Wednesday, April 7, 2010

సత్వరమే గంగ"వరం"

మారిన ఆధునిక సమాజంలో పోటీ అనే పదం నిత్యకృత్యంగా మారింది. అది ఏరంగమైనా అనివార్యమైపోయింది. సంస్థలు మారుతున్న కాలంతో పాటు ఆ సంస్థలు కూడా మారాలంటే లక్ష కారణాలు చూపుతూ ప్రభుత్వాలు ముందుడగు వేయడానికి ఎన్నో ఆటంకాలను కలిగిస్తుంటే ఎగుమతి, దిగుమతి దారులకు ఏది కావాలో దానిని కన్స్యూమర్‌ వద్దకే తీసుకెళ్లే విధంగా ప్రణాళికను ప్రైవేటు యాజమాన్యాలు చేపట్టడనుం డడంతో ప్రభుత్వ రంగ సంస్థలు వెనుకంజ వేస్తున్నాయి.


కార్గో హ్యాండ్‌లింగ్‌ లో గత దశాబ్దాల కాలంగా మొదటి స్థానంలో వున్న విశాఖ పోర్టు గంగవరం పోర్టు ఆవిర్భావంతో రెండవ స్థానానికి పడిపోయింది. విశాఖపట్నం పోర్టులో ఉన్న సదుపాయాలకంటే గంగవరం పోర్టులో ఉన్న సదుపాయాలు మరింత ఎక్కువుగా ఉన్నాయి. విశాఖ పోర్టులో కార్గోహ్యాండ్‌లింగ్‌ చేయడానికి ఉత్పత్తి దారుల నుంచి ర్యాకుల ద్వారా స్టాక్‌యార్డ్‌ను చెప్పించి అక్కడ నుంచి పోర్టు లోని కార్మికులు,యంత్రాల ద్వారా ఆయా షిప్‌ల్లోకి లోడింగ్‌ అన్‌ లోడింగ్‌ చేస్తు న్నారు. ఈ అంశంలో విశాఖ పోర్టులో ఇప్పటికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో నౌకల ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌ చేసే వ్యాపారులు ప్రస్తుతం ఇతర పోర్టులవైపు దృష్టి సారించారు.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనంగా 2008 ప్రమాణాలకు తగ్గట్టు ఆ పోర్టును మెక్‌నైజడ్‌ పోర్టుగా తీర్చి దిద్దడంలో యాజమాన్యాలు సఫలీకృతం అయ్యాయి. ముఖ్యంగా విశాఖ పోర్టులో అవుటర్‌ హార్బర్‌ నుండి ఇన్నర్‌ హార్బర్‌ వచ్చే మార్గం అనంతరం బెర్త్‌ వద్ద సుమారు 14.2 మీటర్ల లోతు మాత్రమే ఉండడంతో భారీ నౌక లు నేరుగా పోర్టులోకి వచ్చే అవకాశం లేదు. అయితే గంగవరం పోర్టులోని బెర్తుల వద్ద సుమారు 21మీటర్ల లోతు ఉండడంతో చిన్న, మధ్య తరహా నౌకలు నేరుగా బెర్త్‌ వద్దకు చేరుకోవడం వ్యాపారులకు లాభిస్తోంది. ముఖ్యంగా విశాఖ పోర్టు అభివృద్ధి అంతా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఆవి ర్భావం తర్వాత వేగవంతమైంది. మారుతున్న కాలంతోపాటు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కూడా ఆధునిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకునే దిశలో ప్రస్తుతం విస్తరణ దిశగా కొనసాగుతోంది.

గతంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విశాఖ పోర్టుతో టారిఫ్‌ అథారిటీస్‌ ఆఫ్‌ మేజర్‌ పోర్ట్స్‌ నిర్ణయించిన ధర ప్రకారం కార్గోహ్యాడ్‌ లింగ్‌ ఒప్పందంలో టన్నుకు 132 రూపాయలే తీసుకునేవారు. కానీ గంగ వరం పోర్టు స్టీల్‌ప్లాంట్‌ పక్కకు వచ్చిన తరువాత టన్నుకు 279 రూపాయలు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గంగవరం పోర్టు ఆధునికత కారణంగా నౌకల నుంచి కన్వేయర్‌ నేరుగా స్టీల్‌ ప్లాంట్‌లోకి బొగ్గును దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగం లోనున్న విపిటి కన్నా అధిక ధరను చెల్లించాలని స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం నిర్ణయం తీసుకుంటే ఆ లాభం ఎవరికన్నది ప్రజలే గుర్తిస్తారు. అంతేకాకుండా ఏ పరిశ్రమల యాజమాన్యలైనా మూడేళ్ల పాటు పోర్టుతో ఒప్పందాలు చేయ డం మామూలుగా ఉండే ప్రక్రియ.

ఐతే స్టీల్‌ప్లాంట్‌ యాజామాన్యం మాత్రం గంగవరం పోర్టుతో 15 ఏళ్ల పాటు కార్గోహ్యాండ్‌లింగ్‌ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం కన్పిస్తోంది. ఒకవేళ అదేగనుక జరిగితే స్టీల్‌ప్లాంట్‌కు లాభాల సంగతి పక్కన పెడితే నష్టాల్లోకి కొంతమేర వెళ్లే అవకాశం ఉంది. విశాఖ పోర్టులో మొత్తం 27 బెర్తులు ఉన్నాయి. ఈ బెర్తుల మైంటెన్స్‌ ఇతర అవసరా లు తీర్చేందుకు దాదాపు 5500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి నెలకు జీతాల కింద 12 కోట్ల రూపాయలు ఇన్సింట్‌ కింద మరో కోటి రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తోంది. కాగా గంగవరం పోర్టులో ఇప్పటి వరకు సుమారు రెం డు వందల మంది పనిచేస్తున్నారు. వీరికి జీతాల కింద రూ.కోటి ఖర్చయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా గంగవరంలో కేవలం మూడు బెర్తుల నిర్మాణం మా త్రమే పూర్తయింది. ఈ కారణంగా అక్కడ ఖర్చులు తక్కువ అవడంతోపాటు ఆధునిక టెక్నాలజీ ఉపయోగి స్తుడడంతో కార్గోహ్యాండ్‌లింగ్‌ వేగవంతంగా జరుగుతోంది.

ఇదిలావుంటే ఏదైనా ప్రభుత్వ పోర్టుల్లో ప్రధాన పోస్టులలో పనిచేసిన వ్యక్తులు పదవీ విరమ ణ పొందిన రెండేళ్లకు ఇతర చోట్ల ప్రైవేటు దారుల వద్ద ఎట్టి పరిస్థితుల్లోను పనిచేయరాదన్న నిబంధన ఉంది. అయితే దీనిని అతిక్రమిస్తూ విశాఖ పోర్టులో చీఫ్‌ ఇంజనీర్‌గా పదవీ విరమణ పొందిన ఆంథోనీ అనే వ్యక్తి యాజమా న్యం(ప్రభుత్వం) అనుమతి లేకుండానే గంగవరం పోర్టులో పనిచేస్తున్నట్టు తె లుస్తోంది. అంటే విశాఖ పోర్టు వ్యవహారాల గుట్టు గంగవరం పోర్టు యాజమా న్యానికి తెలిసే అవకాశం ఉంది. ఇదిలావుంటే ప్రస్తుతం విశాఖ పోర్టు ఆధునీకరణకు గత చైర్మన్‌లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం గంగవరం పోర్టుతో పోటీ పడడం ఆశించిన స్థాయిలో లేదు.