Thursday, April 1, 2010

3జీ స్మార్ట్‌ ఫోన్‌ రూ.9990కే

హెచ్‌టీసీతో జట్టుకట్టిన భారతీ ఎయిర్‌టెల్‌
న్యూఢిల్లీ: త్వరలో అందుబాటులోకి రానున్న పూర్తిస్థాయి 3జీ సేవల రంగంలో తన ఉనికిని నిలుపుకొనేందుకు భారతీ ఎయిర్‌టెల్‌ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆసంస్థ చౌక 3జీ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తెచ్చింది. రూ.9990లకే పూర్తిస్థాయి 3జీ స్మార్ట్‌ఫోన్‌లను అందించేందుకు తైవాన్‌కు చెందిన హెచ్‌టీసీ కార్పొరేషన్‌తో జట్టుకట్టింది. 'క్వాలీకామ్‌' రూపొందించిన 'బ్రేవ్‌ మొబైల్‌ ప్లాట్‌ఫాం' ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ 'హెచ్‌టీసీ స్మార్ట్‌'ఫోన్‌ ఎయిర్‌టెల్‌ ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఇవి దేశవ్యాప్తంగా 30 ప్రధాన నగరాల్లో లభించనున్నాయి. 2.8అంగుళాల టచ్‌-సెన్సిటీవ్‌ స్క్రీన్‌ సౌకర్యంతో పాటు 3.0 మెగా ఫిగ్జల్‌ కెమేరా, అత్యాధునిక స్టిరియో, జాక్‌లతో ఈఫోన్‌ లభించనుంది. బిడ్డింగ్‌ ప్రకియ ముగిసి స్పెక్ట్రమ్‌ కేటాయింపులు జరగగానే 3జీ సేవలను ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సంస్థ భారత్‌, ఆసియా-పసిఫిక్‌ సీఈఓ సంజయ్‌ కపూర్‌ తెలిపారు.