Monday, April 19, 2010

నెస్లేకు పామాయిల్‌ సెగల్‌

palmsబహుళజాతి సంస్థ నెస్లేకు పామాయిల్‌ సెగలు తాకాయి. స్విట్జర్లాండ్‌లోని లాసా నే నగరంలో ఇటీవల ఆ సంస్థ వార్షిక వాటాదారుల సమావేశంలోకి గ్రీన్‌పీస్‌ కార్య కర్తలు చొచ్చుకెళ్ళారు. ఒరాంగ్‌టాన్‌లు నివసించే అటవీప్రాంతాలను ధ్వంసం చేస్తూ పామ్‌ మొక్కలను పెంచుతున్న దేశాల నుంచి పామాయిల్‌ కొనవద్దంటూ అభ్యర్థించారు. సాహసకృత్యాలతో నిరసనలు వ్యక్తం చేయడంలో గ్రీన్‌పీస్‌ పేరు గాంచింది. ఎంతోమంది హాలీవుడ్‌ తారలు ఈ సంస్థ ఆందోళన కార్యక్రమాల కోసం నగ్నంగా మారి వివిధ జంతువుల ఆకృతుల్లో పెయింట్‌ వేసుకుని దర్శనమి చ్చారు. తాజా నిరసన కూడా ఎంతో వినూత్నంగా జరిగింది.

షేర్‌హోల్డర్ల మీటింగ్‌ జరుగుతున్న హాల్‌ పై కప్పు నుంచి (20 మీటర్ల ఎత్తు) ఆందోళనకారులు తాళ్ళ సాయంతో కిందకు జారారు. ఒక్కసారిగా తమ మధ్య ప్రత్యక్షమైన నిరసనకారు లను చూసి వాటాదార్లు అవాక్కయ్యారు. ఒరాంగ్‌టాన్‌లు నివసించే అటవీప్రాం తాలను ధ్వంసం చేసి అక్కడ పామ్‌ మొక్కలు సాగు చేసే వారి నుంచి నెస్లే సంస్థ పా మాయిల్‌ కొనడం వివాదానికి దారి తీసింది. అలాంటి ఉత్పత్తిదారుల నుంచి పామా యిల్‌ కొనవద్దంటూ నెస్లే సంస్థను ఆందోళనకారులు అభ్యర్థించారు.

palm-oil సమావేశ మందిరం ముందు పదుల సంఖ్యలో నిరసనకారులు ఒరాంగ్‌టాన్‌ తరహాలో త యారై నిరసన వ్యక్తం చేశారు. నెస్లే తాను రూపొందించే కొన్ని రకాల చాక్‌లెట్‌ ఉత్పాదనల్లో ఈ నూనెను ఉపయోగిస్తోందని ఆందోళన కారులు తెలిపారు. ఇండో నేషియాకు చెందిన సినార్‌ మాస్‌ గ్రూప్‌ సంస్థలు ఉత్పత్తి చేసే పామాయి ల్‌ను, పేప ర్‌ను నెస్లే వాడకుండా చూడాలని ఆందోళనకారులు నెస్లే వాటాదారులను అభ్య ర్థించారు. నెస్లే సంస్థ ఈ ఆందోళనకు బెదిరిపోయినట్లే కన్పించింది. తాము పామ్‌ ఆయిల్‌ వినియోగాన్ని తగ్గిస్తామని సంస్థ ఛైర్మన్‌ పీటర్‌ ప్రకటించారు. ఇం డోనే షియా తదితర దేశాల్లో అడవుల నరికివేతను అడ్డుకోవాలంటూ పిలుపు నిచ్చారు.

palm-oil-keeping జీవ ఇంధనాల తయారీ కోసమే అటవీ ప్రాంతాలను ధ్వంసం చేసి, పామ్‌ సాగు చేస్తున్నారని, తాము ఉపయోగించే 350,000 టన్నుల పామాయిల్‌ మాత్రమే అడవుల నరికివేతకు కారణం కాదని పేర్కొన్నారు. ఒక్క బ్రిటన్‌, జర్మనీలలోనే 500,000 టన్నుల పామాయిల్‌ను కార్లలో జీవ ఇంధనంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. అడవుల ధ్వంసానికి పాల్పడుతూ పామ్‌ సాగు చేస్తున్నారనేందుకు ఆ దారాలు ఉన్నంత కాలం కూడా తాము సినార్‌ మాస్‌ నుంచి పామాయిల్‌ ఉత్పత్తుల కొనుగోలు నిలిపివేస్తామని ఆయన గ్రీన్‌పీస్‌కు రాసిన బహిరంగ లేఖలో తెలిపారు. ఇదే విషయాన్ని తాము తమ సరఫరాదారులకు స్పష్టం చేసినట్లు కూడా పేర్కొ న్నారు. సుస్థిరదాయక వనరుల నుంచే పామ్‌ ఆయిల్‌ ఉత్పత్తి చేయాలని సూచించినట్లు తెలిపారు.

ఇండోనేషియాపై కన్నేసిన ఇమామీ
కోల్‌కతాకు చెందిన వైవిధ్యీకృత ఉత్పాదనల గ్రూప్‌ ఇమామీ మలేసియా, ఇండోనేసియాలో పామ్‌ మొక్కల సాగుపై కన్నేసింది. ఆ సంస్థ కొద్దికాలం క్రితం వంట నూనెల వ్యాపారంలోకీ ప్రవేశించింది. ఇథియోపియా లో ఈ సంస్థ ఇప్పటికే ఒక లక్ష ఎకరాల్లో ప్లాంటేషన్‌ను కలిగిఉంది. అక్కడ ఒక ఎక్స్‌ట్రాక్షన్‌ యూనిట్‌ కోసం, భారతదేశంలో రెండు నూతన వంటనూనెల శుద్ధికర్మాగారాల కోసం రూ. 1000 కోట్లతో పెట్టుబడులు పెట్టనుంది. మలేషియా, ఇండోనేసియాలపై తాము దృష్టి సారించినప్పటికీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఇమామీ డైరెక్టర్‌ ఆదిత్య అగర్వాల్‌ తెలిపారు.

emamiతమ గ్రూప్‌నకు చెందిన ఇమామీ బయోటెక్‌ లిమిటెడ్‌ వంట నూనెల వ్యాపారాన్ని పటిష్ఠం చేసేందుకే విదేశాల్లో ప్లాంటేషన్‌పై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఇమామీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌లో వంటనూనెల రిఫైన రీలను నెలకొల్పనుంది. వీటికిగాను రూ. 600 కోట్లను వెచ్చించనుంది. వీటితో రానున్న రెండు, మూడేళ్ళలో సంస్థ ఉత్పాదక సామర్థ్యం రోజుకు 4,200 టన్ను లకు చేరుకోనుంది. ప్రస్తుతం సంస్థ ఉత్పాదక సామర్థ్యం రోజుకు 1200 టన్ను లు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పే రిఫైనరీ సామర్థ్యం రోజుకు 1200 టన్నులు ఉండగ లదు. గుజరాత్‌లోని రిఫైనరీ కూడా దాదాపు ఇదే సామర్థ్యాన్ని కలిగిఉంటుంది.

పామాయిల్‌ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు
palmగత కొద్దిరోజులుగా పామాయిల్‌ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటు న్నాయి. భారత్‌, చైనాలు దీన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశం ప్రధానంగా ఇండోనేషియా నుంచి ముడి పామాయిల్‌ను దిగుమతి చేసుకొం టోం ది. ఆయిల్‌ పామ్‌ చెట్ల పండ్లలో నుంచి వచ్చే గుజ్జు లాంటి పదార్థంతో పా మాయి ల్‌ను తయారు చేస్తారు. ఇందులో విటమిన్‌ ఎ, ఇ ఎక్కువగా ఉంటాయి. సోయా నూనె అందుబాటు ఎక్కువగా ఉండడంతో పాటుగా మలేషియా కరెన్సీ రింగిట్‌ చా లా బలంగా ఉండడంతో పామాయిల్‌ ఫ్యూచర్స్‌ ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసు కుంటున్నాయి. మలేషియాలో క్రూడ్‌ పామాయిల్‌ నిల్వలు తగ్గిపోతున్నా కూడా ధరల్లో తగ్గుదల ఆగడం లేదు. క్రూడ్‌ పామాయిల్‌ (సీపీఓ) ధరలు తగ్గడా నికి ట్రేడర్లు చెప్పే కారణాలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి.

ఇందులో ప్రధాన మైంది మలేషియన్‌ కరెన్సీ రింగిట్‌ బలంగా ఉండడం. గత 23 నెలల్లో ఎన్నడూ లేనంతగా అత్యధిక స్థాయికి (అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే) ఇది చేరుకుంది. రింగిట్‌ విలువ ఎక్కువగా ఉన్నప్పుడు శుద్ధికర్మాగారాల వారికి సీపీఓను శుద్ధి చేయడం అంత లాభసాటిగా అన్పించదు. దాంతో ఈ రిఫైనరీలు సోయా నూనెను శుద్ధి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తాయి. సోయాబీన్‌ నూనెకు, పామాయిల్‌ మధ్య బలమైన సంబంధం కన్పిస్తుంది. ఒక దాని ధర, ఉత్పత్తి మరో దానిపై తీవ్ర ప్రభావం కనబరుస్తాయి. ఈ ఏడాది మలేషియన్‌ సీపీఓ దిగుబడులు కనీసం 12 శాతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమ యంలో ఏప్రిల్‌ నుంచి మలేషియా ప్రభుత్వం కొత్తగా ఎగుమతి సుం కాలను విధించింది. దక్షిణ అమెరికాలో సోయా విస్తీ ర్ణం పెరుగనుంది.

ఇప్పటికే అక్కడ సోయా సాగు విస్తీర్ణం అధికం. దీంతో సీపీఓ ధరలు ఈ ఏడాది ఆరంభం నుంచి 6 శాతం మేర తగ్గాయి. మలే షియా, ఇండోనేసియాలు పామాయిల్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తాయి. ప్రపం చంలోనే పామాయిల్‌ రంగంలో అతిపెద్ద ఎగుమతిదారు మలేషియా. ఇది 47 శాతం వాటాను కలిగిఉంది. మలేషియాలో ఒక టన్ను సీపీఓను ఉత్పత్తి చేసేందుకు కేవలం వెయ్యి రింగిట్లు మాత్రమే వ్యయం అవుతుంది. అమ్మకం ధర మాత్రం సుమారుగా 2,500 రింగిట్లకు పైబడి ఉంది. ఇండోనేసియాలోనూ ఇదే తరహా పరిస్థితి. దాంతో అక్కడ పామ్‌ సాగు కోసం అడవుల నరికివేత కూడా అధికమై పోయింది. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో అటు ఎన్‌సీడీఈఎక్స్‌, ఎంసీఎక్స్‌ ఇండిూ కూడా సీపీఓ కాంట్రాక్టులను ఆఫర్‌ చేస్తున్నాయి. ట్రేడింగ్‌ ఆసక్తి మాత్రం చాలా తక్కువగా ఉంది. మార్కెట్‌లో హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నాయి.

ఆంక్షలు విధిస్తే మీకే నష్టం
palm-oil--monkeyఒరాంగ్‌టూన్‌ల అంశంపై నెస్లే లాంటి సంస్థలు విధించిన ఆంక్షలను ఇండోనేషి యాలోని పామ్‌ ఆయిల్‌ తయారీ పరిశ్ర మలు బేఖాతరు చేస్తున్నాయి. తమ ఆయి ల్‌ కొనకుంటే మీకే నష్ట మని హెచ్చరిస్తు న్నాయి. యునిలివర్‌, నెస్లే సంస్థల ఆంక్ష లను అవి తేలిగ్గా తీసుకుంటున్నాయి. ఆ రెండు సంస్థలు కొననంత మాత్రాన తమ ఎగుమతులేమీ తగ్గిపోవని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్ర తీ ఒక్కరికీ పామ్‌ ఆయిల్‌ అవసరం ఉందని, నిషేధం విధిస్తే, ప్రపం చవ్యాప్తంగా పామ్‌ఆయిల్‌కు కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయని ఇండోనేసియన్‌ పామ్‌ ఆయిల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జోకో సుప్రియోనో హెచ్చరిం చారు. సరఫరాకు మించిన డిమాండ్‌ ఉన్న కారణంగా తమ ఎగుమతులేవీ ప్రభావితం కావని స్పష్టం చేశారు. భారత్‌, చైనాల నుంచి విపరీతమైన డిమాండ్‌ ఉన్న కార ణంగా ఈ ఏడాది తమ ఎగుమతులు16 శాతం పెరిగి 18 మిలియన్‌ టన్నులకు చేరుకుంటాయన్న ధీమా వ్యక్తం చేశారు.