ఈ బ్లాక్‌లలో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువుకు ప్రభుత్వం ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 4.20 డాలర్ల ధర నిర్ణయించింది. ఐదేళ్ళ పాటు ఇదే ధర అమలులో ఉంటుందని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. కాని ఏడు డాలర్లకు ఎగువన మాత్రమే ధర గిట్టుబాటవుతుందని ఒఎన్‌జిసి స్పష్టంగా చెబుతోంది.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలో గ్యాస్ సరఫరా చేయాలంటే కొత్తగా పెట్టుబడులు పెట్టడం ఏ మాత్రం లాభసాటి కాదన్నది తమ అభిప్రాయమని, ప్రపంచంలో ఎవరూ కూడా ఈ ధరలో పెట్టుబడులకు ముందుకు రాబోరని ఒఎన్‌జిసి సిఎండి ఆర్.ఎస్.శర్మ గురువారం ఇక్కడ విలేకరులకు తెలిపారు.
తాము అభివృద్ధి చేసిన కేజీ-డిడబ్ల్యుఎన్-98/2 బ్లాక్‌లో 2013 నాటికి గ్యాస్ ఉత్పత్తి చేయాలన్నది ఒఎన్‌జిసి ప్రణాళిక అయినప్పటికీ ఇప్పుడు 2015-16 నాటికి గాని ఉత్పత్తి సాధ్యం కాదంటోంది. దీంతో ఒఎన్‌జిసి కన్నా ముందుగానే కేజీ బేసిన్ బ్లాక్‌లలో గుజరాత్ ప్రభుత్వ రంగ సంస్థ గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ ఉత్పత్తి ప్రారంభించే ఆస్కారం కనిపిస్తోంది.
తమ బ్లాక్‌లో రోజుకి 2 నుంచి 2.5 కోట్ల శతకోటి ఘనపుటడుగుల సహజ వాయువు ఉత్పత్తి సామర్థ్యం ఉన్నట్టు అంచనా అని శర్మ చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన ధరలపై గ్యాస్ సరఫరా చేయలేమంటున్న శర్మ అంతకన్నా పై స్థాయిలోను, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎల్ఎన్‌జికి చెల్లిస్తున్న 9 డాలర్ల ధర కన్నా దిగువన ధర నిర్ణయించాలన్న అభిప్రాయం ప్రకటించారు.
6 లేదా 7 డాలర్ల ధర అయితే గిట్టుబాటవుతుందా అన్న ప్రశ్నకు అంతకన్నా స్వల్పంగా ఎక్కువ ఉండవచ్చునని ఆయన అన్నారు. కృష్ణా గోదావరి బేసిన్‌లో రెండు ఆఫ్‌షోర్ క్షేత్రాల అభివృద్ధిపై 530 కోట్ల డాలర్లు (23,850 కోట్ల రూపాయలు) ఇన్వెస్ట్ చేసేందుకు ఒఎన్‌జిసి ప్రణాళికలు రూపొందించింది.
హైడ్రోకార్బన్ల విభాగం డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం తమ ప్రణాళికలకు ఆమోద ముద్ర వేసిందని, సహజవాయు నిక్షేపాలున్నట్టు తాము కనుగొన్న బ్లాక్‌లలో వాస్తవ నిల్వల పరిస్థితి అంచనా వేయడానికి తాము ప్రయోగాత్మకంగా ఆరు బావుల తవ్వకాలు ప్రారంభించాల్సిఉన్నదని ఒఎన్‌జిసి అధికారి ఒకరు చెప్పారు.
కేజీ-డిడబ్ల్యుఎన్-98/2 బ్లాక్‌లోని 10 నిల్వలను అదే బేసిన్‌లోని కేజీ-ఒఎజ్ిసి-డిడబ్ల్యు4 షాలో వాటర్ బ్లాక్‌లోని జి-29, జిఎస్-4, వశిష్ట క్షేత్రాలతో అనుసంధానం చేయాలన్నది ఒఎన్‌జిసి అభిప్రాయం. ఈ క్షేత్రాల నుంచి రోజుకి 2-2.5 కోట్ల శతకోటి ఘనపుటడుగుల సహజ వాయువుతో పాటు 8 వేల బ్యారెళ్ళ క్రూడాయిల్ కూడా ఉత్పత్తి చేయాలని ఒఎన్‌జిసి భావిస్తోంది.
కేజీ-డిడబ్ల్యుఎన్-98/2 బ్లాక్‌లోని అల్ట్రా డీప్ వాటర్ క్షేత్రం యుడి-1ను ఇందులో చేర్చలేదు. రెండు లక్షల క్యూబిక్ అడుగుల గ్యాస్ నిక్షేపాలున్నట్టుగా భావిస్తున్న యుడి-1కి కూడా డిసిహెచ్ అనుమతి మంజూరు చేసింది.
ఈ చమురు, సహజవాయు క్షేత్రాల్లో భాగస్వామ్యానికి నార్వేకు చెందిన స్టాటోయిల్, బ్రెజిల్‌కు చెందిన పెట్రోబ్రాస్‌లతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద కేజీ-డిడబ్ల్యుఎన్-98/2 బ్లాక్‌లో స్టాటోయిల్, కెయిర్న్ ఇండియాలకు 10 శాతం, పెట్రోబ్రాస్‌కు 15 శాతం వాటాలుండగా మిగిలిన వాటాలు ఒఎన్‌జిసి చేతిలో ఉన్నాయి.
కాని ఈ ఒప్పందం నుంచి వైదొలగాలని పెట్రోబ్రాస్ ఇప్పటికే నిర్ణయించగా స్టాటోయిల్ కూడా తవ్వకాల్లో చురుకైన భాగస్వామిగా నిలవడంలేదు. కేజీ-డిడబ్ల్యుఎన్-98/2లో ఆరు, కేజీ-ఒఎస్-డిడబ్ల్యు4 బ్లాక్‌లో మూడు ప్రయోగాత్మక బావులు తవ్విన తర్వాత తాము సవివరమైన అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తామని ఆ అధికారి తెలిపారు. ఇప్పటికి ఈ క్షేత్రాల్లో 58 బావులు తవ్వాలన్నది తమ యోచన అని ఆయన చెప్పారు.
Friday, April 16, 2010
4.2 డాలర్ల రేటుకు దందా కష్టం 7 డాలర్లు ఓకే కేజీ బేసిన్ గ్యాస్ ధరపై ఒఎన్‌జీసీ కొత్త పేచీ
న్యూఢిల్లీ : ప్రభుత్వం నిర్ణయించిన ప్రస్తుత అమ్మకపు ధరల్లో కృష్ణా గోదావరి బేసిన్ క్షేత్రాల్లో సహజవాయువు ఉత్పత్తి చేయడం ఏ మాత్రం గిట్టుబాటు కాదని ప్రభుత్వ రంగంలోని చమురు, సహజ వాయువుల సంస్థ (ఒఎన్‌జిసి) అంటోంది. కృష్ణా గోదావరి బేసిన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన కేజీ-డి6 బ్లాక్‌కు సమీపంలోనే ఒఎన్‌జిసి కూడా పది చమురు, సహజ వాయు నిక్షేపాలను కనుగొంది.