హైదరాబాద్ : నూతన పారిశ్రామిక పాలసీ(2010-15)కి అ డుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఒక వైపు నిధుల సమస్య నీడలా వెంటాడుతోంది. మరోవైపు విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలు పరిశ్రమల శాఖకు సవాల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో కొత్త పారిశ్రామిక పా లసీ ఎప్పుడు గట్టెక్కుతుందో కూడా తేలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. వచ్చే ఐదేళ్లకు ఈ పాలసీ ప్రకటించాల్సి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు, ఇతర మౌలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా కూడా ముమ్మర కసరత్తు ప్రారంభించింది. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక సబ్సిడీలు, రాయితీలు కల్పించడం ద్వారా సమగ్ర పారిశ్రామిక వృద్ధిని సాధించాలని పరిశ్రమల శాఖ భావిస్తోంది.
గతంలో కూడా రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం, ఆదిలాబాద్, అనంత పురం జిల్లాల్లో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేక రాయితీలు, సబ్సిడీలతో కూడిన ప్రోత్సాహకాలు ప్రకటించినప్పటికీ అంతగా ప్రయోజనం చేకూరలేదు. 2010-15 నూతన పారిశ్రామిక పాలసీలో వెనుకబడిన ప్రాం తాల ఆధారంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందచేస్తే ఆ ప్రభావం రాష్ట్ర పారి శ్రామిక ప్రగతిపై పడుతుందని, భౌగోళిక, మౌలిక పరిస్థితులకు అనుగు ణంగానే పెట్టుబడులు వస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభు త్వం వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయలు అభివృద్ధి పరచకుండా పెట్టుబడులు ఎంతమాత్రం రావని పారిశ్రామిక నిపుణులంటున్నారు. అధికార వర్గాల్లోనూ దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గుజరాత్ విజయ రహాస్యం మిదే..
దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే అత్యధిక పారిశ్రామిక పెట్టు బడు లతో గుజరాత్ దూసుకుపోతోంది. తాత్కాలిక ప్రయోజనాలు చేకూర్చే స బ్సిడీ లు, రాయితీల ప్రోత్సాహకాలకంటే దీర్ఘకాలిక ప్రయోజనాలతో కూడిన మౌలిక, ఇతర సదుపాయాల రూపకల్పనపైనే గుజరాత్ దృష్టి సారిస్తోంది. మన రాష్ట్రంలో మాత్రం ఏటా విద్యుత్, వ్యాట్ ఇతర సబ్సిడీల చెల్లింపులనే సర్కార్ పారిశ్రామిక పోత్స్రాహకాలుగా చూపించి చేతులు దులుపుకుంటోంది.
అరకొరగానే బడ్జెట్ సాయం..
రాష్ట్రంలోని పరిశ్రమలను పోత్స్రహించడానికి విద్యుత్, పెట్టుబడి, వ్యాట్ ఇతర సబ్సిడీలు ప్రోత్సాహకాల పేరున ఏటా బడ్జెట్‌లో రూ.200 కోట్ల వరకూ కేటాయిస్తున్నా తీరా నిధుల విడుదల మాత్రం అరకొరగానే ఉంటోంది. గత రెండేళ్లుగా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. గత రెండేళ్లకు సంబంధించిన విద్యుత్, వ్యాట్ ఇత సబ్సిడీల బకాయిలు రెండు వందల కోట్ల మేరకు సర్కార్ 2009-10 ఆర్థిక సంవత్సరం చివరి రోజు క్లియర్ చేసింది. దీనిలో ఇప్పటికీ వంద కోట్ల మేరకు బకాయిలు ఆర్థిక శాఖ నుంచి విడుదల కావాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే మన రాష్ట్రంలో ఏటా అత్యంత కీలకమైన పారిశ్రామిక ప్రగతి కోసం బడ్జెట్‌లో రూ.200 కోట్లు కూడా నిధులు వ్యయం చేయడంలేదు. అదే గుజరాత్‌లో ఒక్క మౌలిక సదుపాయాల రూపకల్పన కోసమే బడ్జెట్ వ్యయం రూ. నాలుగు వేల కోట్లకుపైనే ఉంటుదని పరిశ్రమల శాఖ పేర్కొంది. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రంలో పోల్చుకుంటే వీటిపై వెచ్చిస్తున్న వ్యయం అనేక రెట్లు ఎక్కువగా ఉంది.
విద్యుత్, వ్యాట్ ప్రోత్సాహకాలపై..
నూతన పారిశ్రామిక పాలసీలో భాగంగా విద్యుత్, వ్యాట్ ఇతర సబ్సిడీ ప్రోత్సాహకాలపై చర్చలు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ప్రధానంగా రాష్ట్రంలో వి ద్యు త్ కొరత తీవ్రంగా ఉండడంతో ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమలకు అంద చేస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అదే విధంగా వచ్చే ఏడాది జీఎస్‌టీ అమలు, తదితర సమస్యలతోపాటు వెనుకబడిన ప్రాంతాల మేరకే ఈ ప్రోత్సాహకాలు అందచేయాలనే వాదన తాజాగా తెరపైకి వచ్చింది. ఈ సమస్యలు ఆర్థిక అంశాలతో ముడిపడి ఉండటం వల్ల సీఎం ఎదుటనే వీటిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని పరిశ్రమల శాఖ భావిస్తోంది. రాష్ట్రంలో పరిశ్రమలకు అందచేస్తున్న విద్యుత్ ఇతర సబ్సిడీలపై ఇప్పటికే కేంద్ర ప్రణాళిక సంఘం కూడా గుర్రుగా ఉంది. ఈసారి పాలసీలో అతిథ్యం, హాస్పి టల్స్, విద్యా రంగాలను కూడా నూతన పారిశ్రామిక పాలసీలో చేర్చాలని, త ద్వారా ఈ రంగాలు మరింత ప్రగతి సాధించాలని పరిశ్రమల శాఖ కోరుకుం టోంది.
గుజరాత్‌లో హాస్పిటల్స్ కూడా పరిశ్రమల శాఖనే మౌలిక తదితర సదు పాయాలు కల్పించడంతో ఈ రంగం గణనీయమైన ఫలితాలు సాధిం చింది. సేవల రంగంలోని ఈ అంశాలను నూతన పారిశ్రామిక పాలసీలో చేర్చా లా...? లేదా అని ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఉన్నత స్థాయిలో మరోసారి చర్చించిన తర్వాతనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని పరిశ్రమల శాఖ వెల్లడించింది.