Monday, April 5, 2010

బంగినపల్లి @ రూ.25

విజయవాడ, న్యూస్‌టుడే: మధుర ఫలం మామిడి మార్కెట్లోకి వచ్చింది. నిత్యావసరాల ధరలకు పోటీగా మామిడి ధర కూడా కొండెక్కింది. విజయవాడ రిటైల్‌ మార్కెట్లో డజను రూ.300 పెడితేగానీ నాణ్యమైన బంగినపల్లి కాయ దొరకడం లేదు. కొద్దిగా పెద్ద కాయ అయితే రూ.350 నుంచి రూ.400 కూడా పలుకుతుంది. చిన్న కాయను రూ.25 పెట్టి కొనాల్సిరావడంతో వినియోగదారులు జంకుతున్నారు. గత ఏడాది ఇదే మామిడిని డజను రూ.150 నుంచి రూ.200 లోపు మాత్రమే ఉంది. ఎక్కడో కాశ్మీర్‌ నుంచి వచ్చే ఆపిల్‌ పండ్లు మార్కెట్లో డజను రూ.180కి మించి లేవు. బంగినపల్లితోపాటు చిన్న రసాలు, పెద్ద రసాలు కూడా ఇంతే ధర పలుకుతున్నాయి