Thursday, April 1, 2010

ద్రవ్యలోటు రూ.3.80 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో ద్రవ్యలోటు 23 శాతం పెరిగి రూ.3.80 లక్షల కోట్లకు పెరిగింది. 2009-10 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో అంచనా వేసిన రూ.4.14 లక్షల కోట్ల ద్రవ్యలోటులో ఇది 92 శాతం కావడం గమనార్హం. మాంద్యం మంటల్ని తగ్గించడానికి ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన పథకాల కారణంగా ద్రవ్యలోటు ఈ స్థాయిలో పెరిగింది. అయితే బడ్జెట్లో పాక్షికంగా ఉద్దీపనల ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి వరకూ ప్రభుత్వ మొత్తం వ్యయం రూ.8.58 లక్షల కోట్లుగా ఉండగా.. పన్నుల ఆదాయం రూ.4.77 లక్షల కోట్లుగా మాత్రమే ఉంది.కాగా, మొత్తం వ్యయం రూ.11.09 లక్షల కోట్లుగాను; ద్రవ్యలోటు 5.5 శాతంగానూ 2010-11 బడ్జెట్లో అంచనా కట్టారు. పన్ను, పన్నేతర ఆదాయం రూ.6.82 లక్షల కోట్లుగా అంచనా వేశారు