చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం అక్కడి కార్మికుల హక్కులను హరించివేస్తోందని, అందువల్లే అక్కడి ఉత్పాదనలు ఎంతో చౌకగా ఉంటున్నాయని భారతదేశంలో పలు వురు రాజకీయ నాయకులు భావిస్తుంటారు. అదే విషయాన్ని వారు ప్రచారం చేస్తుం టారు. భారత్ -చైనా ఎకనామిక్ అండ్ కల్చరల్ కౌన్సిల్ అధ్యక్షుడు పి.ఎస్ దేవ్‌ధర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. అత్యు న్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడుకున్న మౌలిక వసతులు, సరఫరా వ్యవస్థ, తక్కువ విలువతో కూడిన కరెన్సీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వెల్లువ లాంటి అంశాల కారణంగా కూడా చైనా ఉత్పత్తులు నమ్మశక్యం కాని తక్కువ ధరలకు లభిస్తున్నాయని ఈ అధ్యయనంలో తేలింది.
చైనాలోని వాణిజ్యసంస్థల్లో 99.90 శాతం చిన్న, మధ్య తరహా సంస్థలే. మొత్తం కార్మికశక్తిలో 75 శాతం ఇక్కడే పని చేస్తున్నారు. చైనా ఎగుమతుల్లో ఈ సంస్థల వాటా 68 శాతం దాకా ఉంటుంది. చైనా జీడీపీ వృద్ధికి రెట్టింపు స్థాయిలో ఎగుమతుల వృద్ధి ఉంటోంది. గత 20 ఏళ్ళలో చైనాలో ఎన్నో చిన్న, మధ్య తరహా సంస్థలు రూపుదిద్దుకున్నాయి. అమెరికా, యూరప్‌లోని ఎస్‌ఎంఈల కన్నా కూడా చైనాలోని వాటి సంఖ్యే అధికం. రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ స్టడీస్ నిర్వహిం చిన అధ్యయనం కూడా ఇదే అంశాన్ని బలపరుస్తోంది.
వివిధ ఉత్పాదనలను చైనా అతి తక్కువ రేట్లకే అందించడంలో శ్రామిక శక్తి కీలక పాత్ర పోషిస్తోంది. ఆయా పారిశ్రామిక కేంద్రాల్లో పని చేసే వారిలో అత్యధికులు చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారే. వీరిలో యువకులే అధికం. వీరి కి ఇంగ్లిషు రాకపోయినప్పటికీ, తమ మాతృభాషలో అంతో ఇంతో చదువుకున్న వారే. వీరిలో చాలా మంది కనీసం 11 ఏళ్ళ పాటు చదువుకొని వివిధ వృత్తివిద్యలు అభ్యసిం చిన వారే. ఈ అధ్యయనంలో సుమారు 300 చిన్న, మధ్య తరహా సంస్థలను పరిశీలిం చారు. ఈ యువకార్మికులకు ఆయా ఫ్యాక్టరీలు భోజనం, వసతి సదుపాయాలను కల్పిస్తాయి. కార్మికులకు నిర్దేశిత వేతనాలను చెల్లిస్తాయి. ఓవర్‌టైమ్ మొత్తాలను కూడా సక్రమంగా చెల్లిస్తాయి.
చైనా కార్మికులతో పోలిస్తే భారతీయ కార్మికులు తక్కువగా చదువుకున్న వారు కావడం, నైపుణ్యాలు ఎక్కువగా లేకపోవడం, దూరప్రాంతాల నుంచి ఫ్యాక్టరీలకు చేరుకోవడం లాంటి కారణాల వల్ల భారతీయ కార్మికుల ఉత్పాదకత తక్కువగా ఉంటోంది. విధానాల రూపకల్పనలో చైనాతో పోలిస్తే భారత్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అధ్యయన బృందం అభిప్రాయపడింది.
చైనాతో పోటీ పడేందుకు పారిశ్రా మికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఇందుకు గాను ఇంగ్లిషు భాష మాట్లాడేవారిలో, సాఫ్ట్‌వేర్‌లో, శిక్షణ నైపుణ్యాల్లో మనకు గల ఆధిక్యాలను ఉపయోగించుకోవాలని సూచించింది. చైనాలో ఉన్న మౌలికవసతులు పాశ్చాత్య దేశా ల్లో వాటికంటే కూడా మెరుగ్గా ఉన్నాయని ఈ బృందం పేర్కొంది. తయారీ యూనిట్లకు చేరువలోనే సరఫరా వ్యవస్థ కేంద్రాలు ఉండడం, కార్మికులు అక్కడికి చేరువలోనే నివాసం ఉండడం లాంటి పలు కారణాల వల్ల చైనా తక్కువ రేట్లకే ఉత్పాదనలను రూపొందించగలుగుతోందని ఈ బృందం తెలిపింది. ఇంధనం, విద్యుత్, నీళ్ళు, మూలధనం, భూమి విలువ, పన్నులు మొదలైన అంశాల్లో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, రాయితీలు చౌక రేట్లకే ఎగుమతులు చేసేందుకు తోడ్పడుతున్నాయని తెలిపింది.
బీజింగ్: చైనా ఉత్పత్తులు ఎంతో చౌకగా లభిస్తాయి. దీని వెనుక ఉన్న రహస్యమేంటన్నది ఎన్నో దేశాల్లో నేటికీ ప్రశ్నార్థకంగానే ఉన్నది. ఈ విషయమై పలు దేశాల్లో పలు అపోహలు ప్రచారంలో ఉన్నాయి. చైనాలో శ్రమ దోపిడి చేస్తారని, జైళ్ళలోని ఖైదీలచే పని చేయిస్తారని...ఇలా ఎన్నెన్నో ఊహాగానాలు. అవన్నీ అపోహలేనని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం క్రమశిక్షణ కలిగిన, విద్యావంతులైన కార్మిక శక్తి చైనా విజయరహస్యమని తేలింది. అంతేగాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా చైనా ప్రభుత్వం అందించే పలు రాయితీల వల్ల కూడా ఆ దేశానికి చెందిన ఉత్పాదనలు ఎంతో చౌకగా మారుతున్నాయి.