ఇలాంటి ఆసాధారణ పరిస్థితులకు ఆబ్కారీ శాఖలోని కొందరు ‘కీ’లక వ్యక్తుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయి. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు అవకాశం ఉండదు. ఒక వేళ బదిలీలు చేసిన వెనుకా ముందు ఆలోచించి వివా దాస్పదం కాకుండా తగు జాగ్రత్తలతో చేయడం పరిపాటి. రాష్ట్ర ప్రభుత్వం కొందరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు వివిధ శాఖల్లో ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలను అసెంబ్లీ సమావేశాల తర్వాత చేయాలని వాయిదా వేసి మరీ ఆ తర్వాతే చేసింది. కానీ ప్రభుత్వానికి ఆదా యాన్ని తెచ్చిపెడుతున్నామనే దీమా కాబోలు ఆబ్కారీ శాఖ ముందు చూపుతో(40రోజుల ముందు) అన్యులకు స్థానాలను పదిలం చేయడం గమనార్హం.
ఈ చర్య వల్ల రాష్ట్రంలో ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల బదిలీల కంటే ఎకై్సజ్ శాఖలో సర్కిల్ ఇన్సిపెక్టర్(సిఐ) నుంచి డిప్యూటీ కమిషనర్(డిసి) వరకు జరిగే బదిలీలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. వాస్తవానికి వాణిజ్యపన్నుల శాఖతో పోలిస్తే నాల్గొవ వంతు ఆదాయం ఎకై్సజ్ ద్వారా వస్తుంది. రెవిన్యూలో వాణిజ్య పన్నులశాఖ తర్వాతే ఎకై్సజ్ శాఖ ఆదాయంలో రెండవ స్థానం లో ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయం(సిఎంఒ) సైతం ఈ రకమైన ముందుచూపు వ్యవహారాలకు పచ్చజెండా ఊపు తుంది. విశాఖపట్నంలో ఎకై్సజ్ అసిస్టెంట్‌కమిషనర్ (ఎసి) గా ఉన్న కేశవరావు అనే అధికారి వచ్చే నెల (ఏప్రిల్) 30వ తేదీన పదవి విరమణ చేస్తున్నారు.
విశాఖ ఎసి పోస్టు ఖాళీ అయితే ఏప్రిల్ 25వ తేదీ తదుపరి కానీ, మే మొదటి వారంలో పోస్టింగ్ ఇవ్వవచ్చు. లేదంటే ఎకై్సజ్ డిప్యూటీ కమిషనర్‌నే అసిస్టెంట్ కమిషనర్(ఎసి) ఇన్‌చార్జిగా కొంత కాలం పాటు కొనసాగించవచ్చు. గతంలో పై అధికారులు కింది పోస్టులు ఖాళీ అయినప్పుడు సంవత్సరాల తరబడి ఇన్‌ఛార్జిలుగా బాధ్యతలు నిర్వహించిన దాఖలాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లో డిప్యూటీ కమిషనర్ పోస్టులో ఉన్న ఒక ఐఆర్‌ఎస్ అధికారి ఏడాది క్రితం బదిలీ అయితే ఆపోస్టును జాయింట్ కమిషనర్‌కు అప్పగించారు. ఇప్ప టికీ జాయింట్ కమిషనర్‌రే డిసిగా కొనసా గుతున్నారు.
అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అసిస్టెంట్ ఎకై్సజ్ సూపరిం టెండెంట్(ఎఇఎస్)లు లేకపోతే మరో డివిజన్‌లో ఉన్న ఎఇఎస్‌లను ఇన్‌చార్జిగా కొనసాగిస్తున్నారు. చిత్తూరులో డిప్యూటీ కమిషనర్ పోస్టు ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ అసిస్టెంట్ కమిషనర్‌ను ఇన్‌ఛార్జిగా కొంతకాలం పాటు బాధ్యతలు నిర్వహించిన సందర్భం లేకపోలేదు. అదే విధంగా చిత్తూరు ఎకై్సజ్ సూపరింటెండ్ పోస్టు ఖాళీగా ఉన్నప్పుడు అసిస్టెంట్ కమిషనర్‌ను ఇన్‌చార్జిగా ఉంచి నడిపించారు. అంతే కాదు రాజధానికి పక్కనే ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో ఎకై్సజ్ సూపరింటెండెంట్, డిప్యూటీ కమిషనర్ పోస్టులకు అసిస్టెంట్ కమిషనర్‌ను ఇన్‌చార్జిగా కొనసాగించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఆబ్కారీ కమిషనరేట్‌లో ఉన్న ఒక అధికారికి సచివా లయంలోని ఉన్నతాధికారులతో ఉన్న సన్నిహితం ఎకై్సజ్ శాఖ అధికారులకు ఇన్‌ఛార్జి బాధ్యతలు, ముందు చూపుతో పోస్టింగ్‌లు సాధ్యమవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. 1986లో ఎకై్సజ్‌శాఖ ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి దాదాపు రెండు న్నర దశాబ్దాల కాలం పాటు అదే విభాగంలో కొనసాగు తున్న ట్లు సమాచారం. ప్రస్తుతం ఎకై్సజ్ అంశాన్ని చూసే రెవిన్యూ ముఖ్యకార్యదర్శి అశుతోష్ మిశ్రా గతంలో ఎకై్సజ్ శాఖ కమిషనర్‌గా పనిచేయడం వల్ల ఆ అధికారి ఆడిందే ఆట పాడిందే పాటగా చెలమణి అవుతుందని అంటున్నారు. అంతే కాకుండా గతంలో రెవిన్యూ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఎస్వీ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండడం కూడా సదరు ‘కీ’ కి కలిసి వచ్చిందంటున్నారు. ప్రస్తుతం ఎకై్సజ్ శాఖ ముఖ్యమంత్రి వద్ద ఉండడంతో సదరు ‘కీ’ అదృష్టం పండిందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
ఇటీవల జరిగిన ముందస్తు బదిలీలలో కమిషనరేట్‌లోకి కీలక వ్యక్తి సామాజిక వర్గానికి చెందిన వారికి ఫోకల్ టు ఫోకల్ పోస్టులు దక్కడం గమనార్హం. వాస్తవానికి ఫోకల్ పోస్టుల్లో పనిచేసిన అధికారులకు నాన్ ఫోకల్ పోస్టుల్లోకి బదిలీ ఇవ్వాలి. కానీ సదరు కమిషనరేట్ ‘కీ’ కోటరీలో లేని అధికారులకు మాత్రం ఫోకల్ పోస్టుల నుంచి నాన్ ఫోకల్ పోస్టులు పొందినట్లు తెలుస్తున్నది. విశాఖపట్నం అసిస్టెంట్ కమిషనర్ పోస్టును ముందు చూపుతో రిజర్వు చేసేందుకు వ్యూహాత్మకంగా ఆరుగురు అధికారులకు స్థానచలనం కలిగించారు. ఆబ్కారీ అధికారులు జిల్లాల్లో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, అక్రమ బట్టి సారా నిర్వాహకుల నుంచి మామూళ్లు వసూలు చేయడం పరిపాటేనని ఆబ్కారీ ఉద్యోగ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. క్షేత్ర స్థాయి నుంచి కమిషనరేట్ వరకు ఈ పంపిణీలు ఉంటాయని, అందుకే కొన్ని ప్రాంతాల్లో పోస్టింగ్‌ల కోసం ముందు చూపుతో పాటు ఎంతటి ఖర్చు కైనా అధికారులు వెనుకంజ వేయరని కొందరు ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.
హైదరాబాద్, మేజర్‌న్యూస్: ఒక వైపు చట్టసభ (అసెం బ్లీ, కౌన్సిల్)సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆబ్కారీ బదిలీలు, పదోన్నతులు ఇచ్చిన అంశం అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఫోకల్‌లో పనిచేస్తున్న కొందరు అధికారులకు తిరిగి ఫోకల్ పోస్టింగ్‌లు దక్కిన తీరుపై ఇప్పటికే అనేక అపోహలున్నాయి. కాసుల దరవు బాగానే కుదరడం వల్లే ఆస్థాయిలో ఆబ్కారీ శాఖ బదిలీలు జరగడానికి ఆస్కారం లేక పోలేదని ఆబ్కారీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.