Thursday, April 1, 2010

వేతన జీవులకు ఊరట

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను నూతన విధానం గురువారం (ఏప్రిల్‌ 1) నుంచి అమల్లోకి రానుంది. ఇది రూ. 3 నుంచి 8 లక్షల మధ్య వేతనం గలవారికి గతంలో కంటే ఎక్కువ మొత్తాన్నే ఇది జేబుల్లో మిగల్చనుంది. ఇప్పటి వరకూ 20.60 శాతం, 30.90 శాతం చొప్పున పన్ను చెల్లించిన ఈ వేతనజీవులు ఇక పై 10.3 శాతం, 20.6 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఈ పన్నులు 3 శా తం ఎడ్యుకేషన్‌ సెస్‌తో కూడుకున్నవి. కార్పొరెటు సంస్థలకు మాత్రం పన్ను 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది.