Monday, April 5, 2010

వాహనం కొన్నప్పుడు దానికి బీమా

నం ఏదైనా వాహనం కొన్నప్పుడు దానికి బీమా చేయించడం సహజమే. కొంతమంది మొదట్లో బీమా చేయించినా.. పునరుద్ధరణ (రెన్యువల్‌) సమయంలో బద్ధకిస్తూ ఉంటారు. అలాంటి ఇబ్బంది తప్పించేందుకు, రోడ్లపై తిరిగే ప్రతి వాహనానికి బీమా ఉండేలా చూసేందుకు జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ దీర్ఘకాల పాలసీని తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇది మూడు లేదా ఐదేళ్ల పాలసీగా ఉండే అవకాశం ఉంది. పాలసీలను పునరుద్ధరించుకోకపోవడం వల్ల చాలా వరకు ద్విచక్రవాహనాలకు బీమా ప్రయోజనం కలగడం లేదని జీఐసీ అంటోంది. ప్రీమియం మొత్తం చాలా తక్కువగా(రూ.600-800 మధ్య మాత్రమే) ఉండడం వల్ల బీమా పునరుద్ధరణ విషయంలో ఏజెంట్లు సైతం ద్విచక్రవాహనదార్లపై పెద్దగా మొగ్గు చూపడం లేదు(ట)! టారిఫ్‌ అడ్వైజరీ కమిటీ వద్ద లభించిన తాజా సమాచారం మేరకు 2007-08లో 2 కోట్ల బైక్‌లకు బీమా ఉంది. అయితే సియామ్‌ గణాంకాల ప్రకారం గత ఏడేళ్లలో 4.5 కోట్ల బైక్‌ల విక్రయాలు జరిగాయి.