'అంజలి తెలివైన అమ్మాయేగానీ ఉద్యోగంలో రాణించలేకపోతోంది. కళ్యాణ్ బ్యాచ్ టాపరేగానీ ఇంటవ్య్వూలో ఓటమి. రాహుల్ కష్టపడి చదివాడుగానీ మంచి ర్యాంక్ సాధించలేకపోయాడు' - కారణం తెలుసా? సరైన ప్రణాళిక లేకపోవడం. టెక్నాలజీని పూర్తిస్థాయిలో వాడుకోలేకపోవడం. నేటి ఆన్‌లైన్ ప్రపంచంలో కంప్యూటర్‌తో సహవాసం సర్వసాధారణం. ఉద్యోగుల నుంచి విద్యార్థుల వరకూ గంటల సమయాన్ని సిస్టం ముందు గడిపేస్తుంటారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం బ్రౌజింగ్ చేస్తూ పక్కదారి పట్టి అసలు ప్రయోజనాన్ని మర్చిపోతారు. మెయిల్ చెక్ చేసుకుందామని లాగిన్ అయ్యి సోషల్ నెట్‌వర్కింగ్‌కి అతుక్కుపోతారు. విలువైన సమాచారం కోసం వెతుకుతూ వేరే లింక్‌ల్లోకి వెళ్లిపోతుంటారు... ఇలా చాలా మంది టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోకపోడం వల్ల నేటి పోటీ ప్రపంచంలో వెనకబడుతున్నారు. ఈ నేపథ్యంలో టెక్నాలజీని సరైన రీతిలో వాడుకునేందుకు కొన్ని నియంత్రణ సూత్రాల్ని తెలుసుకుందాం!చదువు.. ఉద్యోగం.. వ్యాపారం.. రంగం ఏదైనా పోటీ పెరుగుతోంది! మరి, మీరు నెగ్గాలంటే? టెక్నాలజీ తోడు కావాల్సిందే!
సమయంపై నిఘా!
ఆఫీస్, ఇంట్లో, స్కూల్, కాలేజీల్లో సిస్టంపై ఎంత సమయం ఏయే పనులకు కేటాయిస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? నెట్ ప్రపంచంలో ఏయే సర్వీసుల్లో ఎంత సమయం గడిపేస్తున్నారో లెక్కవేశారా? ఆ వివరాలు తెలుసుకుంటే మీ ప్రణాళికలో చాలా మార్పు వస్తుంది కదా. అయితే, Rescue Time టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది మీ పీసీలోని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వ్యవహారాలపై నిఘా వేస్తాయి. సైట్‌లోకి వెళ్లి రెస్క్యూ టైం సోలో లైట్ ఉచిత వెర్షన్‌ను ఎంచుకోండి. వచ్చిన పేజీలోని వివరాల్ని నింపి ఎకౌంట్ క్రియేట్ చేసుకుని సెట్‌అప్‌ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేయగానే స్టిస్టం ట్రేలో ఐకాన్ కనిపిస్తుంది. Get Started, Time Reports, Custom Reports ఆధారంగా ఏయే సర్వీసుల్లో ఎంత సమయం గడిపారో గ్రాఫ్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. మ్యాక్, లినక్స్ వెర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. డౌన్‌లోడ్ కోసం www.rescuetime.com చూడండి. Fruitful Time Productivity Meter మరో టూల్. టైం ట్రాకింగ్ మాత్రమే కాకుండా బుక్‌మార్క్ మేనేజ్‌మెంట్, టాస్క్, నోట్స్ మేనేజ్‌మెంట్ సర్వీసుల్ని కూడా అందిస్తోంది www.fruitfultime.com. ఇక ఎలాంటి డౌన్‌లోడ్స్ ఇన్‌స్టాలేషన్స్ లేకుండానే మీరు వాడుతున్న ఫైర్‌ఫాక్స్‌లో LeechBlock, Timetracker, 8aweek, MeeTimer యాడ్‌ఆన్స్ ద్వారా కూడా టైం ట్రాకింగ్ చేయవచ్చు. లీచ్‌బ్లాక్ యాడ్‌ఆన్‌తో అక్కర్లేని వెబ్‌సైట్స్‌ని బ్లాక్ చేయవచ్చు. సైట్‌లోకి వెళ్లి కనిపించే Add to firefoxపై క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. దీంతో బ్రౌజర్ రీస్టార్ట్ అయ్యి టూల్స్ మెనూలో LecchBlock ఓపెన్ అవుతుంది. దీంట్లోని ఆప్షన్స్‌ని ఎంచుకుని What to block, when to Block, How to Blockలతో బ్రౌజింగ్‌కి పరిధుల్ని ఏర్పాటు చేయవచ్చు. మొత్తం యాడ్‌ఆన్స్ కోసం https://addons.mozilla.org/en-US/firefox/addon చూడండి. మీరు క్రోమ్ వాడుతున్నట్లయితే Stayfocusd యాడ్‌ఆన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.
ప్రణాళిక అవసరం
లక్ష్యం సాధించాలంటే ప్రణాళిక అవసరం. అందుకు చేయాల్సిన పనుల్ని గుర్తు చేస్తూ, ముఖ్యమైన సమాచారాన్ని ఆన్‌లైన్‌లోనే భద్రం చేసుకునేలా ఆన్‌లైన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అవే Google Calender, 30 boxes, Evernote, iClippy, Springpad. మీరు జీమెయిల్ వాడుతుంటే, గూగుల్ క్యాలెండర్‌లో Day, Week, Month ఆధారంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవచ్చు. Remaider సౌకర్యంతో చేయాల్సిన పనిని ఈమెయిల్, పాప్‌అప్‌ల ద్వారా ముందే తెలుసుకోవచ్చు. www.google.com/googlecalendar/about.html. ఎలాంటి మెనూలు, టూల్‌బార్స్ లేకుండానే మరింత సులభంగా షెడ్యూల్‌ని క్రియేట్ చేసుకోవాలంటే http://30boxes.comను చూడండి. ఆన్‌లైన్‌లో ఉపయోగపడే సమాచారం దొరికితే భద్రం చేసుకోవాలనుకుంటే www.evernote.com చూడండి. ఈమెయిల్‌కి పంపిన కోడ్‌తో లాగిన్ అయ్యి Newపై క్లిక్ చేసి నోట్స్‌ని భద్రం చేసుకోవచ్చు. http://iclippy.com, http://springpadit.com సర్వీసుల్లో కూడా సమాచారాన్ని భద్రం చేసుకోవచ్చు.
ఇక ఏదీ మర్చిపోరు!
లక్ష్యాన్ని కళ్లముందు కనపించేలా పెట్టుకుంటే అప్రమత్తంగా ఉండడంతో పాటు పట్టుదల రెట్టింపవుతుంది. ఉదాహరణకు పరీక్షల్లో మొదటి ర్యాంకు తెచ్చుకోవాలనుకుంటే మీ కంప్యూటర్ డెస్క్‌టాప్‌పై Get First Rank అని నోట్‌ని అతికించుకోవచ్చు. చేయాల్సిన పనుల్ని కూడా ఈ విధంగా డెస్క్‌టాప్‌పై పెట్టుకోవచ్చు. అందుకోసం Sticky Notesను డౌన్‌లోడ్ చేసుకోండి. www.igorv.comలోకి వెళ్లి ఇన్‌స్టాల్ చేయగానే సిస్టం ట్రేలో కొత్తగా ఐకాన్ కనిపిస్తుంది. రైట్‌క్లిక్ చేసి New Noteని ఎంచుకోగానే డెస్క్‌టాప్‌పై నోట్ వస్తుంది. దాంట్లో మీ లక్ష్యాన్ని టైప్ చేసి సేవ్‌నోట్ ఎంచుకోండి. నోట్స్‌కి అలారం కూడా ఏర్పాటు చేయవచ్చు. www.Sticky-notes.net నుంచి స్టిక్కర్ లైట్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ సర్వీసులు కొన్ని...www.rememberthemilk.com, http://todoist. com, www.vitalist.com
పని ధ్యాసలో పడితే!
పని ధ్యాసలో పడిపోయి సిస్టంకి అతుక్కుపోతున్నారా? జాగ్రత్త సుమా! ఆరోగ్యం పాడవుతుంది. మీ పని సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అందుకే Minute Timer 1.1, WorkSmart, Workrave టూల్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. మినిట్ టైమర్‌తో మీరు అలార్మ్ ద్వారా విరామ సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. వర్క్‌స్మార్ట్‌తో రోజు మొత్తంలో పని షెడ్యూల్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. workrave విరామ సమయాన్ని చూపిస్తూ వ్యాయామ సూత్రాల్ని తెలియజేస్తుంది. www.pc-tools.net/win3 2/mintimer, www.installandenjoy. com/download.html, www.workrave.org/download
వెతికే నైపుణ్యం
పాఠ్యాంశంలో ఏదైనా సందేహం ఉంటే వెంటనే గూగుల్ సెర్చ్‌లో వెతికేస్తుంటాం. వికీపీడీయాలో జల్లెడ పట్టేస్తాం. మీకు తెలుసా? ఒక్కోసారి ఆయా సెర్చింజన్లలో కనిపించే సమాచారంలో కూడా తప్పులు దొర్లుతున్నాయి. అందుకే వెతుకులాటలో మెలకువలు పాటించాలి. Advanced Searchతో మరింత నిర్దిష్టంగా వెతకాలి. గణిత సమస్యలకు సంబంధించిన సమాచారం కోసం www.wolframalpha.com చూడండి. కంప్యూటేషనల్ నాలెడ్జ్ ఇంజన్‌గా దీన్ని పిలుస్తున్నారు. ప్రయాణంలో ఉండగా ఏదైనా అంశానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే సెర్చ్ క్వర్రీ టైప్ చేసి మొబైల్ నుంచి 9773300000కి ఎస్‌ఎంఎస్ చేయండి.
విద్యార్థులకు ప్రత్యేకం
విద్యార్ధులకు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో విలువైన సమాచారాన్ని అందిస్తున్న సైట్‌లు కొన్ని... www.planettutor.in, http://enggmath.com, http://nptel.iitm.ac.in/index. php,http://lecturefox.com, http://ocw.mit.edu/ocw web/web/home/home/index.htm,www.learnerstv.com, http://oyc.yale.edu/,http://academicearth.org, http://freevideolectures.com
