హైదరాబాద్: విలువ ఆధారిత పన్ను (వ్యాట్) స్థానంలో వచ్చే ఆర్థిక సంవత్సరం (2011-12) నుంచి గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్‌టీ) పేరిట వస్తు వులు, సేవల పన్నుల విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆచర ణలో జీఎస్‌టీ వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యే అవ కాశాలున్నాయి. వ్యాపారవర్గాలతో పాటు సామాన్య ప్రజా నీకంపై పన్నుల భారం ఎక్కువ అవుతుందన్న అభిప్రా యం వ్యక్తమవుతోంది. గత రెండేళ్ళుగా గూడ్స్ అండ్ సర్వీ సెస్ టాక్స్(జీఎస్‌టీ) గురించి చర్చలు జరుగుతున్నాయి. జీఎస్‌టీ ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రావాల్సి ఉంది.
కేంద్ర రాష్ట్రాల మధ్య కొన్ని విషయాల్లో ఏకాభి ప్రాయం రానందున వాయిదా పడుతూ వస్తోంది. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సాధికారిత కమిటీ ఏర్పాటైం ది. కమిటీ నిర్ణయాలకు వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాలు నిర్దేశిత వ్యాట్ 12.5 శాతానికి మించి వసూలు చేసిన దాఖలాలు న్నాయి. వ్యాట్ అనుభవాలను దృష్టిలో ఉంచు కుని దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయంతో జీఎస్‌టీ తీసుకు రావాలని కమిటీ ఆలోచిస్తున్నది. రాష్ట్రాల ఆదాయం తగ్గితే ఆమేరకు కేంద్రం నష్టపరిహారం ఇచ్చే విధంగా నిర్ణయం ఉండాలనేది రాష్ట్రాల అభిప్రాయం. గతంలో వ్యాట్ అమ లు సమయంలోనూ ఇదే రీతిలో ఒప్పందాలు జరిగినా ఆచరణలో కేంద్రం నుంచి నష్టపరి హారం రాబట్ట డంలో రాష్ట్రాలు సఫలీకృతం కాకపోవడం గమనార్హం. ఆంధ్రప్ర దేశ్‌కు గత ఆర్థిక సంవత్సరం (2009-10) లోనే రూ.11 00 కోట్ల నుంచి రూ.1200 కోట్లు రావాల్సి ఉంటే కేంద్రం నుంచి వచ్చింది రూ.500 కోట్లు మాత్రమే.
మిగతా మొత్తం చెల్లింపులకు కేంద్రం మీనమేషాలు లెక్కిస్తుంది. జీ ఎస్‌టీ అమలు విష యంలో రాష్ట్రాలు దరికి రాకపోతే సబ్సిడీలు, ఇతర గ్రాంటులు కూడా నిలిపివేస్తామని కేం ద్రం హెచ్చరిక జారీచేసినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా వ్యాట్‌కు కట్టుబడి అమలుచేసే విషయంలోనే రాష్ట్ర ప్రభు త్వాలు ఇష్టానుసారంగా పన్నులను పెంచిన నేప థ్యంలో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్(జీఎస్‌టీ) విష యంలో మరిన్ని అతిక్రమణలు చేసే అవకాశాలెక్కువగా ఉంటాయి.
గుజరాత్ ప్రభుత్వం వ్యాట్‌ను 4 శాతం నుంచి 5 శాతా నికి, 2008-09లో 12.5 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 12.5 శాతం నుంచి 13.5 శాతానికి, రాజస్థాన్ ప్రభుత్వం 12.5 శాతం నుంచి 14 శాతానికి వ్యాట్‌ను పెంచాయి. కొన్ని రాష్ట్రాల్లో 12.5 శాతం పన్ను పరిధిలోలేని వస్తువులపై పన్నును 4 శాతం నుంచి 5 శాతనికి పెంచినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 12.5 శాతం పన్నుల పరిధిలో లేని వస్తువులపై పన్నులను పెంచకపోగా వ్యాట్ తగ్గింపులు, మినహాయింపుల కల్పించింది.
వ్యాట్ తగ్గింపు మినహాయింపు వివరాలు...
గతంలో 4 శాతం పన్ను ఉన్న టెక్స్‌టైల్స్ మేడ్ ఆప్స్(బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్, టవల్స్, కర్టెన్స్, జరీ, ఎం బ్రాయిడరీ, కాటన్ ఫ్యాబ్రిక్స్, మాన్‌మేడ్ ఫ్యాబ్రిక్స్, ఎంబ్రాయిడరీ ఆర్టికల్స్) వంటి వస్తువులపై 2009 -10లో పన్ను మినహాయించారు. 2005కు పూర్వం (వ్యాట్ అమలుకు ముందు) టూత్ పేస్టులు, సబ్బులపై 20 శాతం ఉన్న పన్నును 12.5 శాతానికి తగ్గించారు. కేన్(రటన్ లేదా పేము) సరుకుపై ఇప్పటి వరకు 12.5 శాతం పన్ను ఉండేది. అయితే కేన్ ముడిసరుకు అయినందున దీనిని ఎక్కువగా హస్తకళా వస్తువుల తయారీ కొరకు చేతివృత్తి కళాకారులు వినియోగి స్తున్నందున దీనిని 4వ షెడ్యూల్‌లో చేర్చి 4 శాతం పన్నుకు పరిమితం చేశారు. ఇంతకు ముందు డీజిల్ జనరేటర్‌లపై 12.5 శాతం పన్ను ఉండేది.
తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఇదే తరహా వస్తువులపై 4 శాతం పన్ను ఉన్నందున వ్యాపార మళ్ళింపును నిరోధిం చేందుకు వాటిపై పన్నును 4 శాతానికి తగ్గించారు. నవారు మీద గతంలో ఉన్న 4 శాతం పన్ను మినహా యించారు. మందుల కంపెనీల్లో వాడే వెంటిలేషన్ సిస్టమ్స్‌పై 12.5 శాతం ఉన్న పన్నును 4 శాతానికి తగ్గిం చారు. టార్పలిన్, వాటర్‌ప్రూఫ్ క్లాత్, రెగ్జిన్ ప్రొడక్ట్స్ పై 12.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించారు. దోమతెరలు వంటి వస్తువులపై 12.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించారు. విమాన ఇంధనంపై చాలా రాష్ట్రాల్లో అతి తక్కువ వ్యాట్ రేటు 20% ఉన్నందున రాష్ట్రంలో పన్నును 4 % నుంచి 16 శాతానికి పెంచారు.