పత్తికి సోకే పురుగుల నియంత్రించడంలో సమగ్ర సస్యరక్షణ చర్యలకు మించిన మెరుగైన విధానాలు లేవని తేల్చి చెప్పింది. బీటీ ప్రయోగం విఫలం మాట అటుంచితే దీని పర్యవసానాల వల్ల దేశంలో పెద్ద ఉపద్రవమే వచ్చి పడబోతోందని శాస్త్ర వేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. బీటీ పత్తివిత్తనాలు పక్కన పెడితే ఇక పత్తివిత్తనాలకు పెద్ద విపత్తే ఎదుర్కోక తప్పదంటున్నారు. దేశంలో పదేళ్ళ కిందటి వరకూ సాగులో ఉన్న పత్తి రకాలన్నింటినీ పక్కకు నెట్టి బీటీ విత్తనాలు సాగు చేస్తూ వచ్చారు. ఇక అనాటి విత్తనాలకు దాదాపు కాలదోషం పట్టించారు. బీటి పత్తి విఫలం కావటంతో ఇపుడు పాత రాకాలే మళ్లీ బంగారం కాబోతున్నాయి. ఉన్నఫళంగా దేశమంతటికి అనాటి పత్తి విత్తన రకాలు ఎక్కడినుంచి పుట్టుకు వస్తాయన్నదే ఆందోళనగొలుపుతోంది.
విత్తన విపత్తును అధిగమించేదెలా?
పత్తి సాగులో ప్రపంచ దేశాల్లోనే మనదేశం ప్రధాన పాత్రపోషిస్తోంది. మన రాష్ట్రం కూడా దేశంలో పత్తి సాగువిస్తీర్ణంలో 9.6శాతం, ఉత్పత్తిలో 8.4శాతం ఉంది.రాష్ట్రంలో 33.25 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ప్రతిఏటా 53లక్షల పత్తిబేళ్ళు ఉత్పత్తి అవుతున్నాయి. రాయలసీమ, తెలంగాణ జిల్లాలతోపాటు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం తదితర జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో పత్తిసాగుతోనే రైతులు ఏళ్ళ తరబడి ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. బీటీ పత్తి రకాలు కాయతొలుచు పురుగును తట్టుకోజాలవన్న నిజం పత్తి రైతులను నిలువునా కుప్పకూల్చి వేస్తోంది. మరో నెల రోజుల్లో నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో రైతులు పత్తి మొక్కలు నాటుకోవాల్పి ఉంది. వర్షాధారంగా కూడా పత్తి సాగుకు సిద్దపడాల్సిన పరిస్థితోల్లో బీటి వార్తలు రైతుల నెత్తిన పిడుగు పాటులా మారుతున్నాయంటున్నారు.
బీటీ ఎలా వచ్చింది?
పత్తి రైతులను ఇంతలా కుదిపివేస్తున్న బిటీ పత్తి ఇక్కడికి చేరిన వైనాన్ని పరిశీలిస్తే....శనగ పచ్చపురుగును తట్టుకునే పత్తి వంగడాల రూపకల్పనలో బాగంగా బేసిల్లస్ తురిన్‌జియస్ అనే బాక్టీరియానుంచి కీటక నిరోధక శక్తి గల జన్యువులను సేకరించారు.వీటిని పత్తి వంగడాల్లో చొప్పించడంద్వారా రూపొందించినవే బీటీి పత్తి విత్తనాలు. 1996లో అమెరికా వ్యాపార సరళిలో దీన్ని వినియోగంలోకి తెచ్చింది.మనదేశంలో మొదటగా మోన్‌శాంటో కంపెనీ మహికో కంపెనీతో కలిసి ఎం.ఇ.సి.హెచ్చ-12,162,184, అనే బీటి రకాలను తయారు చేసింది. 1999-2001 మద్యన ప్రయోగాలను పూర్తి చేసి 2002లో వ్యాపారసరళిలో విడుదల చేసింది.
ఉన్నవీ..పోూ....
గతంలో ఏన్నో మేలైన, మెరుగైన పత్తి వంగడాలు పుష్కలంగా ఉన్నప్పటికీ బీటీ కోసం వెంపర్లాడి ఉన్నవీపోయి.. తెచ్చుకున్నవీ పోయినట్లయింది. ఇప్పుడు తమగతి ఏమిటని రైతులు ఆందోళన చెందుతన్నారు. వర్షాధారంగా పండే ముంగారితో పాటు మరెన్నో దేశవాళీ రకాలు, నరసింహ వంటి అమెరికన్ రకాలు, లాం హైబ్రిడ్స్ వంటి సంకర రాకాల పత్తి విత్తనాలన్నీ బీటీ రాకతో క్రమేపి కనుమరుగవుతూ వచ్చాయి. ఇపుడు పాత రకాల సీడ్‌బ్యాంక్ తప్ప సాగుకు అవరసమైన విత్తనాలు లేవు. వీటినే మల్టి ఫ్లై చేసుకోవాలంటే మరికొన్నేళ్ళు ఆగాల్సిందే అంటున్నారు. అప్పటిదాక పత్తి రైతుకు దారి ఏమిటన్నదే ప్రశ్న...
Tuesday, April 6, 2010
పత్తి విత్తుకు విపత్తు
హైదరాబాద్: ఆధునిక వ్యవసాయ విజ్ఞానం పేరుతో అమె రికన్ కంపెనీ చేసిన ప్రయోగం తిరగబడింది. చీడపీడల నివారణలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందని నమ్మిన బీటి పత్తిలో అంత సత్తాలేదని తెలిపోయింది. ఈ సరికొత్త ప్రయోగానికి తెరలేపి రైతులను ఇంతకాలం నమ్మించిన మోన్‌శాంటో కంపెనీ చేతులెత్తేసింది. అన్నిరకాల పురుగులను నియంత్రించే శక్తి లేదని కుండ బద్దలు కొట్టింది. పత్తిని ఆశించే కాయతొలుచు పురుగుల్లో అత్యంత ప్రమాద కరమైన శనగ పచ్చపురుగును తట్టుకునే శక్తి బీటీ-1లో లేదని మోన్ శాంటో అంగీకరించింది. ఇదే అంశాన్ని వివరిస్తూ బీటీ పత్తి వ్తినాలను ఉత్పత్తిచేసే ఇతర కంపెనీలకు కూడా లేఖలు రాసింది.