డిమాండ్, బ్లాకుల సంఖ్యను బట్టి ప్రతి కక్ష లోనూ ఆయా సర్కిల్‌కు అనుగుణంగా గరిష్టంగా రిజర్వ్ ధరలో ఒకటి, ఐదు లేదా పది శాతం గరిష్టంగా పెంచుతూ ఆపరేటర్లు వేలంలో పాల్గొంటారు. ఇది పారదర్శకంగా ఉంటుందని ఆపరేటర్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తగిన సాఫ్ట్‌వేర్‌ను కూడా ఆపరేటర్లు అందిస్తారు. ఆయా ఆపరేటర్లు ప్రపంచంలో ఏ మూలనున్నా ఆన్‌లైన్ ద్వారా వేలంలో పాల్గొనవచ్చు. ఎవరు కంటే తాము అధికంగా పాడిందీ తెలుసుకునే అవకాశం మాత్రం బిడ్డరుకు ఉండదు.
పంజాబ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, జమ్ము, కాశ్మీర్‌లో నాలుగు బ్లాకులకు సంబంధించి 3జీ ఆక్షన్ నిర్వహిస్తుండగా, మిగిలిన ప్రాంతాలలో మూడు బ్లాక్‌లో అమలు చేస్తున్నారు. ఆయా బ్లాకుల్లో పాల్గొనే బిడ్డర్ల సంఖ్య తెలుస్తుందిగానీ పేర్లు తెలియవు. కాబట్టి రెండు ఆపరేటర్ల మధ్య ఉన్న సమన్వయం పనికి వచ్చే అవకాశం కూడా ఉండదు. దీంతో వేలం కొంచెం క్లిష్ట తరంగా ఉండి పూర్తి కావ డానికి కనీసం రెండు వారా లైన పట్టవచ్చు నని భావిస్తు న్నారు.
అభిప్రాయాలు స్వీకరించనున్న ట్రాయ్
కాగా సై్క పాలసీ (హిట్స్) మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించిన దరి మిలా టెలిఫోన్ నియంత్రణా వ్యవస్థ (ట్రాయ్) సంబంధితవర్గాల అభిప్రా యాలను కోరుతూ పత్రాలను జారీ చేసింది. ఇందులో ట్యారిఫ్‌కు సంబం దించిన అంశాలు కూడా చోటు చేసుకున్నాయి. గత ఏడాది నవంబర్‌లో హిట్స్ పాలసీ విధి విధానాలను ప్రభుత్వం ఆమోదించింది. దీని ప్రకారం కేబుల్ ఆపరేటర్లు దేశం లోని వివిధ ప్రాంతాలలో టీవీ ఛానళ్ళ ప్రసారాలను డిజిటల్ పరిజ్ఞానంలో అందివ్వడానికి అవకాశం ఏర్పడింది. అయితే ఈ విషయాన్ని ట్రాయ్‌కు నివేదిస్తూ అభిప్రాయాన్ని కోరింది.
ఇంటర్ కనెక్షన్లు, ట్యారిఫ్‌లకు సంబంధించి అన్ని విషయాలపై ట్రాయ్ సంబంధిత వర్గాల అభిప్రాయాలను కోరుతూ ఒక కన్సల్టెన్సీ పత్రాన్ని కూడా విడుదల చేసింది. ఈనెల 26వ తేదీ లోగా అన్ని వర్గాల వారు తమ అభిప్రాయాలను ట్రాయ్ ముందు వ్యక్తం చేయాల్సి ఉంది. హిట్స్ సేవల వల్ల టెలివిజన్ డిజిటల్ ప్రసారాలను ఉపగ్రహం ద్వారా మల్టీసిస్టమ్ ఆపరేటర్లకు, కేబుల్ ఆపరేటర్లకు ప్రభుత్వం అనుమతిస్తే వాటి ద్వారా వినియోగదారులకు చేరతాయి. శాటిలైట్ ద్వారా ఉపగ్రహ ప్రసా రాలు గుత్తగా కేబుల్ ఆపరేటర్లుకు పంపడాన్ని హిట్స్ వ్యవస్థ అంటారు. ఇది డిజిటల్ ప్రసారాలతో కూడిన పంపిణీ వ్యవస్థ అని కూడా చెప్పవచ్చు. నాన్ కండిషనల్ యాక్సెస్ విధానం అమలయ్యే ప్రాంతాలలో డిజిటల్ ప్రసారాలు వేగవంతం చేసేందుకు హిట్స్ ఆపరేషన్లు దోహదం చేస్తాయి.
Wednesday, April 7, 2010
ఆన్‌లైన్‌లో 3జీ స్పెక్ట్రమ్ వేలం
న్యూఢిల్లీ: రోత్స్‌చైల్డ్ డిజైన్ చేసిన మూడవ తరపు టెలిఫోన్లకు సంబంధించి ఈ-వేలం పాటలో పాల్గొనడానికి తమకెటువంటి అభ్యంతరాలు లేవని టెలికాం ఆపరేటర్లు ప్రకటించారు. ఆషామాషీగా 3జీ వేలంపాటలో పాల్గొనే బిడ్డర్లను ఈ ఆన్‌లైన్ మెకానిజం నిలవరిస్తుంది. అగ్ర టెలికాం ఆపరేటర్లయిన ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియా, ఎయిర్‌సెల్, ఆర్‌కామ్, టాటాలు ఈ-వేలంపై మొగ్గు చూపుతున్నారు. ఈనెల 9న ప్రపంచంలోనే తొలిసారిగా 3జీ స్పెక్ట్రమ్ కోసం ఆన్‌లైన్ వేలంను నిర్వహిస్తున్నారు. దేశంలోని 22 సర్కిళ్ళకు సంబంధించి ప్రతి రౌండ్‌లోనూ ఆన్‌లైన్ వేలం పాట క్రమంగా పెరుగుతూ వస్తుంది.