Tuesday, April 6, 2010

ఏసీలకు భలే డిమాండ్‌

న్యూఢిల్లీ : వేసవికాలం ఎండలు మండుతుండటంతో ఎయిర్‌కండిషనర్లకు మళ్ళీ సీజన్‌ మొదలైంది. ఏసీ ఉత్పత్తి సంస్థలన్నీ కూడా ఈ వేసవిలో తమ విక్ర యాలను రెండింతలు చేసుకోనున్నాయి. ఈ కోవలో కొరియన్‌ సంస్థ ఎల్‌జీ ఈ సీజన్‌లో 50-70శాతం విక్రయాల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ సంస్థ గత రెండు మాసాల్లో సుమారు రూ.800కోట్ల వ్యాపారాన్ని ఎసీ మార్కెట్లో నమోదు చేసింది. గత ఏడాది ఎల్‌జీ సంస్థ 16 ఏసీ మోడళ్ళను మార్కెట్‌లో విడుదల చేసి, రూ.1600 కోట్ల వ్యాపారాన్ని 2009లో నమోదు చేసింది. ఈ ఏడాది వేసవి సీజన్‌లో రూ.2,500కోట్ల రూపాయల లక్ష్యాన్ని నిర్ణయించుకుంది.

ఇదే మాదిరిగా మరో దేశీయ సంస్థ కారియర్‌ ఇండయా, గత ఏడాది కన్నా ఈ సారి తమ విక్రాయల్లో ప్రోత్సాహకరమైన వృద్ధిని నిర్వ హిస్తోందని తెలిపింది. ఎన్ని విక్రయాలు నమోదైనదీ సంస్థ తెలుపకపోయినా, ఈ ఏడాది ఏసీ విక్రయాలు క్రితం సారి కన్నా బాగా ఉన్నాయని సంస్థ డైరక్టర్‌ (మార్కెటింగ్‌ ప్రణాళిక) కృష్ణన్‌ సచ్‌దేవ్‌ తెలిపారు. కొత్త ఆఫర్ల వెల్లువతో పాటు అధిక వేతనాల వినియోగదారులు అధిక స్టార్‌ రేటింగ్‌లు, అధిక ఇంధన ఆధారిత ఏసీలకు ప్రాముఖ్యతను ఇవ్వడంతో ఈ విభాగంలో విక్రయాలు జోరందుకున్నాయన్నారు. ఇప్పుడు ఏసీ ఉత్పత్తులను లగ్జరీగా వినియోగదా రులు చూడటం లేదనీ, అవసరమైన సాధనంగా మాత్రమే చూస్తున్నారనీ, ఎల్‌జీ సంస్థ బిజినెస్‌ హెడ్‌ (ఏసీ మార్కెట్‌) అజయ్‌ బజాజ్‌ తెలిపారు. గత ఏడాది ఈ మార్కెట్‌ 2.7మిలియన్‌ యూనిట్లుగా అంచనా నమోదైందనీ, ఈ ఏడాది 50శాతం వృద్ధిని ఆశించవచ్చనీ పేర్కొన్నారు.

వినియోగదారుల అభి రుచులు కూడా మారుతున్న క్రమంలో అధిక స్టార్‌ రేటింగ్‌లు గల ఏసీలకే ప్రాధాన్యం ఇస్తున్నారనీ, తద్వారా ఈ సారి విక్రయాలు జోరుగా సాగుతు న్నాయని తెలిపారు. ఇప్పటికే ఏసీల విభాగంలో విస్తరణ పనులను చేపట్టిన పానసోనిక్‌ సంస్థ గత రెండు-మూడు మాసాల్లో 400శాతం వృద్దిని సాధించింది. సంస్థ మోత్తం టర్నోవర్‌లో 25శాతం వాటా ఒక్క ఏసీలదే కావడం విశేషం. గత ఏడాది వరకు తమ ఉత్పత్తుల మార్కెట్‌ బలహీనంగా ఉన్న ప్పటికీ, ఈ ఏడాది పలు కొత్త ఎంట్రీ లెవల్‌ ఉత్ప త్తులను ప్రవేశపెట్టి తిరిగి ఈ విభాగంలో విస్తరిం చామనీ పానసోనిక్‌ సంస్థ మార్కెటింగ్‌ హెడ్‌ మనీష్‌ శర్మా అన్నారు. ఏసీ సంస్థల వరుసలో మరోటి సామ్‌సంగ్‌ ఇండియా తాజాగా 10మిలియన్‌ డాలర్ల పెట్టుబడని, ఏసీల ఉత్పత్తిని పెంచుకునేందుకు గాను ప్రకటించింది. 1.2 మిలియన్‌ యూనిట్లకు సామర్థ్యాన్ని పెంచుకుని, రెండింతల వృద్ధిని 1 మిలియన్‌ యూనిట్లుగా ఈ సీజన్‌లో చేయనుంది. ఎయిర్‌కండిషనర్ల మార్కెట్‌ ఇంకా నియమితంగానే దేశీయంగా ఉందనీ, వృద్ధి అవకాశాలు ఈ విభాగంలో అధికంగా ఉన్నాయనీ తెలిపారు. మొత్తం మీద ఈ వేసవి సీజన్‌పై పరిశ్రమ వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.