Wednesday, April 7, 2010

కొత్త రూటులో సిమెంట్‌ కంపెనీలు

ముంబాయి : ఉత్తర భారతదేశంలో మౌలికసదుపాయాల ప్రాజెక్టులు వేగ వంతం కావడంతో, ఈ రంగంపై ఆధారపడ్డ దేశీయ సిమెంటు ఉత్పత్తిదారులు తమ దిశను మారుస్తూ ముందుకు సాగుతున్నాయి. సిమెంటు ఉత్పత్తులు పో ర్టుల్యాండ్‌ పొజ్జొలానా సిమెంట్‌ (పీపీసీ) నుండి ఆర్డినరీ పోర్టుల్యాండ్‌ సిమెంట్‌ (ఓపీసీ) వైపు తమ దృష్టిని సారించాయి. మౌలికసదుపాయాల ప్రాజెక్టుల్లో వా డే ది ఓపీసీ సిమెంట్‌ అయితే, స్థిరాస్థి రంగాల్లో వాడేది పీపీసీ సిమెంట్‌. భారీ నిర్మాణ కాంక్రీట్‌ పనులకు, రోడ్లు, వంతె నలు, డ్యామ్‌ల నిర్మాణానికి ఓపీసీ సి మెంట్‌ను వినియోగిస్తారు.


ఉత్తర భారత దేశంలోనే ఒకే ప్రాంతం నుండి భా రీ స్థాయిలో సిమెంట్‌ ఉత్పత్తి చేస్తున్న ఏకైక కర్మాగారం శ్రీసిమెంట్స్‌, ప్రస్తు తం ఓపీసీ సిమెంటు ఉత్పత్తిపైనే దృష్టి సారిస్తోంది.వచ్చే త్రైమాసికాల్లో పీపీసీ సి మెం టుకు ఆదరణ తగ్గనుంది కాబట్టి 20శాతం ఉత్పత్తిని ఓపీసీలో పెంచను న్నామ ని తెలిపింది. సంస్థ ఉత్పత్తుల్లో 86 శాతం ఉత్తర భారతదేశంలోనే విక్ర యాలు జరుపుతుందనీ తెలిపారు. ఢిల్లీ ప్రాంతంలో శ్రీసిమెంట్‌ సంస్థకు అత్య దిక వాటా ప్రధాన మార్కెట్‌ అయిన నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌) ప్రాంతంలో కలిగి ఉంది. మరో సిమెంటు సంస్థ అయిన బినాని సిమెంట్‌ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. ఓపీసీ సిమెంటు ఉత్పత్తిపైనే దృష్టిని సారించింది.

కామన్‌వెల్త్‌ క్రీడల నిర్మాణపనుల కారణంగా, ఉత్తర దేశంలో ఓపీసీకు అత్యధిక డిమాండ్‌ ఏర్పడిందనీ బినాని గ్రూప్‌ ఎండీ వినోద్‌ జునేజా తెలిపారు. రాజస్థాన్‌ రాష్ట్రానికి అత్యధిక సరఫరాను జరిపే ఈ సంస్థకు అక్కడ 15శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది. తమ విక్రయాల్లో సుమారు 45శాతం విక్రయాలను ఒక్క రాజస్తాన్‌లోనే ఈ సంస్థ నిర్వహిస్తోంది. గత ఏడాది ఉత్తర ప్రాంతంలో ఓపీసీ వినియోగం 16శాతం ఉండగా, ఈ సారి అధికంగా 26శాతం నమోదైందని ఈ రంగ విశ్లేషకులు తెలిపారు. ఓపీసీ ఉత్పత్తి పెంచిన తరువాత కూడా సరఫరా కొరత ఏర్పడిందనీ పేర్కొన్నారు.

గత ఏడాది కాలంగా స్థిరాస్తి రంగం మందకొ డిగా సాగుతుండటంతో పీపీసీ సిమెంటుకు డిమాండ్‌ పూర్తిగా తగ్గిందనీ తెలి పారు. ఇందు వల్ల ఉత్పత్తిదారులు ఎక్కువగా ఓపీసీ మీదే తమ దృష్టి సారిస్తు న్నారని దేశీయ బ్రోకరేజ్‌ సంస్థ ప్రతినిధి ఒకరు అన్నారు. ప్రస్తుతం ఉత్తర భారత దేశంలో కొనసాగుతున్న ఓపీసీ వేగం, అదనపు సామర్థ్యం పెరిగితే ఇతర రాష్ట్రాలకూ పాకుతుందనీ అంటున్నారు. ఈ పరిణామాన్ని గమనిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీయ సిమెంట్‌ సంస్థలు ఉత్పత్తి కొరతను ఎదుర్కొంటాయని పేర్కొంటున్నారు.