Friday, April 9, 2010
నేటి నుండి 3జీ స్పెక్ట్రమ్ బిడ్డింగ్
న్యూఢిల్లీ: టెలికాం రంగం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 3జీ స్పెక్ట్రమ్ వేలం శుక్రవారం నుండి ప్రారంభం కాబోతోంది. ఇందులో ఇప్పటికే రంగం లో ఉన్న ఆరు అగ్రశ్రేణి కంపెనీలతో పాటు మూడు కంపెనీలు కూడా పాల్గొం టున్నాయి. 3జీ వేలం ద్వారా 30,000-35,000 కోట్ల రూ.ల ఆదాయాన్ని ప్రభుత్వం ఆశిస్తోంది. వేలం ముగింపు తుది గడువు ఏమీ లేదు. దేశవ్యాప్తంగా 22 జోన్లకు సంబంధించి ఒక్కో జోన్‌కు 3జీ కోసం 3500 కోట్లు, బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ సేవల కోసం 1750 కోట్ల రూ.లను బేసిక్ ధరగా ప్రభుత్వం నిర్ణయిం చింది. బిడ్డింగ్ విజేతలకు సెప్టెంబర్‌లో స్పెక్ట్రమ్ కేటాయిస్తారు. దాంతో వచ్చే ఏడాది మొదట్లో 3జీ సేవలను ప్రజలు అందుకోగలుగుతారు. తద్వారా మొబైల్ ఫోన్లతో హైస్పీడ్ డేటా ేబుల్, వీడియో సేవలకు ప్రజలకు లభ్యం అవుతాయి. కాగా స్పెక్ట్రమ్ కేటాయింపు విషయంలో వివాదమున్నప్పటికి సుప్రీంతో పాటు, ఢిల్లీ హైకోర్టు వేలం జరగడానికి అనుమతి నిచ్చాయి.