Monday, April 12, 2010

దర్జాగా ‘వైట్‌స్టోన్’‌ దోపిడీ

land-sandమహబూబ్‌నగర్‌, ‌: కరవుకు వలసలకు పర్యాయపదంగా మారిన పాలమూరు జిల్లాలో మైనింగ్‌ మాఫియా యథేచ్చగా దోపిడీ కొన సాగిస్తున్నది. అధికారుల అండ దండలతో సంబంధిత యజమానులు ‘వైట్‌స్టోన్‌ దోపిడీ’ నిరాటంకంగా సాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూ ర్‌ మండలం 7వనంబరు జాతీయరహదారికి కూతవేటు దూరంలో తాటిపర్తి-కొత్తూరు గ్రామాల సమీపంలో ఆదిత్య మైన్స్‌ పేరిట పదేళ్ల క్రితం 50ఎకరాల స్థలం లీజుతో ఏర్పాటై నేడది అక్రమంగా 150ఎకరా లకు పాకింది. తాటిపర్తి గ్రామ శివారులో సర్వేనం.57లో ఏడాదికి కేవ లం హెక్టారుకు రూ.50లతో కంపెనీ 50 ఎకరాలను లీజుకు తీసుకుంది.

stoneఅయితే అధికారులఅండదండలతో 150 ఎకరాలకు విస్తరించి కేవ లం 50 ఎకరాలకు మాత్ర మే నామమాత్రపు లీజు ఫీజు చెల్లిస్తున్నారు. గ్రామ సమీపంలోనే మైనింగ్‌ వుం డటం వల్ల బ్లాస్టింగ్‌కు శక్తి వంతమైన పేలుడు సామ గ్రి వాడటంతో ఇళ్లన్నీ పగు ళ్లు ఇచ్చాయి. సమీపంలో ని వ్యవసాయ పొలంలో బోరు బావులు కూలిపోయి పూర్తిగా వట్టిపోయాయి. దీంతో వ్యవసాయానికి ఇబ్బందిగా మారింది. తాగు నీటికి సైతం అనేక అవస్థలు పడాల్సి వస్తోంది సాధారణంగా బ్లాస్టింగ్‌ చేయటానికి ప్రభుత్వం కొన్ని నిబంధ నలు విధిస్తుంది. అయితే ఆ నిబంధనలను ఏమాత్రం ఖాత రు చేయకుండా ఒకేసారి 20 నుంచి 30 అడుగుల లోతు వరకు డ్రిల్‌ వేసి శక్తివంతమైన మండు గుండు సామగ్రి వాడుతున్నారు.

బ్లాస్టింగ్‌ చేసిన రాళ్లను సమీపంలోనే పౌడర్‌ చేస్తున్నారు. దీంతో క్వార్జ్‌, పెల్స్‌ఫేర్‌ తదితర తయారిలో ఉప యోగించి కోట్లు ఆర్జిస్తున్నారు. పౌడర్‌ తయారి చేసే సమ యంలో వచ్చే దుమ్ము కారణంగా గ్రామంలో ప్రజలు సిలికో సిస్‌ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో షాద్‌నగర్‌ సమీ పంలో ఎలికట్ట గ్రామంలో ఈ వ్యాధిబారిన పడి 150మంది మృత్యువాత పడ్డారు. ఈ కారణం చేతనే గ్రామస్తులు ఎలాగై నా కంపెనీని అడ్డుకోవాలని, ఇక్కడనుంచి కంపెనీ తొలగిం చాలని చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి.

sand అందు కు గ్రామంలో కొందరిని కంపెనీ నిర్వహకులు మచ్చిక చేసు కోవటం, మైనింగ్‌ శాఖలో అధికారుల అండదండలు పూర్తి గా ఉండటం, మరికొంతమంది పేరుగాంచిన నాయకుల తోడ్పాడు వుండటంతో అక్కడినుంచి కదలలేకుండావున్నారు.ఇటీవలే మైన్స్‌లో ప్రమాదవశాత్తు ఓ యువకుడు మరణిం చినప్పటికీ నిర్వహకులు పట్టించుకోకపోవటంతో ఆగ్రహిం చిన కొందరు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కొందరు నేతలు మధ్యవర్తిత్వం వహించి కేవలం రూ.25 వేలు ప్రాణం ఖరీదుగా నిర్ణయించారు. మృతి చెంది న యువకుడు సైతం బీహర్‌కు చెందిన వాడు కావటంతో ప్రశ్నించే నాథుడు కరువయ్యాడు.

నెమళ్లు కనుమరుగు..
ఈ మైన్స్‌ కారణంగా గ్రామ పరిసర ప్రాంతాల్లో వున్న నెమ ళ్లు పూర్తిగా అంతరించి పోయాయి. సామాజిక అడవుల పెంపకం పేరుతో గతంలో ఈ ప్రాంతం అభివృద్ధి చేశారు. అందులో భాగంగానే వందలాది చెట్లను పెంచారు. అయితే కంపెనీ వాహనాలు ఇష్టారాజ్యంగా తిరగటంతో చెట్లు దెబ్బ తిన్నాయి. దీంతో పాటు నెమళ్లు పూర్తిగా అంత రించిపోయా యి. వన్యప్రాణులు, అటవీ జంతువులు సైతం కానరాకుండా అయ్యాయి.

ఉపాధి సైతం స్థానికేతరులకే...
గ్రామ శివారులో మైన్స్‌ ఏర్పాటు చేసి దాని వల్ల వచ్చే నష్టా లన్నీ గ్రామస్తులు అనుభవిస్తుండగా ప్రయోజనాలు మాత్రం యజమానులు పొందుతున్నారు. మైన్స్‌లో పనిచేసే సిబ్బంది మొత్తాన్ని బీహర్‌ నుంచి తీసుకురావటం గమనార్హం. వారికి తెలుగు భాష రాకపోవటంతో మైన్స్‌లో జరిగే అక్రమాలు వెలుగు చూసే అవకాశం లేకుండా పోయింది. స్థానికంగా వున్న వారంతా జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, భూత్పూర్‌ ప్రాంతా లకు వలస వెళ్తుండగా మైన్స్‌ నిర్వహకులు పట్టించుకోకుం డా ఇతర ప్రాంతాల వారిని నియమించుకోవటం విమర్శలకు తావిస్తోంది.

పొంతనలేని మాటలు...
మైనింగ్‌లో బ్లాస్టింగ్‌కు అనుమతి తీసుకున్నామని కంపెని యండి అశోక్‌సింగ్‌ చెబుతుండగా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని మైనింగ్‌ ఎడి వెంకట్‌రెడ్డి చెబుతున్నారు. ఇటీవ లే ఆ మైనింగ్‌ కంపెనీని సందర్శించిన సదరు ఎడి గ్రామ స్తుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకుని వచ్చా రు. అయితే అదే శాఖలో కిందిస్థాయి ఉద్యోగిగా గ్రామానికి చెందిన వ్యక్తి పనిచేస్తుండగా గ్రామస్తులు అతడిపై దాడికి పాల్పడ్డారని సమాచారం.

అక్రమ బ్లాస్టింగ్‌తో ఇళ్లు ఖాళీ..అశోక్‌ గౌడ్‌, గ్రామస్తుడు
ashokఅక్రమ బ్లాస్టింగ్‌తో గ్రామంలో ఎవ్వరము వుండలేకపో తున్నాము. పాత ఇళ్లు కూలిపోగా వాటి స్థానంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నప్పటికి వాటికి పగుళ్లు రావటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నామన్నారు.

బోరుబావులు పూడి వ్యవసాయానికి దెబ్బ : భీమయ్య
bemaiahబ్లాస్టింగ్‌ వల్ల బోరుబావుల న్ని పూడి పోయి వ్యవసాయం చేయలేకుండా వున్నాము. అసలే కరువుతో సాగు చేయకుండా వలస బాటను పట్టాల్సి వస్తుంది. రాళ్లు ఎగిరి వచ్చి ఎపుడు ఎవరిపైన పడుతాయన్న భయం, పౌడర్‌ వల్ల ఏదో తెలియన రోగాల బారిన పడుతున్నాము.

కంపెనీ మూసేయించి ప్రాణాలు కాపాడండి : తిర్పతయ్య
companyబ్లాస్టింగ్‌ కంపెని మూసి మా ప్రాణాలు కాపా డండి. మహిళా గ్రూపుల రుణాల తో ఇళ్లు కట్టు కుందామంటే గుర్తు తెలియని రోగాలతో మా బతుకులు అధ్వానంగా అయ్యాయి. కట్టుకున్న ఇళ్లేమో కూలిపోతున్నాయి. అధికారులేమో కంపెనోళ్ల దగ్గర లాలూచి పడుతు న్నారు. వారు ఇక్కడుంటే తెలిసేది.