక్షలలో, ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకుంటూ తల్లిదండ్రులకు కడుపు కోత రగి లించడం తగదంటూ ప్రకటనల్లో నటిస్తున్నాడు. ఇందుకోసం భారీ ప్రచార కార్యక్రమం చేపట్టిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ అనే స్వచ్చంధ సంస్థకు అమీర్‌ ప్రాతినిధ్యం విహ స్తున్నాడు. ఇక స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడి వార్తల్లో నిలిచిన అందాల నటి సెలినా జైట్లీ వారి కోసం 2002లో మూతపడ్డ ఒక పత్రికను కొనుగోలు చేసి సారధ్యం వహిస్తోంది. స్వలింగ సంప ర్కుల వార్తలు, విశేషాలు, ముచ్చట్లతో నిండివుండే ఆ పత్రిక పేరు ‘బాం బే దోస్త్‌’. మన టాలీవుడ్‌లో కూడా సామాజిక అంశాలను ప్రచారం చేయడానికి తారలు ముందుకు వస్తే బావుణ్ణు.