Friday, April 16, 2010

కేజీ బేసిన్‌ బ్లాక్‌పై ఎగ్జాన్‌ మొబీల్‌తో ఓఎన్‌జీసీ చర్చలు

న్యూఢిల్లీ: కేజీ బేసిన్‌లో గ్యాస్‌ వెలికితీత ప్రాజెక్టు నుంచి నార్వేకు చెందిన స్టాట్‌ఆయిల్‌, బ్రెజిల్‌కు చెందిన పెట్రోబ్రాస్‌ వైదొలగిన నేపథ్యంలో ఈ రంగంలో అగ్రశ్రేణి సంస్థ ఎగ్జాన్‌ మొబీల్‌ వంటి వాటితో ఓఎన్‌జీసీ చర్చలు జరుపుతోంది. 14 ట్రిలియన్‌ క్యూబిక్‌ అడుగుల గ్యాస్‌ నిల్వలున్న ఈ బ్లాక్‌పై పలువురితో చర్చలు జరుపుతున్నామని వెల్లడించిన శర్మ, వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కష్టాల్లోనూ భాగస్వామ్యం వహించే సంస్థ కోసం చూస్తున్నట్లు ఓఎన్‌జీసీ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) డినేష్‌ కే సరాఫ్‌ తెలిపారు. అంతటి లోతైన ప్రదేశం నుంచి గ్యాస్‌ను ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానం ఓఎన్‌జీసీ వద్ద లేదు. 2007 ఆగస్టు నుంచి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేయడం వల్లే కేజీ - డీడబ్ల్యుఎన్‌-98/2 బ్లాక్‌ నుంచి వైదొలగాలని డీప్‌వాటర్‌ పరిజ్ఞానానికి ప్రత్యేకించిన నార్వే, బ్రెజిల్‌ సంస్థలు నిర్ణయించుకున్నాయి.