.మరో వైపు గత ఏడాది వేసవిలో దీర్ఘకాల యాత్రలకు ప్రాముఖ్యతనిచ్చిన పర్యాటకులు , ఈ ఏడాది మాత్రం వారాంతపు విహారయాత్రలకే మొగ్గు చూపారనీ , సం ప్రదాయంగా దేశ పర్యాటకులు 3-4రోజుల విరామంలో యాత్రలు చేయడానికి ప్రాముఖ్యతను ఇచ్చే సంఖ్య కూడా పెరుగుతుందనీ ఎస్‌టీఐసీ ట్రావె ల్స్ సంస్థ డైరక్టర్, రిచా గోయల్ సిక్రీ అన్నారు. సేద తీరడానికే ప్రస్తు తం పర్యాటకులు ప్రాధాన్యతను ఇస్తున్నారనీ తెలిపారు. కార్పొరేట్ రంగ వృద్ధితో పాటు వేతనాల పెంపు కూడా పర్యాటకులను పెంచింది. ఇప్పటికే పలు టూర్ ఆపరేట్లరు 20-25శాతం వృద్ధిని బుకింగ్స్‌లో నమోదు చేశారు. గత ఏడాది కన్నా ఈ సారి కాశ్మీర్, లడాఖ్, కేరళ, గోవా ప్రాంతాల్లో బుకింగ్స్ ప్రోత్సాహకరంగా నిర్వహించామనీ కాగ్స్ అండ్ కింగ్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అశుతోష్ మెహర్ అన్నారు.
సాధరణ వేళల్లో గోవాలోని 4 నక్షత్రాల హోటల్ ధర నాలుగు పగళ్ళు మూడు రాత్రులకు రూ.13,000 లుగా ఉంటే, ప్రస్తుతం రూ. 15,500లుగా పలుకుతోంది. దీనికి హోటల్ గదుల ధరలు పెరగ డం ఒక ప్రధాన కారణంగా నిలిచింది. మనాలి ప్రాంతంలో 3నక్షత్రాల హోటల్ బస ఒక్క రోజుకు రు.3000-4000లుగా ప్రస్తు తం పలుకుతోంది. ఇప్పుడు చా లా మంది దేశ పర్యాటకులు థాయ్‌లాండ్, మలే షియా, సింగపూర్ ప్రాంతా లకు స్వల్పకాల విహారయాత్రలకు వెళ్లే కన్నా, దీర్ఘ కాల వారంతపు విహారాలకే ఓటు వేస్తున్నారనీ టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు.
మలేషియా, సింగపూర్ నగ రాల్లో వారం రోజుల ప్యాకేజ్‌కు ఒక్క వ్యక్తికి ప్రస్తుతం రు.40,000- 45, 000లుగా ధర ఉంది (వసతితో పాటు). దూర ప్రాంత పర్యాటక స్థలాలైన అమె రికా, యూరొప్ దేశాలకు కూడా బుకింగ్స్ పెరిగాయనీ, విదేశీ పర్యటణలను చూసే కుయోనీ ఇండియా సంస్థ ప్రతినిధి కాశ్మీరా కమ్మిసారియట్ తెలిపారు.
Wednesday, April 7, 2010
ఎండాకాలం.. పర్యాటకుల కాలం!
న్యూఢిల్లీ : ఈ వేసవిలో యాత్రలు చేయదలుచుకున్న వారు ముందస్తు ప్రణాళిక లేకపోతే కష్టపడాల్సిందే. దేశ ప్రముఖ పర్యాటక స్థలాలైన మనాలి, పంచ్‌గనీ, ఊటీ, మున్నార్, డార్జిలింగ్ వెళ్ళాలను వారికి వసతులు దొరకడం ష్టంగా మారనుంది. ఆర్థిక మాంద్య పరిస్థితుల కారణంగా గత రెండేళ్ళుగా ప్ర యాణికులు చిన్న బృందాలుగా మాత్రమే యాత్రలలో దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు మారడంతో మళ్ళీ కుంటుంబ సమేతంగా విహారాలకు వెళ్ళేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారు. పెద్ద బృందాలుగా విహారయాత్రలు చే యడంలో ఆసక్తి కనపరిచే భారతీయులు ముందుండే దేశ పర్యటకులు, ఈ సా రి అదేమాదిరి ముందుకొస్తున్నారని మేక్ మై ట్రిప్ ట్రావెల్ సేవల సంస్థ సీఓఓ, కేయుర్ జోషి అన్నారు. విదేశీ పర్యటనలకు కూడా ఈ ఏడాది అధిక ప్రాము ఖ్యత కనిపిస్తోందనీ తెలిపారు