ల్యాప్‌టాప్‌కు తక్కువ, స్మార్ట్‌ఫోన్‌కు ఎక్కువ
యాపిల్ విశిష్ట ఐప్యాడ్ విడుదల
న్యూయార్క్
యాపిల్ కంపెనీ తన విశిష్ట ఉత్పత్తి 'ఐప్యాడ్'ను నిన్న అమెరికాలో 200కు పైగా కంపెనీ రిటైల్ విక్రయ కేంద్రాలతో పాటు అనేక బెస్ట్ బై దుకాణాల్లో కూడా విడుదల చేసింది. ల్యాప్‌టాప్‌కు తక్కువ, స్మార్ట్‌ఫోన్‌కు ఎక్కువ అనే తరహాలో ఫీచర్‌లు ఉన్నాయని భావిస్తున్న దీనిని ట్యాబ్లెట్ కంప్యూటర్ అని ముద్దుగా పిలుస్తున్నారు. ఇదివరకు ఐఫోన్ విడుదలయినప్పటి మాదిరిగా వేలాది వినియోగదారులు అవుట్‌లెట్‌ల వద్ద కొన్ని గంటల తరబడి పడిగాపులు కాసిన దృశ్యాలు ఐప్యాడ్ విడుదల సమయానికి కనబడలేదు. ఎందుకంటే దీనిని సొంతం చేసుకోవడం కోసం పలువురు అప్పటికే ఇంటర్‌నెట్‌లో ఆర్డర్‌లు ఇచ్చారు. ఇదీ ఒక కారణం.. వేలాదిగా ప్రి-ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ చెప్తోంది. మొదటి సంవత్సర కాలంలోనే 40లక్షల నుంచి 70 లక్షలకు పైగా ఐప్యాడ్‌లు అమ్ముడుపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతానికి ఒక్క అమెరికాలోనే విడుదల అవుతోంది. మరో 9 దేశాల్లో ఈ నెల లోపుగా ఇది అందుబాటులోకి రానుంది.
ఇవీ ప్రత్యేకతలు
* టచ్‌స్క్రీన్ సైజు: 9.7అంగుళాలు
* ఐప్యాడ్ బరువు: 1.5 పౌండ్‌లు (సుమారు 0.681 కిలోగ్రాములు)
* వేగవంతంగా పనిచేసే వెబ్ బ్రౌజర్
* ధర: సుమారు రూ.23,000 (తక్కువ రేంజి ఉండే వై-ఫై మోడల్‌కు)
* 3జీ ఆధారితంగా పనిచేసే మోడల్ ఖరీదు: రూ.36,800
* గేమ్‌లు, వీడియో, బొమ్మలు, ఎలక్ట్రానిక్ పుస్తకాలు, మ్యాగజైన్‌లు సహా పలు రకాల మీడియాకు ఈ ఐప్యాడ్‌ను వాడుకోవచ్చు.
ఐఫోన్ కోసం ఇప్పటికే కనిపెట్టిన లక్షన్నర విధాల అప్లికేషన్‌లకు తోడు ఐప్యాడ్ కోసమే కొత్తగా మరిన్ని అప్లికేషన్‌లు రూపొందించారు.
లోపాలు!: కెమెరా లేదు * ఒక సారి ఒక సేవ (అప్లికేషన్)ను మాత్రమే అందించగలుగుతుంది
* ప్రజల మెప్పు పొందిన.. అడోబ్ ఫ్లాష్ సాఫ్ట్‌వేర్ ఆధారిత.. వీడియో సైట్‌లతో మాత్రం అనుసంధానం కాజాలదు
* కంప్యూటర్‌లు అవసరమైన వారిని ఇది అంతగా ఆకట్టుకోలేకపోవచ్చు.