Thursday, April 8, 2010
డ్రైవరు నిద్రపోయినా పర్వాలేదు ...కారు నేరుగా గమ్యం చేరుతుంది!
వాషింగ్టన్: అత్యవసర పరిస్థితుల్లో డ్రైవరుతో నిమిత్తం లేకుండానే కారును నేరుగా...సురక్షితంగా గమ్యస్థానానికి తీసుకెళ్లే అత్యద్భుత కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్తర కెరొలినా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పరిశోధన ఇంకా ప్రాధమిక దశలో ఉందనీ, మున్ముందు మరిన్ని సరికొత్త ఆవిష్కరణలతో మరింత బలమైన ఫలితాలను సాధిస్తామనీ వారు చెబుతున్నారు. ఈ శాస్త్రవేత్తల బృందం రూపొందించిన కంప్యూటర్ ప్రోగ్రాం కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుకు గురైనా, తీవ్రమైన మధుమేహం కారణంగా నిస్సత్తువగా పడిపోయినా, అనుకోకుండా నిద్రలోకి జారుకున్నా... కూడా చటుక్కున రంగంలోకి దిగి మొత్తం పరిస్థితిని చేతుల్లోకి తీసుకుంటుంది. అన్ని వ్యవస్థలను చక్కగా నియంత్రిస్తుంది. సురక్షితంగా గమ్యం చేరుస్తుంది. ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ...సిగ్నల్స్‌ను తు,చ తప్పకుండా అనుసరిస్తూ ముందుకు దూసుకుపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు