16న 'బ్రిక్' సదస్సు
అభివృద్ధి చెందిన దేశాల కన్నా వేగంగా వృద్ధి చెందుతున్న బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాల (బ్రిక్) సదస్సు 16న బ్రెసీలియాలో జరగనుంది. ఈ తరహా సదస్సు జరగడం ఇప్పటికి ఇది రెండో సారి. ఈ నాలుగు సభ్య దేశాలలో ప్రపంచ జనాభాలో 40 శాతం మంది నివసిస్తున్నారు. ఐరాస సహా అంతర్జాతీయ సంస్థల సంస్కరణ, వాతావరణ మార్పులు వంటి విషయాల్లో బ్రిక్ దేశాలు ఒకే విధమైన అభిప్రాయాలతో ముందుకు సాగుతున్నాయి. ఆర్థికంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల (బ్రిక్) సదస్సు నేపథ్యంలో ఈ దేశాల సంక్షిప్త సమాచారం..