Monday, April 12, 2010

అంతర్జాతీయ చిన్నకార్ల ఉత్పత్తిదారుగా భారత్‌

న్యూఢిల్లీ : మరో మూడు సంవత్సరాల్లో ఆటోమోబైల్‌ డిజైన్‌ సెంటర్‌- కమ్‌- ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నా హాలు చేస్తోంది. ఆటోమేటివ్‌ మిషన్‌ ప్లాన్‌ 2016 ద్వారా అంతర్జాతీయంగా భా రత్‌ చిన్న కార్ల ఉత్పత్తిదారుగా అవతరించేందుకు గాను ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ అధ్వర్యంలో రానున్న నేషనల్‌ ఆటో మేటివ్‌ టెస్టిం గ్‌ అండ్‌ ఆర్‌అండ్‌డీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్‌ (ఎన్‌ఏటీ ఆర్‌ఐపీ) పై ప్రస్తుతం అధ్యయనాలు జరుగుతు న్నాయి. మరో ఆరు మా సాల్లో ఈ ప్రాజెక్టు ప్రతిపాద నపై ఓ నివే దికను భారీ పరిశ్ర మల శాఖ కేంద్రానికి అం దివ్వ నుంది.

ఆటోమేటివ్‌ మిషన్‌ ప్లాన్‌ 2016 పథకం ద్వారా ఈ డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నా మనీ, ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై అధ్యయనాలు సాగుతు న్నానీ ఎన్‌ఏటీఆర్‌ఐపీ సీఈఓ, ప్రాజెక్ట్‌ డైరక్టర్‌ రాజేశ్‌ సింగ్‌ తెలిపారు. పలు సంస్థల భాగస్వామ్యం ద్వారా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నామనీ, ఇందులో ఎన్‌ ఐడీ, సియామ్‌, ఏసీఎంఏ, ఐఐటీ ముంబాయితో పాటు ఇతర విదేశీ భాగ స్వాములు కూడా ఉన్నారనీ తెలిపారు. భారత్‌ను అంతర్జాతీయంగా చిన్న కార్ల ఉత్పత్తి కేంద్రంగా (హబ్‌) రూపుదిద్దేందుకు తమకు పలు ఆటో సంస్థలతో పాటు ఉత్పత్తి సౌకర్యాలు, డిజైనర్లూ అవసరమనీ సింగ్‌ అన్నారు. 145 బిలి యన్‌ డాలర్ల ఉత్పత్తి లక్ష్యంతో ఏర్పాటు కానున్న ఈ అంతర్జాతీయ కేంద్రం ద్వా రా 10శాతం దేశ ఆర్థిక వృద్ధితో పాటు 25మిలియన్‌ల ఉద్యోగాలను అద నంగా ప్రభుత్వం కల్పించనుందనీ పేర్కొన్నారు. విద్యా కేంద్రం ద్వారా వివిధ గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌-గ్రాడ్యు యేషన్‌ కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నామనీ తెలిపారు.

మరో మూడు సంవత్సరాల కాల వ్యవధిలో ఈ అంతర్జాతీయ ఆటో కేంద్ర కార్యకలా పాలను ప్రా రంభిస్తుందినీ సింగ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రతిపాదనపై అధ్యయనం కొనసాగుతోందనీ మరో ఆ రు మాసాల్లో ఈ నివేదికను కేబినెట్‌ ఆమోదానికి ఎన్‌ ఏటీఆర్‌ఐపీ సమర్పిస్తుందన్నారు. ప్రాజెక్టు ఏర్పా టుకు కావాల్సిన భూ-సేకరణ కార్యక్రమాలు ఇప్పటికే పూర్త య్యాయనీ, గుర్‌గావ్‌, పుణె, చెనై్న ప్రాంతాల్లోని ఒటకి ఇందు కు ఖరారు కానుందన్నారు. ప్రస్తుతం ఆటో రంగ సహజ ఉత్పత్తులకై విదే శాలపై ఆధారప డుతున్న ఉత్పత్తిదారులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా మారనుందనీ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ప్రకారం దేశీయ ఆటో రంగ పరిశ్రమ 2008-09 సంవత్సరానికి గాను సుమారు రు.2,02,000కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసిందనీ పేర్కొంది.