ధర నిర్ణయం కాలేదు : స్టాన్‌చార్ట్
ధర నిర్ణయం కాలేదు
స్టాన్‌చార్ట్ న్యూఢిల్లీ: అన్నీ సవ్యంగా జరిగితే దేశంలో తొలి ఐడీఆర్‌లను జారీ చేసిన కీర్తి స్టాన్‌చార్ట్‌కే దక్కుతుంది. నిధుల సమీకరణకు గరిష్ఠ పరిమితి అంటూ ఏదీ పెట్టుకోలేదని స్టాన్‌చార్ట్ పీఎల్‌సీ సీఈఓ(ఇండియా, దక్షిణాసియా) నీరజ్ స్వరూప్ అంటున్నారు. ప్రస్తుతం బ్యాంకు షేర్లు 17 పౌండ్ల వద్ద ట్రేడవుతున్నాయని, ఇంకా మార్పిడి రేటు మాత్రం నిర్ణయించుకోలేద'ని వివరించారు. మొత్తం 22 కోట్ల ఐడీఆర్‌లను బ్యాంకు తీసుకొస్తుండగా.. ఇందులో రిటైల్ మదుపుదార్లకు 20 శాతం వరకూ కేటాయిస్తారు.