Thursday, April 8, 2010

పెరుగుతున్న రాగి వినియోగం

హైదరాబాద్‌ : ఇక ఇళ్లలో రాగి అందాలు తళుకులీననున్నాయి. వంట గది, పడకగది, డ్రాయింగ్‌ హాల్‌తో పాటు డోర్‌నాప్స్‌, సింక్‌లు, బాత్‌టబ్‌లు, వాటర్‌ హీటర్లు, పిల్ట ర్లు, పళ్లాలు ఇలా అన్నీ రాగి అందాలతో మెరిసిపోతూ కనిపి స్తాయి. పొద్దునే రాగి చెంబులో నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తుందో పలువురికి అనుభవైక వెద్యమే. ఇక రాగి కలప నిదే బంగారానికి విలువ రాదు. లోహాల్లో ఎంతో విశిష్టత కలి గిన రాగి ఇప్పుడు గృహలంకరణలో కూడా తన తఢాక చూపి స్తుంది. ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా కాపర్‌ కిచెన్‌వేర్‌ వాడకం ఎక్కువ జరుగుతుంది. చూడటానికి అందంగా ఉండటం, చాలా సేపు ఆహార పదార్థాలు వేడిగా ఉండటం అందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు.

అందుే కాపర్‌ బాటమ్‌ కలిగిన స్టీల్‌ గిన్నెలు ఇప్పటికే మార్కెట్‌ల్లోకి వచ్చేశాయి. చాలా రకాల సూక్ష్మజీవులు రాగిని తాకితే కొన్ని గంటల్లోనే చనిపోతాయని పరిశోధనలో తేలింది. అమెరికా రాగి కలిపిన 275 లోహాలను యాంటీ మైక్రో బియల్‌ మెటీరీయల్స్‌గా గుర్తించి వాడేందుకు అనుమతి ఇచ్చిం ది. దాంతో కార్యాలయాలు, ఆసుప్రతులు, షాపింగ్‌మాల్స్‌ ఇలా అన్ని చోట్ల రాగి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. డోర్‌ హ్యండిల్స్‌, టేబుల్‌ టాపులు, స్ట్రెచ్చర్లు, బెడ్‌పానులు, వాకర్లు, కంప్యూటర్‌ కీబోర్డులు, సబ్బు పెట్టెలు, పెన్నులు, క్లిప్పులు, బెడ్‌ రైలింగులు, కుర్చీలు, ఫిజియోథెరపి పరికరాలు, ఎలివేటర్లు, టెలిఫోన్‌ హ్యండ్‌సెట్లు, ఇలా అన్నింటికి రాగి వినియోగం పెరిగి పోతుంది. ప్రిగో వంటి కంపెనీలు అయితే రాగి రేకులను వాడు తూ డిష్‌వాషర్లు, రిప్రిజిరేటర్లను తయారు చేస్తుంది. రాగితో కూడిన అంతర్గత అలంకరణలు, వాటర్‌పాల్స్‌ ఈ మధ్యనే దర్శన మిస్తున్నాయి. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ రాగి కలిపిన కళాకృ తులను అడైగో సంస్థ ఇటీవలే మార్కెట్‌ లోకి తెచ్చింది.

వైద్య పరికరాలు నుంచి ఫైటర్‌ జట్ల వరకూ రాగినే వినియో గిస్తున్నారు. దువ్వెనలు, పెన్నులు, కళ్లద్దాల ప్రేములు, చెవి పోగులు, బ్రాస్‌లెట్స్‌ ఇలా అన్నీ ఈ మధ్య కాలంలో రాగితోనే దర్శనమిస్తున్నాయి. సిక్కులతో పాటు అనేక మంది రాగి కడియం ధరించడం మనం చూస్తునే ఉంటాం. ఈ విధంగా చేయడం వల్ల రక్తపోటు నివారిస్తుందని, శక్తిని కరిగిస్తుందని చాలా మంది నమ్ముతారు. ప్రాచీన కాలంలో యూరోపియన్‌ దేశంలో రాగి పైకప్పులను వేసేవారట. చరిత్ర పునరావృతం కావడం అంటే ఇదే కాబోలు.