Monday, April 12, 2010

సారా నుంచి ఫారిన్‌ లిక్కర్‌ వరకు

beersహైదరాబాద్‌, : రాష్ట్రంలో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తున్నది. రెండున్నర దశాబ్దాల క్రితం సామాన్యుడికి సారాయి అందించిన బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ప్రస్తుతం విదేశీ మద్యం దిగుమతుల రంగంలోకి అడుగిడింది. గత ఐదేళ్ళ కాలంలోనే ఈ సంస్థ వ్యాపార లావాదేవీలు అంచనాలకు మించిపోతున్నాయి. తొలుత కంపెనీల చట్టం 1956 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 1986లో ఏర్పాటు అయ్యింది. అప్పట్లో దీని ప్రధాన లక్ష్యం సారాయి ప్యాకింగ్‌ చేసి లైసెన్సుదారులకు పంపిణీ చేయడం మాత్రమే. 1987 జనవరి ఒకటో తేదీ నుంచి సారాయి వ్యాపారాన్ని ప్రారంభించిన ఈ సంస్థ 1993 సెప్టెంబరు 30వ తేదీ వరకు కార్పొరేషన్‌ సారా ప్యాకింగ్‌, పంపిణీ కార్యక్రమాలను కొనసాగించింది.

రాష్ట్రంలో సారా నిషేధించిన దరిమిలా కార్పొరేషన్‌ ఈ కార్యక్రమాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. తర్వాత ఈ కార్పొరేషన్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌(ఐఎంఎఫ్‌ఎల్‌), బీరు హోల్‌సేల్‌ వ్యాపారాన్ని చేపట్టింది. ఈ వ్యాపారం 1995 జనవరి 12 వరకు కొనసాగింది. 1995 జనవరి 16వ తేదీ నుంచి 1997 మే 7వ తేదీ వరకు రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు పరచిన కాలంలో కార్పొరేషన్‌ తన విక్రయాలను కేవలం అనుమతించిన కొన్ని వర్గాలకు, పర్మిట్‌లు ఉన్న వారికి మాత్రమే పరిమితం చేసుకుంది. రాష్ట్రంలో పాక్షికంగా మద్య నిషేధాన్ని సడలించాక 1997 మే 8వ తేదీ నుంచి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మళ్ళీ ఐఎంఎఫ్‌ఎల్‌, బీరు హో ్‌సేల్‌ ట్రేడింగ్‌ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఐఎంఎఫ్‌ఎల్‌ ధరలు, సేకరణకు సంబంధించిన మార్గదర్శకాలను బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఖరారు చేస్తుంది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 36 డిపోలున్నాయి.

liquor ఐఎంఎఫ్‌ఎల్‌ సరఫరాను ఈ డిపోల ద్వారానే నియంత్రి స్తారు. రాష్ట్రంలో మొత్తం 36 డిపోలు ఉండగా, వాటిల్లో 20 డిపోలు ప్రభుత్వానికి చెందిన స్థలాల్లో ఉన్నాయి. మిగిలిన 16 డిపోల్లో 12 డిపోలు ప్రయివేటు వ్యక్తు లకు సంబంధించిన గోదా ములలో నడుస్తుండగా, మిగిలిన 4 డిపోలు ప్రభుత్వ సంస్థల నుంచి లీజుకు తీసుకుని గోదాములుగా నిర్విహ స్తున్నారు. అంతే కాకుండా వేసవి కాలంలో డిమాండ్‌కు అనుగుణంగా తాత్కాలికంగా బీరును నిల్వచేయడానికి వీలుగా టెంపరరీ గోడౌన్లను కూడా కార్పొరేషన్‌ తీసుకుం టుంది. అయితే వీటికి చెల్లించే అద్దెల విషయంలో కొన్ని అనుమానాలు లేకపోలేదు. ఈ వ్యాపార కార్యక్రమాల వల్ల కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయంలో పరిపాలనాపరమైన ఖర్చులు పోనూ, మిగిలిన మొత్తాన్ని ప్రివిలేజీ ఫీజు రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నది. ఫలితంగా బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యం క్రయ విక్రయాలకు సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నప్పటికీ కార్పొరేషన్‌కు వచ్చే లాభాలు నామమాత్రంగానే ఉంటుండం విశేషం. అంతే కాకుండా కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయంలో కొంత భాగా న్ని ప్రతియేటా ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర ్‌ఎఫ్‌)కు కూడా జమచేస్తున్నది.

2008-09 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్‌ సేల్స్‌ టర్నోవర్‌ 9932.92 కోట్లు కాగా, 2009-10 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.12 వేల కోట్లకు చేరుకున్నట్లు అనధికార సమా చారం. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ బండ్లగూడలోని ఆంధ్ర ప్రదేశ్‌ ఎకై్సజ్‌ అకాడమీ ప్రాంగణంలో నలబై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు గోదాములు(మొత్తం 80వేల చదరపు అడుగులు) నిర్మించాలన్న ఆలోచన ఉన్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా వాటి నిర్మాణాల అంశాన్ని విస్మరించడం గమనార్హం. రాజధాని పరిసరాల్లో ఉన్న స్థలాల్లో గోదాము లను నిర్మించకుండా తమకు జిల్లాల్లో గోదాముల నిర్మాణా నికి స్థలాలు కేటాయించాలని బేవరేజెస్‌ ఉన్నతాధికారులు కలెక్టర్లను కోరడం విడ్డూరం. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోను, విశాఖపట్నం పరదేశీపాలెం సమీపంలోని స్థలాలను ప్రభుత్వం కార్పొరే షన్‌కు కేటాయించింది. కొన్నేళ్ళ పాటు ఆస్థలాల్లో గోదాముల నిర్మాణం చేపట్టలేదు. అంతలో విశాఖపట్నం లో ఎంపిక చేసిన స్థలం వివాదంలో ఉన్నందున ప్రత్యామ్నాయ స్థలం చూపాలని కోరారు.

table