మండపేట, మేజర్‌న్యూస్: కార్పొరేట్ రంగాన్ని మించి పోయింది కోళ్ల పరి శ్రమ. కోళ్లే కదా అని ఈ రంగం వైపు ఆసక్తి చూపనివారికి ఈ వ్యాపార లావా దేవీలు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఒక్క ఉభయగోదావరి జిల్లాల్లోని గోదా వరి జోన్‌లో సంవత్సరానికి రూ.1800 కోట్లు ఈ కోళ్ల పరిశ్రమ ద్వారా వ్యాపా రం జరుగుతుంది. దేశంలో మన రాష్ట్రం కోళ్ల పరిశ్రమకు పెట్టింది పేరైతే అందులో గోదావరి జిల్లాల్లో ఈ పరిశ్రమ వేళ్లూనుకుని ఉంది. గతంలో ఆటు పోట్లును ఎదుర్కొన్న ఈ పరిశ్రమ గత రెండు సంవత్సరాల నుంచి ఆశాజన కంగా ఉంది. ఫీడ్ రేటుకు అనుగుణంగా గుడ్డురేటు కూడా పెరగడంతో కోళ్ళ పరిశ్రమ నిర్వాహకులు నష్టాలను అధిగమించి లాభాల బాట పట్టారు.
ఫారా లలో పనిచేసే కార్మికుల సం ఖ్య క్రమేపీ తగ్గిపోతున్నదని ఆందోళన చెందుతు న్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమలో కొత్త టెక్నాలజీ ఉప యోగించి లేబర్ అవసరం తగ్గించాలని చూస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదా వరి జిల్లాల్లో సుమారు 300 వరకు చిన్న, పెద్దా కలిపి కోళ్ల ఫారాలు (పరి శ్రమలు) ఉండగా నాలుగు కోట్ల వరకు లేయర్ (గుడ్లుపెట్టే) కోళ్లు పెంచుతు న్నారు. వీటినుంచి ప్రతీరోజూ మూడుకోట్లు గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో లోకల్‌గా 50 లక్షల గుడ్లు వినియోగమవుతుండగా మిగతా 2.50 కోట్లు గుడ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. రోజుకు రూ.5కోట్లు చొప్పున నెలకు రూ.150 కోట్లు, సంవత్సరానికి రూ.1800 కోట్ల వ్యాపారం ఈ పరిశ్రమల ద్వారా జరుగుతోంది.
రెండు జిల్లా ల్లోని 40 వరకు ఎగ్ ఎక్స్ పోర్టర్స్ (ట్రేడర్స్) ఉన్నారు. గోదావరి జోన్‌లో ఉత్పత్తి అయిన కోడిగుడ్లను ఒరి స్సా, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, నాగాలాండ్ తదితర రాష్ట్రాలకు గుడ్లు ఎగుమతి చేస్తున్నారు. ఈ జిల్లాల నుంచి ప్రతీరోజూ సుమారు 60 లారీలకు పైగా గుడ్లు రవాణా చేస్తున్నాయి. రాష్ట్రాల లోని పరిశ్రమ పరిస్థితులు, పీడ్‌రేట్లు, సప్లయ్, డిమాండ్‌ను బట్టి జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ (నెక్) గుడ్డురేటును నిర్ణయిస్తుంది. గత కొంతకాలం నుంచి పౌల్ట్రీ ఫీడ్ రేట్లు నిలకడగా ఉండటంతో ఆటుపోట్లను నిలదొక్కుకుని లాభాల బాట పట్టింది. ప్రస్తుతం వేసవి సీజన్ కావడంతో పై రాష్ట్రాల్లో గుడ్ల వినియోగ ం తగ్గుతుంది.
అలాగే ఉత్పత్తిపై కూడా వేసవి ప్రభావం ఉంటుంది. దాంతో ఏప్రిల్, మే, జూన్‌ల వరకు ఫారాల్లో కొంత వరకు వ్యాపారం సన్నగిల్లే పరిస్థితి ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా కోళ్ల దాణాలో ఉప యోగించే మక్కజొన్న పంట మొన్నటి వరకు కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చేది అటువంటిది ఈ సంవత్సరం నుంచి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మక్కజొన్న పంటను అధి కంగా వేయడంతో గత సంవత్సరం క్వింటాళ్లు రూ.1200కు చేరుకున్న మక్క జొన్న ప్రస్తుతం రూ.880లకే సరఫరా అవుతున్నది. దాణాలో మరో ముఖ్య మైన సోయాబీన్ రూ.2,500 ఉన్నది రూ.1950, సన్‌ఫ్లవర్ కేక్ రూ. 1900 నుంచి రూ.1400కు దిగింది. ప్రస్తుతం నెక్ నిర్ణయించిన రేటు గుడ్డుకు రూ. 1. 92 పైసలు ఉంది. రూ.2లు ఈ వేసవి వరకు ఉంటే పరిశ్రమ ఆశాజనకం గా ఉంటుందని నిర్వాహకులు అంటున్నారు.
వేలాదిమందికి ఉపాధి:లక్ష కెపాసిటీగల ఫారంలో 14 మంది కూలీలు పనిచేస్తారు. ఈవిధంగా రెండు జిల్లాల్లోను 16 వేల మంది ప్రత్యక్షంగాను, మరో 10 వేలమంది పరోక్షంగాను ఈ పరిశ్రమ వల్ల ఉపాధి పొందుతున్నారు. కోళ్ల పరిశ్రమకు అనుగుణంగా కోడిగుడ్లు ఎగుమతయ్యే అట్టలు, బాక్సులు అలాగే రవాణా వ్యవస్థకు సంబంధించి లారీలకు దీనివల్ల 50 శాతం వరకు ప నులు కచ్చితంగా లభిస్తున్నాయి. రోజురోజుకు మారుతున్న పరిస్థితులకు అను గుణంగా గతంలో పది వేల కెపాసిటీ గల ఫారాలు లక్ష కెపాసిటీకి చేరుకోవడం వంటివి ఈ ప్రాంతంలో జరిగాయి. స్థలం అనుకూలమైన పరిస్థితిని బట్టి ఇతర రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏర్పాటవుతున్న పౌల్ట్రీ పరిశ్రమ 10 లక్షల నుంచి 25లక్షల కెపాసిటీతో ఏర్పాటు చేస్తున్నారని జాతీయ గుడ్ల సమన్వయ కమిటీలో సభ్యులు, ద్వారపూడికి చెందిన శ్రీసాయిరాం ఎగ్ ఎక్స్‌పోర్ట్సు అధినేత మర్రెడ్డి శ్రీనివాసరావు అన్నారు.
మన ప్రాంతానికి చెందిన వారే మహా రాష్టల్రోని రాయ్ పూర్‌లో 23లక్షల కెపాసిటీతో ఒకే ప్రాంగణంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారన్నారు. ఇక్కడ లేబర్ అవసరం లేకుండా మిషనరీతోటే ఫారం నడుస్తుం దన్నారు. కేవలం కోడి పెట్టిన గుడ్లను ప్యాక్ చేయడానికి మాత్రమే కార్మికు లుంటే సరిపోతుందన్నారు. ఈ విధానం ప్రస్తుతం అమెరికా దేశంలో ఉంద న్నారు.గోదావరి జిల్లాల్లో కోళ్ల పరిశ్రమలో పనిచేసే కూలీలు రానురాను కరువవు తున్నారని, కూలీల కొరత వల్ల కొంత పరిశ్రమకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కూడా కోళ్ల పరిశ్రమకు పెద్దగా గుర్తింపు ఇవ్వడం లేదని అదే ఇతర రాష్ట్రాల్లో అయితే విద్యుత్ సరఫరాలో రాయితీ, ఫారాల ఏర్పాటుకు సబ్సిడీపై రుణాలు, వ్యవసాయ పరిశ్రమగా కోళ్ల పరిశ్రమకు గుర్తింపునిచ్చి ఇత ర రాయితీలను కూడా వర్తింపచేస్తున్నాయన్నారు. మనరాష్ట్ర ప్రభుత్వం ఈ పరి శ్రమపై కొంత దృష్టి పెడితే మరింత అభివృద్ధి చెందగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.