Thursday, April 1, 2010
ఎస్‌బీఐ 8% పథకంలో మార్పు
ముంబయి: గృహ రుణాలపై తొలిఏడాది 8% స్థిరవడ్డీ వసూలు చేసే పథకాన్ని భారతీయ స్టేట్‌బ్యాంక్ ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకు కొనసాగిస్తోంది. అయితే 2వ, 3వ సంవత్సరాల్లో మాత్రం 9% స్థిరవడ్డీ వసూలు చేయనున్నారు. ఏప్రిల్ 30 తరవాత తీసుకునే రుణాలపై చలనవడ్డీ అమలవుతుందని బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం రూ.5 లక్షల లోపు రుణంపై 8% స్థిరవడ్డీని అయిదేళ్లపాటు వసూలు చేస్తున్నారు. రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు రుణాలపై మొదటి సంవత్సరం 8%, మరో రెండేళ్లపాటు 8.5% స్థిర వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇకపై రుణమొత్తంతో సంబంధం లేకుండా తొలి ఏడాది 8%, రెండు, మూడు సంవత్సరాల్లో 9% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఏప్రిల్‌లోనే రూ.3000 కోట్ల మేర గృహ రుణాలు మంజూరు చేయాలని ఎస్‌బీఐ భావిస్తోంది