Friday, April 16, 2010

జూన్‌లో హైదరాబాద్ మార్కెట్లోకి హార్లే డేవిసన్

హైదరాబాద్ (బిజినెస్ బ్యూరో):అంతర్జాతీయ స్థాయి ప్రీమియం బైక్ హార్లే డేవిసన్ హైదరాబాద్ నగర రోడ్లపై హల్‌చల్ చేయనుంది. మరో రెండు నెలల్లో దీనిని మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు హార్లే డేవిసన్ డీలర్, లక్ష్మీ హ్యుండయ్ డైరెక్టర్ కె జైరామ్ తెలిపారు. ఇక్కడ గురువారం నాడు ఆయన ఆంధ్రజ్యోతి బిజినెస్ బ్యూరోతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన వివరాలు..


హర్లే డేవిసన్ ఎప్పుడు హైదరాబాద్ మార్కెట్లోకి వస్తుంది..?
వచ్చే జూన్ మొదటి లేదా రెండో వారంలో మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తున్నాం.

ఇప్పటి వరకు బుకింగ్స్ ఏమైనా జరిగాయా..?
ఈ బైక్ గురించి ఇప్పటి వరకు దాదాపు ముప్పై ఎంక్వైరీలు వచ్చాయి. మేము ఈ నెల 28 నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తున్నాం.

ఎన్ని మోడల్స్ తీసుకువస్తున్నారు? వాటి ధర గురించి..?
హార్లే డేవిసన్‌లోని 12 వేరియంట్లను రాష్ట్ర మార్కెట్‌కు పరిచయం చేయాలనుకుంటున్నాం. ఈ బైక్ పూర్తిగా కస్టమైజ్డ్. అంటే కస్టమర్ అభిరుచికి అనుగుణంగా దీనిని రూపొందిస్తాం. కాబట్టి ఏ రెండు బైక్స్ కూడా ఒకే విధంగా ఉండే అవకాశం లేదు. ఇక ధరల విషయాకొస్తే.. హార్లే డేవిసన్ బేసిక్ మోడల్ ధర 6,95,000 రూపాయలు. హైఎండ్ మోడల్ ధర 34 లక్షల రూపాయల పైనే ఉంది.