7.7% వృద్ధి చెందనన్ను ప్రపంచ ఐటీ మార్కెట్: 2010లోప్రపంచ ఐటీ మార్కెట్ 7.7 శాతం వృద్ధి చెందనున్నట్లు పరిశోధన సంస్థ ఫారెస్టర్ తెలిపింది. అమెరికా ఐటీ మార్కెట్ 8.4% పెరగనున్నట్లు ఆ సంస్థ విశ్లేషించింది.
Tuesday, April 13, 2010
4 రంగాలు.. 5 లక్షల కొలువులు
న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరంలో చాలా మందినిరుద్యోగుల కలలు నెరవేరనున్నాయని ఉద్యోగ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2010-11లో ఐటీ, బ్యాంకింగ్, టెలికాం, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో కొత్తగా సుమారు 5 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలుఅందుబాటులోకి రానున్నట్లుగా కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి. ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో 1.5 లక్షల ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్ రంగాల్లో వరుసగా 2.5లక్షలు, 40వేల కొలువులు అందుబాటులోకి రానున్నట్లు కెల్లే సర్వీసెస్ పేర్కొంది. టెలికాం రంగంలో సుమారు లక్ష కొత్తకొలువులు వస్తాయని కెల్లే సర్వీసెస్, ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లు విశ్లేషించాయి. ప్రజా పరిపాలన, విద్య, గనుల తవ్వకాలు, నిర్మాణ, ఆర్థిక, బీమా, స్థిరాస్తి, టోకు- రిటైల్ వర్తకం రంగాల్లో నియామకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు కెల్లేసర్వీసెస్ తెలిపింది. విద్య, ఔషధ, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో నిపుణుల కొరత ఉన్నా కొత్త ఏడాది నియామకాల్లో ఈరంగాలూ ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు ఎర్నెస్ట్ అండ్ యంగ్ చెప్పింది. స్థిరాస్తి, రిటైల్ వర్తకపు రంగాల్లో కూడా నియామకాల జోరు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. వాహన, వాహన విడిభాగాల విభాగాలతో కలిపి తయారీ రంగంలో 25 లక్షల కొలువులు కొత్తగా అందుబాటులోకి రావచ్చని టీమ్‌లీజ్ అంటోంది.