హైదరాబాద్, న్యూస్‌టుడే: ప్రజలకు మరింత చేరువయ్యేందుకు బీఎస్‌ఎన్‌ఎల్(హైదరాబాద్ టెలికం) కొత్తగా అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్లు ప్రవేశపెట్టినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ హెచ్‌టీడీ పీజీఎం రాజీవ్ అగర్వాల్ తెలిపారు. తక్కువ మొత్తానికే అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ఉపయోగించుకునేలా కొత్త పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. రూ.900కే అపరిమిత 512 కేబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో పాటు నెలకు 400 ఉచిత కాల్స్ సదుపాయం, రూ.625కే అపరిమిత 256 కేబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో పాటు నెలకు 100 ఉచిత కాల్స్ సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు. ఈ పథకం ప్లాన్ మొత్తం నుంచి ఉచితకాల్స్ మొత్తాన్ని తీసివేస్తే.. రూ.500కే 512 కేబీపీఎస్, రూ.525కే 256 కేబీపీఎస్ అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ లభించినట్లవుతుందని వివరించారు. ప్రజల్లో ప్రాచుర్యం పొందిన బీఎస్‌ఎన్‌ఎల్ 750 అపరిమిత వినియోగదారులకు ఈనెల 30 వరకు 256 కేబీపీఎస్‌కు బదలుగా... 512 కేబీపీఎస్ స్పీడ్‌ను అందిస్తున్నామని చెప్పారు. హెచ్‌టీడీ పరిధిలోని 4.5లక్షల వినియోగదారులకు ఇప్పటికే ఈ పథకాల గురించి సమాచారం పంపించామని తెలిపారు. మరిన్ని వివరాలకు సమీప వినియోగదారుల సేవా కేంద్రాల్లో లేదా 1504 నెంబర్లో సంప్రదించి ప్లాన్లు మార్చుకోవచ్చని పేర్కొన్నారు.
Wednesday, April 14, 2010
బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ఆఫర్లు