Thursday, April 15, 2010

యులిప్‌లు నిలిచేనా?

irda-logoహైదరాబాద్‌: బీమా సంస్థలు అమలు చేస్తున్న యూనిట్‌ లింక్డ్‌ పాలసీ (యు లిప్‌)లపై వివాదం మాట ఎలా ఉన్నా అసలు ఈ వివాదం ఎందుకు తలెత్తింది అనేది ఇప్పటి ప్రశ్న. తాజాగా స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ ’సెబీ’తో బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ ’ఐఆర్‌డీఏ’ల మధ్యన తలెత్తిన వివాదం ఇప్పట్లో సద్దుమణుగుతుందా... ఇంతకీ యూలిప్‌లను నిషేధించాలనీ సెబీ ఎందుకు కోరింది...దీనిపై ఐఆర్‌డీఏ ఎలా స్పందించిందీ...వివరంగా చూద్దాం..

విషయమేంటి?..
యులిప్‌లు మ్యూచువల్‌ ఫండ్‌ల లాంటివనీ సెబీ, వాటిని కొన సాగిం చాలంటే మ్యూచువల్‌ ఫండ్‌లకు వర్తించే నిబంధనల ప్రకారం తన ముందస్తు అనుమతిని బీమా సంస్థలు తీసుకోవాలనీ సెబీ ఐఆర్‌డీఏను ఆదేశించింది. అలా అనుమతి తీసుకోనందుకు ఒక్క ఎల్‌ఐసీ తప్ప మిగతా 14 జీవిత బీమా సంస్థ లకు యూలిప్‌ల నిధులను వసూలు చేయడం ఆపేయాల్సిందిగా ఉత్తర్వులను సెబీ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఐఆర్‌డీఏ కూడా అదేరీతిలో స్పంది స్తూ యులిప్‌ల విక్రయాలను కొనసాగించవచ్చని అంటోంది.

సెబీ ఏమంటోంది..?
ఇకపోతే సెబీ ఆదేశాలను పరిశీలిసే... ఇటు పాలసీదారులకు కొంచెం కష్టం, కొంచెం నష్టం కలిగించే విధంగా ఉంటుంది. యులిప్‌లు బీమా పథకాలు కావ ని, వీటిలో మార్కెట్‌ పెట్టుబడి వాటాలు కూడా ఉన్నట్టు చెబుతోంది. ఇందులో పాలసీదారుడు చెల్లించే మొత్తం బీమా ప్రీమియం కన్నా మార్కెట్లో పెట్టు బడికి కేటాయించే మొత్తమే అధికంగా ఉంటోందని అందుకే వీటికి మ్యూచువల్‌ ఫండ్‌ల మాదిరిగా పరిగణించాలని సెబీ వాదన.

sebi-logoఎవరికి నష్టం..?
సెబీ ఆదేశాల వల్ల మొత్తం బీమా పాలసీల పునరుద్ధరణను ఆపేయవలసి వస్తుంది. దీంతో పాటు ఇప్పటివరకూ ప్రీమియంలను వసూలు చేసిన సంస్థ లన్నీ కూడా వాటిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఉన్నఫళంగా బీమా సంస్థలకు, పాలసీ దారులకు నష్టం కలిగించేదే. పూర్తిగా ఆదాయమార్గాలు మూసుకుపోవడమే కాకుండా, పాలసీదారుల క్లెయిమ్‌ విషయంలో సంస్థలు జరిపే చెల్లింపులపై కూడా తీవ్ర ప్రభావం ఉండనుంది.

ఇన్సురెన్స్‌, పెట్టుబడి వేరు వేరు...
ఈ మొత్తం వివాదంలో అసలు ఇన్సురెన్స్‌, పెట్టుబడులు రెండు వేరు వేరు అవసరాలుగా అభివర్ణించవచ్చు. ఇక్కడ కొంత అస్పష్టత కూడా ఏర్పడుతుం ది. కొన్ని యూలిప్‌ పెన్షన్‌ ప్లాన్‌లకు అసలు ఎటువంటీ గ్యారంటీ లేదు. ఈ మొత్తం వ్యవహారంలో రెండు నియంత్రణ సంస్థల మధ్య మొత్తం 70.3 మిలి యన్‌ యూలిప్‌ పాలసీలతో పాటు (మార్చి నాటికి), రు.90,645 కోట్ల రూపాయల ప్రీమియం ఆదాయలు బందీ అయ్యాయి. సాధరణంగా యులి ప్‌లు పెట్టుబడిదారులకు ఒక ఇన్సురెన్స్‌తో పాటు పెట్టుబడుల ఆదాయాలను ఇస్తుంది.

ulipవివరంగా చెప్పుకుంటే ఒక యులిప్‌ ప్రక్రియ ఈ విధంగా నడు స్తుంది. ఒక పాలసీదారుడు తన పెట్టుబడిని కొన్ని సంవత్సరాల కాలవ్య వధిలో పెట్టాడు. పాలసీదారుడి పెట్టుబడి ఇక్కడ తాను తీసుకోబోయే రిస్క్‌ ఆధారంగా ఈక్విటీ, డెట్‌ మార్కెట్లలో పెట్టుబడిని సంస్థలు పెడ్తాయి. కొన్ని యులిప్‌ ప్లాన్‌లకు పాలసీ కాలవ్యవధిని బట్టి బీమా సంస్థలు గ్యారంటీను ఇస్తాయి. ఇందులో అధిక ప్రీమియంలు ఉండటమే ఇక్కడ సమస్యగా మారింది. ఉదాహ రణకు 30సంవత్సారాల వయసుగల వ్యక్తికి 20 సం.వ్యవధిగల యులిప్‌ను తీసుకుంటే రూ.10లక్షల గ్యారంటీ ఉంటుంది. ఇందుకు అతను చెల్లించాల్సిన ప్రీమియం రూ.25,000 నుండి రూ.2లక్షల వరకు ఉంటుంది.

అంటే ప్రీమియం డబ్బుకు ఐదు రెట్లు ఇక్కడ గ్యారంటీ ఉంటుంది. మరో విధంగా ఈ టర్మ్‌ ప్లాన్‌ పూర్తి ఇన్సురెన్స్‌ ఫార్మాట్‌లో చూస్తే కేవలం రూ.3,370 రూపాలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఇద్దరు వ్యక్తుల్లో ఏ ఒక్కరికి ప్రమాదం జరిగినా మొత్తం టర్మ్‌ ప్లాన్‌లో కట్టిన ప్రీమియం డబ్బును మొత్తం నష్టపోవాల్సి ఉంటుంది. అంటే రు.3,370ూ20 = 67,400 రూపాయలను నష్టపోవలసి ఉంటుంది. ఇదే టర్మ్‌ ప్లాన్‌ను వ్యక్తిగత రుణ రూపంలో చూస్తే...ఒక వ్యక్తి రు.21,630ల పెట్టుబడిని (రు.25,000-రు.3,370) ఏదైనా ఒక పథకం (పీపీఎఫ్‌ ద్వారా)లో 8శాతం ఆదా యానికి పెట్టుబడి పెడితే, వచ్చే రిటర్న్స్‌ రూ.9.8 లక్షలుగా ఉంటుంది.

ఇందులో నష్టపోయిన పూర్తి టర్మ్‌ ప్లాన్‌ డబ్బు రు.67,400లతో కలిపి వచ్చే ఆదాయం అది. అదే పూర్తిగా రు.25,000ల పెట్టుబడిని పీపీఎఫ్‌లో పెడితే మొత్తం రు.11.44లక్షల అధిక రిటర్న్‌లు ఉంటాయి. పూర్తిగా సవ్యమైన పద్ధతి కాదని సర్టిఫైడ్‌ ఆర్థిక ప్రణాళికదారుల అంటున్నారు. ఒక కుటుంబ సభ్యుల మరణం తరువాత కొంత డబ్బును సురక్షితంగా అందిజేయడమే యూలిప్‌ల కర్తవ్యమనీ విశ్లేషిస్తున్నారు. మార్కెట్‌ లింక్డ్‌ పథకా లైన యులిప్‌లు పూర్తిస్థాయి లాభాలను ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో ఇవ్వలేకపోతున్నాయనీ అన్నారు.

కుటుంబంలో అనుకోని మరణం వల్ల పాలసీదారుడికి గ్యారంటీ ఇవ్వబడిన అధికమొత్త డబ్బు మార్కెట్‌ విలువ ఆధారంగా ఇవ్వాలనీ కోరారు. ఇందులో పలు రకాల ఆప్ష న్లైన ఐదు రెట్ల అధిక ప్రీమియంతో పాటు రెండింతల ప్రీమియంను చెల్లించే వెసలుబాటు కూడా ఉందనీ ఆర్థిక ప్రణాళికదారులు గౌరవ్‌ మష్రువాలా విశ్లేషి స్తున్నారు. బీమా పాలసీల్లో పలు పథకాలు గ్యారంటీ డబ్బుకు రిటర్న్‌ లకు మధ్య ఆప్షన్లను మార్కెట్‌ విలువను బట్టి అందిస్తు న్నాయి. అనేక యూలిప్‌ పెన్షన్‌ పథకాలు అసలు ఎలాంటి గ్యారంటీ రిటర్న్‌లు, కవరేజ్‌లు ఇవ్వడంలేదనీ చెబుతు న్నారు. పెట్టుబడిదారులకు ఏ ప్లాన్‌లను విక్రయించాలో తెలియని అనిశ్చిత పరిస్థితి ప్రస్తుతం నెలకొందని అంటు న్నారు.

సానుకూల మార్కెట్‌ పరిస్థితులలో నికర ఆస్తుల విలువ (ఎన్‌ఏవీ) అధికంగా కనిపించవచ్చు. మరి కొన్ని పథకాల్లో యూనిట్ల నుండి పాలసీ అడ్మినిస్ట్రేషన్‌ చార్జ్‌ లను, మోర్టాలిటీ రేట్లను తీసివేస్తారు. దీంతో లోవర్‌ యూ నిట్ల కారణంగా రిటర్న్‌లు చాలా తక్కువగా అందుతాయి. ఇకపోతే వీటితో అదనంగా ప్రీమియం అలొకేషన్‌ చార్జ్‌లు 15-18శాతం, ఒక్కోసారి 100 శాతం వరకూ ఉంటా యి. వీటిని మొదటి మూడు సంవత్సరాల కాలంలోనే బీమా సంస్థలు వసూలు చేస్తాయి. ఈ పాలసీల వల్ల కొన్ని లాభాలు కూడా పొందవచ్చు. సెక్షన్‌ 80సీ చట్టం కింద ఉన్న లాభాలు మనకు అందుతాయి. అదనపు మొత్తం డబ్బును పొందితే, ఈఈఈ (ఎగ్జెంప్ట్‌-ఎగ్జెంప్ట్‌-ఎగ్జెంప్ట్‌) పాలసీ కింద దానిపై ఎలాంటి సుంకం పన్ను కూడా ఉండదు.

ఒకవేళ పెట్టుబడి దారు మొదటి మూడు సంవత్సరాల్లోనే పాలసీను తిరిగి అప్పగించిన పక్షంలో మాత్రం 80సీ చట్టం ద్వారా ఉంటే లాభాలు అమలు కాబోవు. ఇవన్నీ పథకాలు పెట్టుబడిదారులకు నాలుగు రకాల వివిధ డెబ్ట్‌, ఈక్విటీ, కంపెజిషన్‌ పథకాలకు మారే సౌకర్యాన్ని ల్పిస్తాయి. వేగంగా ఎదుగుతున్న మార్కెట్లో, లేదా పతన ఛాయలు కనిప్తిసున్న మార్కెట్లోనైనా పెట్టుబడిదారుడు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా తన డబ్బును సురక్షితంగా పెట్టగలగాలి. పెట్టుబడిదారుల కోసం రూపుదిద్దుకున్న వివిధ రకాల లాభాల కలయికనే యూలిప్‌ పథకాలని ఇండి ఫస్ట్‌లైఫ్‌ బీమా సంస్థ ఎండీ, సీఈఓ పి నందగోపాల్‌ తెలిపారు.

యూలిప్‌ల విషయంలో ప్రస్తుతం ఎలాంటి నిర్ణయాలు సెబీ, ఐఆర్‌డీఏ నియం త్రణ సంస్థలు ప్రకటించినా, ఇన్సురెన్స్‌, పెట్టుబడి రెండింటిని వేరు వేరు సాధ నాలుగా చూడాలనీ ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. తాజా మార్కెట్‌ పరిస్థి తుల్లో ఇన్సురెన్స్‌ పథకాల్లో పాలసీదారులు పెట్టుబడిదారులుగా మారా రన్నది నిజమే అయినా, ఆర్థిక ప్రణాళిక సరిగ్గా లేకుండా పెట్టుబడులు లేదా ఇన్సురెన్స్‌ పథకాలను తీసుకోవడంలో జాగ్రత్త పడితే అన్ని విధాలా శ్రేయస్కరం.