Friday, April 16, 2010

స.హ.చట్టం పరిధిలో స్టాక్‌ ఎక్స్ఛేంజీలు

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్ల పనితీరుపై ప్రజా పరిశీలనకు అవకాశం కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ప్రభుత్వ సంస్థలని, సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. 'కంపెనీల చట్టం కింద నమోదై, స్వతంత్ర సంస్థలుగా వ్యవహరిస్తున్న తమపై ప్రభుత్వ పెత్తనం లేదని, స.హ.చట్టం కింద కోరిన సమాచారం ఇవ్వాలంటూ తమపై ఒత్తిడి తేవడం సరికాదని' పేర్కొంటూ నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ), జైపూర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీల పిటిషన్లను కొట్టివేసిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, కేంద్ర సమాచార సంఘం వాటిని ప్రభుత్వ సంస్థలుగా పేర్కొంటూ ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది.