హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార ధాన్యాల తగ్గుముఖం పట్టడం ప్రభుత్వాన్ని కలవరపరుస్తున్నది. ఒక్కొక్క సమస్యను అధిగమిస్తూ పాలన సుస్థి రత నెలకొంటున్న దశలో ఆహార ధాన్యాల దిగుబడి ప్రభుత్వానికి సమస్యా త్మకంగా మారనుంది. 2009-10 ఆర్థిక సంవత్సరంలో దాదాపు అరవై లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తులు తగ్గుముఖం పడుతున్నట్లు ప్రభుత్వ వర్గాల అంచనా. వీటిల్లో నిత్యావసర వస్తువుల కొరత ఎక్కువగా ఉండడంతో మళ్లీ ధరలకు రెక్కలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీలలో 214.87 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడులు సాధిం చాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. వాస్తవానికి వ్యవ సాయ శాఖ అంచన 173లక్షల టన్నులే కాని, అంతకు ముందు ఏడాది (2008-09) లో పరిస్థితులు సానుకూలంగా ఉండడంతో 204.21లక్షల టన్నుల మేరకు ఆహార ఉత్పత్తులు సాధ్యమయ్యాయి. దీని ఆధారంగా 2009-10 లక్ష్యాలను 214.87 లక్షల టన్నులుగా అంచనా వేశారు.
పరిస్థితులు తలకిందు లయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగా ఖరీఫ్‌లో పంట దిగుబడి తగ్గు ముఖం పట్టింది. వీటి ఆధారంగా కనీసం 155.56 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడులు వస్తాయన్న అంచనాలతో గతంలో నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 60లక్షల టన్నుల వరకు తక్కువ ఆహార ఉత్పత్తులు వ్యవసాయశాఖ తెలిపింది. గత ఏడాది కంటే ఈ తగ్గుదల 48.65లక్షల టన్నులు, సాధారణ లక్ష్యంతో చూసుకుంటే 18 లక్షల టన్నుల మేరకు తగ్గుదల ఉంది.
2008 ఖరీఫ్‌లో 105.71లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధ్య మైంది. దీని అంచనాలతో 2009 ఖరీఫ్‌లో 113.48 లక్షల టన్నులను లక్ష్యం గా పెట్టుకున్నారు, ప్రతికూల పరిస్థితుల కారణంగా 72.96 లక్షల టన్నుల మేరకు సాధ్యమైంది. అదేవిధంగా గత రబీ సీజన్‌లో 99.02 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి ఉండగా, ఈ సీజన్‌లో 82.6 లక్షల టన్నుల సాధిం చాలని అంచనా వేశారు. 16.42 లక్షల టన్నుల మేరకు తగ్గుదల చోటు చేసుకుంది. గత ఏడాది కాలంగా వరుసగా ఒకదాని వెంట ఒకటిగా సమస్యలు రాష్ట్రాన్ని వెంబడిస్తున్నాయి. ఆహార ధాన్యాల కొరత కారణంగా వ్యాపారవర్గాలు కృత్రిమ కొరత సృష్టించే అవకాశాలు లేకపోలేదు.
ధరల స్థిరీకరణకు ప్రభు త్వం ఇప్పటి వరకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోని కారణంగా మున్ముందు కూడా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తుందన్న నమ్మకాన్ని ప్రజలు విశ్వసిం చడం లేదు. గత ఏడాదిలో ‘సన్న బియ్యం ధరలు ఆకాశాన్ని అంటాయంటే దొడ్డు బియ్యం తినండి ఆరోగ్యానికి మంచిది’ అని, ‘దేశవ్యాప్తంగా పంచదార కొరత ఉంది, తీపి పదార్ధాలను వినియోగాన్ని తగ్గించుకోండి’ ప్రజానీకానికి ఉచి త సలహాలు ఇచ్చిన పాలకులు ధరల నియంత్రణలో ఘోరవైఫల్యం చెందారు.
ప్రస్తుతం 60లలక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తులు తగ్గుదల ఉండగా వాటిలో కేవలం బియ్యం వాటా సుమారు 20లక్షల టన్నుల మేరకు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడే సామాన్య ప్రజలకు బియ్యం ధరలు అందుబాటులో లేవు. గత కొంత కాలం వరకు సన్నబియ్యం రూ.35ల నుంచి రూ.40 వరకు మార్కెట్‌లో ధరల పలికాయి. ఖరీఫ్, రబీ ధాన్యం మార్కెట్‌లోకి వచ్చిన రోజుల్లో కొంత మేరకు బియ్యం ధరలు తగ్గినట్లుగా కనిపించనప్పటికీ షరా మామూలే అన్నట్లు మళ్ళీ మంచి బియ్యం రూ.25 నుంచి 35 మధ్యన ఊగిసలాడుతునే ఉంది. రబీ పంటను అమ్ముతున్న రైతాంగానికకి క్వింటాలుకు రూ.800 నుంచి రూ.900ల వరకు మద్దతు ధర లభిస్తుండగా, వినియోగదారులకు మాత్రం కిలో రూ.25లకు పైమాటే లభిస్తున్నది.
పొరుగు రాష్ట్రాల నుంచి గోధుమలు, బియ్యం తీసుకువచ్చి రాష్ట్రంలోని గోదా ముల్లో నిల్వచేయడం వల్ల, ఉప్పుడు బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలించకపోవ డం వల్ల రబీ ధాన్యం కొనుగోళ్ళు దాదాపుగా నిలిచిపోయాయనే చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్‌సిఐ లేవీ బియ్యం సేకరణను పూర్తిగా నిలిపి వేసింది. ఉప్పుడు బియ్యాన్ని తరలించాలని వ్యాపారవర్గాలు, మిల్లర్లు ప్రభు త్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నా ఆమేరకు సర్కారు నుంచి స్పందన కరవు అవుతు న్నది. ఉప్పుడు బియ్యం పేరుతో రాష్ట్రం నుంచి సన్న బియ్యం బయటకు తరలి పోతాయనే అపోహతో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది.