బీసీజీ, బిజినెస్ వీక్ పత్రికలు సంయుక్తంగా నిర్వహించిన ఈ వార్షిక సర్వే ఫలితాల్లో దేశ ఆర్థిక ప్రగతికి సృజనాత్మక పాత్రే కీలకమని 89శాతం మంది భారత ఎగ్జిక్యూటివ్‌లు తెలుపగా, అమెరికాలో 72శాతం మంది ఈ అభిప్రాయంతో ఏీ భవించారు. ప్రపంచ అత్యంత సృజనాత్మక సంస్థలో యాపిల్‌తో పాటు రెండవ స్థానంలో ఇంటర్నెట్ సర్చ్ ఇంజన్ గూగుల్ ’సిల్వర్‌మెడల్’ స్థానం దక్కించుకుంది. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మూడవ స్థానంలో నిలువగా, నాలుగవ స్థానంలో ఐబీఎం, ఐదవ స్థానంలో జపాన్ ఆటో దిగ్గజం టొయోటా స్థానాన్ని సంపాదించుకుంది. ఈ వరుసలో ఆరవ స్థానంలో ఆమజాన్ డాట్ కామ్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, బీవైడి, జనరల్ ఎలక్ట్రిక్‌లతో పాటు సోనీ సంస్థలు టాప్ టెన్ స్థానాల్లో ఉన్నాయి. వేగంగా వృద్ది చెందుతున్న ఆసియా కంపెనీలు అమెరికాకు గట్టిపోటీ ఇచ్చాయి. ఉత్తర అమెరికా నుండి 24 సంస్థలు పాల్గొన్నాయి. యూరప్ నుండి 11 సంస్థలు ఈ సర్వేలో పాల్గొనగా, దక్షిణ అమెరికా (బ్రెజిల్ పెట్రోబ్రస్) నుండి కేవలం ఒక్క సంస్థ మాత్రమే పాల్గొంది.
ర్యాంకింగ్ల వరుసలో ప్రపంచ ఇతర దిగ్గజ సంస్థలైన బీఎండబ్ల్యూ, నోకియా, కొక-కోలా, వాల్-మార్ట్, పీఅండ్‌జీ, హోండా, మెక్‌డోనాల్డ్స్, వాల్ డిస్నీ సంస్థల కన్నా పై వరుసలోనే టాటా సంస్థ 17వ స్థానంలో నిలిచింది. రిలయన్స్ సంస్థ కూడా డెల్, నెస్లే, వోడాఫోన్, గోల్డ్‌మాన్ సాచ్, నైక్, ఫియట్, ఫేస్‌బుక్‌ల కన్నా మెరుగైన 33వ స్థానాన్ని దక్కించుకుంది. అంతర్జాతీయంగా చేపట్టిన ఈ వార్షిక సర్వేను సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులను, గత మూడు సంవత్సారల స్టాక్ రిటర్న్‌లు, రెవెన్యూ ఆదాయాలు, మార్జిన్ల వృద్ధి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సర్వే చేశారు.
