గ్రామానికి లేదా పట్టణానికి చెందిన వ్యక్తి ఏదైనా ఒక రంగంలో విశిష్టత సాధిస్తే ఆ వ్యక్తి ద్వారా ఆ గ్రామానికి మంచి పేరు రావడం అరుదుగా చూస్తుం డటం జరుగుతుంది. అటువంటి కోవలోకి చెందిన పాక శాస్త్రంలో ప్రావీణ్యత పొందిన ఒక మహనీయుడు చేసిన తినుబండారం ద్వారా ఆ గ్రామం ఖండాంతర ఖ్యాతినార్జించడం విశేషం. ఆయన చేసిన తినుబండారం‘కాజా’. ఆ గ్రామం తాపేశ్వరం.ఆ మహ నీయుడు లోకానికి దూరమై సుమారు రెండు దశాబ్దాలు కావస్తున్నా ఆయన చేసిన వంటకం తీపి గురుతుగా అందరి మదిలో చెరగని ముద్ర వేసింది.
ప్రసిద్ధి చెంది నేడు ఎందరికో జీవనాధారమై కాజాల ద్వారా కాసులు అందిస్తుంది. ఆయనే పాక శాస్త్ర ప్రావీణ్యుడు దివంగత పోలిశెట్టి సత్తిరాజు. ఆయనది తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం. ఇక్కడ కాజా తాపేశ్వరం కాజాగా రాష్ట్ర, దేశ వ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందింది. కాజాను కని పెట్టి తయారు చేసింది తాపేశ్వరంలోనేనని అందరికి తెలిసిందే. దానిని మొట్ట మొదట తయారు చేసింది సత్తిరాజేనని అందరూ చెప్పుకుంటారు. రామచంద్రపురం నియోజక వర్గం లోని కె.గంగ వరం మండలం బ్రహ్మపురి గ్రామం ఆయనది. అక్కడనుంచి తాపేశ్వరం ఉపాధి నిమిత్తం వలస వచ్చి మండపేటలో మిఠాయి రామస్వామి అనే వ్యాపారి వద్ద పనిచేసేవారు.
ఇక్కడే పిండి వంటకాలు తయారు చేయడం నేర్చుకు న్నారు. కొంతకాలానికి రామస్వామి అనారోగ్యకారణంతో వ్యాపారం మానేయ గా సత్తిరాజు తాపేశ్వరంలో చిన్న హోటల్ నెలకొల్పారు. ఆ హోటల్లో తాను నేర్చుకున్న కొన్ని రకాల మిఠాయిలు తయారు చేసి అమ్మేవారు. దాంతో పాటు వివాహాది శుభకార్యాలకు ఎవరైనా పిండి వంటలు తయారు చేసి ఇవ్వమంటే చేసి అందించేవారు. ఇలా వ్యాపారం అభివృద్ధి చెందటంతో 1970 తరువాత హోటల్‌ను విరమించుకుని మిఠాయి వ్యాపారంపై దృష్టిపెట్టారు. శ్రీభక్తాం జనేయ స్వీట్ స్టాల్ పేరుతో స్థాపించారు. అప్పట్లో మైదా పిండితో మడతలు పెట్టి కాజాలను కొత్తగా తయారు చేసి పంచదార పాకం పట్టి అమ్మగా వాటి కమ్మదనం, రుచి, కాజాలోని పాకం అమృతాన్ని మరిపించడంతో తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు వచ్చింది.
దాంతో తాపేశ్వరం అంటే కాజా, కాజా అం టే తాపేశ్వరం అనుకునే విధంగా ఒక దానికొకటి పెన వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందాయి. కాజాకు పేరుపడ్డా ఇక్కడ అసలైన ఆంధ్రాపిండి వంటకాలైన అరిసెలు, సున్నుండలు, పూతరేకులు, బొబ్బట్లు, బూందీ లడ్డూలు, కజ్జి కాయ లు, మైసూర్ పాక్ , పొంగడాలు, గోరు మిఠాయిలు, పంచదార చిలకలు సం ప్రదాయ రీతిలో తయారు చేసి అమ్ముతారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరిం టైనా వివాహాది శుభకార్యాలు జరిగితే ఇక్కడ నుంచి ఆంధ్రా పిండివంటకాలను (సారె) తయారు చేయించి పట్టుకు వెళ్లడం జరుగుతుంది.
ఇది కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు, రాజకీయ,సినీ ప్రముఖులు ఇంట ఏదైనా శుభకార్యాలు గానీ లేదా మరేదైనా కార్యాక్రమాలు గాని నిర్వహిస్తే తాపేశ్వరం కాజా తప్పకుండా ఉంటుంది. తాపేశ్వరం నుంచి తెచ్చిన కాజాను వడ్డించడం గౌరవంగా భావిస్తారు. 50 గ్రాములనుంచి 500 గ్రాములు వరకు బరువుండే విధంగా రకరకాల సైజు లలో వీటిని తయారు చేస్తారు. బెల్లంపాకం, నెయ్యితో చేసిన కాజాలతోపాటు కొంతకాలం నుంచి షుగర్ పేషేంట్‌లను దృష్టిలో పెట్టుకుని షుగర్ ఫ్రీ కాజాలను కూడా ఇక్కడ తయారు చేయడం మొదలుపెట్టారు. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ కాజాను కొనుగోలు చేసి వెళుతూ వుంటారు.
అలాగే పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు ఫ్లవర్ బోకేలకు బదులుగా స్వీట్లు తయారు చేసి వాటిని అం దంగా ప్యాక్ చేసి గిఫ్టుల కింద తయారు చేసి ఇవ్వడం తాపేశ్వరంలో ప్రత్యేకం గా జరుగుతుంది. కాజాతోపాటు వీటి సేల్స్ కూడా ఇటీవల కాలంలో విపరీ తంగా పెరిగింది. కాస్త సంపన్నులంతా పూలబోకేల టైపులో స్వీట్లను బోేల మాదిరిగా తయారు చేయించి బంధువులకు, స్నేహితులకు, శుభకార్యాలు, సీమంతాలు సమయంలో పంపించడం ప్రస్తుతం ఫ్యాషన్‌గా మారింది. 1990 లో సత్తిరాజు మరణించాక ఆయన భార్య భూషణం భర్తకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.
ఆమెకు వయసు మళ్ళడంతో సత్తి రాజు కుమారుడు పోటిశెట్టి మల్లిఖార్జునరావు (మల్లిబాబు) ఈ వ్యాపారాన్ని ఆధునిక పద్ధతుల్లో నిర్వహించడం మొదలుపెట్టారు. కాజాకు ఉన్న డిమాండ్‌తో ఆయనే సొంతంగా చిన్న రోలింగ్ మిషన్‌ను డిజైన్ చేసి దాని సహాయంతో కాజా ల తయారీని సులభతరం చేశారు. గతంలోకంటే ప్రస్తుతం మంచి క్వాలిటీతో ఆక్షణీయంగా వుంటున్నాయి. తాపేశ్వరం నుంచి కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్డరుపై ప్రతీ వారం వారం కాజా పార్శిళ్ళు వెళ తాయి. వీటితోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, సౌదీ అరేబియాలో నివ సించే ప్రవాస భారతీయులకు తాపేశ్వరం కాజా సరఫరా అవుతుంటాయి.
కుటీర పరిశ్రమగా కాజా తయారీ
కాజా తయారీ నేడు రాష్ట్రంలో కుటీర పరిశ్రమగా మారింది. రాష్ర్టంలో తాపేశ్వరం కాజా పేరుతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, రాజ మండ్రి, కాకినాడ, ఏలూరు, భీమవరం,నిడదవోలు, గుంటూరులతో పాటు ప లు పట్టణాల్లో 300 వరకు స్వీట్ స్టాల్స్ వరకు ఉన్నాయి. ఆరు వందల కుటుం బాలు కాజాల వ్యాపారాలు చేస్తుండగా దీనిపై సుమారు 15 వేల మంది కాజా తయారీలో ఉపాధి పొందుతున్నారు. సత్తిరాజు కుటుంబంలోని వారంతా ఇదే వ్యాపారంలో స్థిరపడ్డారు. కాజాతో పాటు ఆంధ్రా పిండి వంటకాల వివరాలతో వెబ్‌సైట్‌ను ఇటీవల ప్రారంభించారు. డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ సురిచి ఫుడ్స్ డాట్ కామ్ పేరుతో ఏర్పాటు చేశారు. దీనిని ఓపెన్ చేస్తే కాజాతో పాటు ఆంధ్రా పిండి వంటల వివరాలు ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌తో ఇటీవల కాలంలో కాజాకు మరిం త ఆదరణ విదేశాల్లో సైతం పెరిగింది.