హైదరాబాద్, మేజర్‌న్యూస్ : రాష్ట్రంలో పెట్టుబ డులు పెట్టటానికి కంపెనీలు ఆసక్తి చూపకపోవడంతో ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఐఐసీ) వెలవెలబో తున్నది. గత ఐదేళ్లలో వేల ఎకరాల భూ కేటాయింపులతో ఏపీఐఐసీ కోట్లాది రూపాయల లాభాలు ఆర్జించి కళకళలా డింది. రాష్ర్ట ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అమలు చేయ డానికి ఏపీఐఐసీ కీలక ఆదాయ వనరుగా మారడంతో ఆ సంస్థకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యం త ప్రాధాన్యతనిచ్చారు. అందుకోసమే ఏపీఐఐసీ సీఎండీని అదే స్థానంలో ఐదేళ్లపాటు వైఎస్ ప్రభుత్వం కొనసాగించింది. ఆర్థిక మాంద్యం, ప్రత్యేక వాదం, ఇతర అల్లర్లతో రాష్ట్రం ని త్యం అట్టుడుకుతుండటంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీ లు పెట్టుబడులు పెట్టటానికి ముందుకురావడంలేదు.
చతికిలపడిన సెజ్‌లు
అదే విధంగా గతంలో అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా కోట్ల రూపాయలు వెచ్చించి ఏపీఐఐసీ వద్ద భూములను కొనుగోలు చేయడానికి ఒకదానితో ఒకటి పోటీ పడేవి. తాజా పరిణామాల నేప థ్యంలో ఏపీఐఐసీ భూముల వైపు కన్నెత్తి చూడడానికే కంపెనీలు ఆసక్తి కనబరచడంలేదు. గతంలో వాయిదా పద్ధతిలో కొనుగోలు చేసిన భూములను కూడా పలు కంపెనీలు మాకొద్దు బాబోయ్ అంటూ వెనక్కి ఇవ్వ డా నికి ఏపీఐఐసీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. సెజ్ లు, ఇతర పారిశ్రామిక పార్కుల విషయంలోనూ దాదా పు ఇదే పరిస్థితి చోటుచేసుకుంది.
ప్రోత్సాహక ధరలకు భూములు ఇస్తేనే...
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక పార్కుల్లో ఎకరం భూమి రూ. 60 లక్షలకుపైనే ఉందని ఏపీఐ ఐసీ చెప్పడంతో మధ్య, చిన్నతరహా కంపెనీలు భూములు కొనుగోలు చేయడానికి వెనుకంజవేస్తున్నాయి. ఫ్యాబ్‌సిటీ, ఏపీసెజ్, హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామిక పార్కులు కంపెనీల నుంచి డిమాండ్ లేక వెలవెల బోతున్నాయి. వందల సంఖ్యలో ఏపీఐఐసీ వద్ద భూ ములు పొందిన కంపెనీలు కూడా రెండేళ్లు దాటినా కూడా ప్రాజెక్టు పనులు చేపట్టలేదు. రియల్ బూమ్‌తో పోటీపడి మరీ కొనుగోలు చేసిన బహుళ జాతి సంస్థలు.. తాజా పరిణామాల నేపథ్యంలో నెత్తినోరు బాదు కుంటు న్నాయి. ఏపీఐఐసీ పూర్వ వైభవం సంతరిం చుకోవాలంటే విసృ్తత స్థాయిలో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా చౌవక ధరలకు భూములు అందచేయాలని పరిశ్రమల అసోసియేషన్లు కోరుతున్నాయి.

అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని, ఆదిశగా నిరంతరం ప్రయత్నిస్తేనే ఈ పోటీ ప్రపంచంలో నిలవగల మని, అప్పుడు మాత్రమే గుజరాత్‌తో పోటీపడగలమని నిపు ణులుసైతం అభిప్రాయ పడుతున్నారు. ఇదిలా ఉండగా నిబం దనల మేరకు రెండేళ్లు లోపు ప్రాజెక్టు పనులు చేపట్టపోతే సదరు సంస్థలకు కేటాయించిన భూములను వెనక్కి తీసు కుంటామని, ప్రత్యేక పరిస్థితుల్లో మరింత గడువు మా త్రమే ఇస్తామని ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. పనులు చేపట్టని కంపెనీలకు పెద్ద సంఖ్యలో నోటీసులు జారీ చేశామని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగు తున్నదని ఏపీఐఐసీ అధికారులు పేర్కొన్నారు.