Thursday, April 1, 2010

మారుతి 800 మాయం

న్యూఢిల్లీ: భారత ఆటో మొబైల్ పరిశ్రమలో సరికొత్త విప్లవానికి తెరతీసిన మారుతి 800 ఇక కనుమరుగుకానుంది. దేశంలోని 13 పట్టణాల్లో నేటి నుంచి సరికొత్త కాలుష్య ప్రమాణాలు అమలులోకి రానున్న నేపథ్యంలో మారుతి సుజుకీ తన చిన్న కారు మారుతి 800 విక్రయాలను నిలిపివేస్తోంది. రానున్న కాలంలో మిగతా మార్కెట్లలో కూడా దీని విక్రయాలకు స్వస్తిపలుకుతున్నట్లు కంపెనీ తెలిపింది.


దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ సహా పదమూడు పట్టణాల్లో భారత్ స్టేజ్ (బిఎస్) ఐగ కాలుష్య ప్రమాణాలు ఏప్రిల్1 నుంచి అమలులోకి వస్తున్నాయి.

కాగా మిగతా ప్రాంతాల్లో అక్టోబర్ నుంచి బిఎస్ ఐఐఐ కాలుష్య నిబంధనలు అమలులోకి వస్తాయి. మారుతి సుజుకీ బ్రాండ్ నిర్మాణం, విజయ పరంపరను కొనసాగించడంలో మారుతి 800 కారు పాత్ర అద్భుతమైనదని మారుతి సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్‌సి భార్గవ పేర్కొన్నారు.

మారుతి 800తో ఎన్నో సెంటిమెంట్లు ముడిపడి ఉన్నాయని, అయితే బిజినెస్‌లో ఇలాంటి వాటికి కొంతదూ రంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. 25 ఏళ్ల పాటు మార్కెట్లో ఉన్న మారుతిలో బిజినెస్ అంతగా ఉండే అవకాశం లేనందువల్ల దీనిని బిఎస్ ఐగ కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయలేదని ఆయన చెప్పారు.

ప్రీమియర్ పద్మినీ, అంబాసిడర్‌లకు గట్టి పోటీ
మారుతి 800 మార్కెట్లోకి రావడానికి పూర్వం కార్ల మార్కెట్లో ప్రీమియర్ పద్మినీ, అంబాసిడర్‌ల హవాయే నడిచింది. 1983 డిసెంబర్ 14న గుర్‌గావ్ ప్లాంట్‌నుంచి మారుతి 800 మార్కెట్లోకి దూసుకొచ్చింది.

ప్రీమియర్ పద్మినీ, అంబాసిడర్‌లకు గట్టిపోటీనివ్వడం మొదలైంది. అంతేకాకుండా కార్ల మార్కెట్లో నూతన విప్లవానికి బాటలు వే సింది. మారుతి 800 కారు అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ సమక్షంలో మార్కెట్లోకి విడుదలైంది.

2006 వరకు మారుతి హవా..
మారుతి 800 హవా 2006 సంవత్సరం వరకు కొనసాగింది. అప్పటి వరకు బెస్ట్‌సెల్లింగ్ కారుగా ఉన్న మారుతి 800కు మారుతి సుజుకీ నుంచి వ ్చన ఆల్టో నుంచే పోటీ మొదలైంది. అనంతరం మార్కెట్లోకి వచ్చిన వ్యాగన్ ఆర్‌తో పాటు హ్యుండయ్ సాంత్రో నుంచి కూడా పోటీ పెరిగింది.

ఫోర్ట్ ఐకాన్, ఫియట్ పాలియోల అమ్మకాల నిలిపివేత
భారత్ స్టేజ్ ఐగ ప్రమాణాలకు అనుగుణంగా లేని ఫోర్డ్ ఐకాన్, ఫియట్ పాలియోల అమ్మకాలను కూడా 13 పట్టణాల్లో నిలిపివేయనున్నట్లు ఆయా కంపెనీల అధికార వర్గాలు తెలిపాయి. కాగా బిఎస్ ఐగ కు అనుగుణంగా లేని టవేరా విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జనరల్ మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ పి బాలేంద్రన్ తెలిపారు.