వీక్షకులకు ఆనందాలు ఆట కంటే ఎక్కువగా వివాదాలతోనే అందరి దృష్టిని ఆకర్షించే ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపీఎల్) ఈ సారి కూడా భిన్నంగా ఏమీ సాగడంలేదు. శశిథరూర్- లలిత్ మోడి గొడవతో మళ్లీ పతాక శీర్షికలకెక్కింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌పై సమగ్ర విశ్లేషణ.
నిర్వాహకులకు ధనరాసులు
పెద్దలకు రహస్య వాటాలు
![]() అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ ఐపీఎల్‌ను గుర్తించింది. కానీ... ఇది అంతర్జాతీయం మాత్రం కాదు. పక్కాగా భారత దేశవాళీ టోర్నీ! కాకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ ఆటగాళ్ళంతా పాల్గొనటం ఇందులోని ఆకర్షణ! క్రికెట్‌కు కొత్తదైన ఈ పద్ధతే ఐపీఎల్ విజయవంతం అవటానికి ప్రధాన కారణం! |
| బీసీసీఐకి ఎంత లాభం? గత ఐపీఎల్‌లో... |
| ఆదాయం ఎలా వస్తుందంటే... స్టేడియం లోపల వాణిజ్యప్రకటనలు (5 కోట్లు): బౌండరీ చుట్టూ ఉండే బోర్డుల ద్వారా అడ్వర్టయిజ్‌మెంట్ ఆదాయం *సెట్‌మాక్స్ నుంచి వచ్చే 8,200 కోట్ల (పదేళ్ళకు) రూపాయల్ని బీసీసీఐ, ఫ్రాంఛైజీల మధ్య పంచుతారు. |
| |
వచ్చే ఐపీఎల్ నుంచి ప్రస్తుతమున్న 8 ఫ్రాంఛైజీలకు అదనంగా మరో రెండు చేరనున్నాయి. ఇందుకు ఐపీఎల్ బిడ్‌లను ఆహ్వానించింది. ఇందులో పుణె ఫ్రాంఛైజీని సుబ్రతోరాయ్ నేతృత్వంలోని సహారా గ్రూప్ రూ. 1702 కోట్లు, కోచిని రాండీవూ గ్రూప్ రూ. 1533 కోట్లు వెచ్చించి దక్కించుకున్నాయి. కోచి ఫ్రాంఛైజీని రాండీవూ నెగ్గడంలో కేంద్ర మంత్రి శశి థరూర్‌ది కీలక పాత్ర. ఐతే తాను కేరళవాసిని కాబట్టి కేవలం నైతిక మద్దతును మాత్రమే ఇచ్చానని మంత్రి పేర్కొన్నారు. కానీ థరూర్ సన్నిహితురాలు సునంద పుష్కర్‌కు రాండీవూ గ్రూప్‌లో వాటా ఉందని ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడి ట్విటర్‌లో బయటపెట్టడంతో వివాదం చెలరేగింది. రాండీవూ గ్రూపులో సునంద వాటా విలువ రూ.70 కోట్లు. కోచి కన్సార్టియం ఐపీఎల్ బిడ్ గెలవడంలో కీలక పాత్ర వహించినందుకే ఈ మొత్తం థరూర్ సన్నిహితురాలికి ఉచితంగా దక్కిందనేది ఆరోపణ |
కాశ్మీర్ లోయలోని బొమ్మై గ్రామం సునంద స్వస్థలం. తండ్రి రిటైర్డ్ ఆర్మీ అధికారి. ఉగ్రవాదులు సునంద ఇంటిని తగులబెట్టడంతో ఆమె కుటుంబం శ్రీనగర్‌కు వలసవచ్చింది. బారాముల్లా ఆర్మీ పాఠశాల విద్య అభ్యసించింది. 1991లో జమ్మూ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా అందుకుంది. ఢిల్లీలోని ఓ హోటల్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తూ... అక్కడే పరిచయమైన సంజయ్ రైనాను పెళ్ళాడింది. తర్వాత అతనికి విడాకులిచ్చింది. దుబాయ్‌కు వెళ్ళి ఈవెంట్ మేనేజర్, అగ్నిమాపక పరికరాల డీలర్ సుజిత్ మీనన్ అనే కేరళ వ్యక్తి వివాహం చేసుకుంది. కేంద్ర మంత్రి శశి థరూర్‌కు సన్నిహితురాలని పేరు! |
నిబంధనల ప్రకారం కన్సార్టియంలో భాగస్వాముల వివరాలు బయటపెట్టకూడదు. ఈ మేరకు రహస్య నిబంధన ఉంది. చాలా ఫ్రాంఛైజీల్లో అసలు వాటాదారులెవరో ఇప్పటికీ తెలియని పరిస్థితికి కారణం ఈ నిబంధనే. ఈ నేపథ్యంలో మోడి కోచి కన్సార్టియం భాగస్వాముల వివరాలను ట్విటర్‌లో బయటపెట్టడం విశేషం. మోడికి సంబంధించిన వ్యక్తులకు (అహ్మదాబాద్‌కు) బిడ్ దక్కలేదన్న అక్కసే ఇందుకు కారణమనేది అతడి వ్యతిరేకుల వాదన. రాండీవూ గ్రూప్‌కే ఎందుకు? |
![]() |
| ముంబయి ఇండియన్స్: ఈ జట్టు యజమాని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ. ఇందులో రిలయన్స్ వాటా 95 శాతం. అన్షూజైన్ అనే ఆర్థికవేత్తకు కూడా 5 శాతం వాటా ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ప్రముఖ మద్యం వ్యాపారి, యూబీ గ్రూప్ అధినేత విజయ్ మాల్యా ఈ జట్టు యజమాని. ఇందులో చాలా మంది భాగస్వాములున్నారు. . రాజస్థాన్ రాయల్స్: ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడి బావమరిది సురేష్ చెల్లారామ్ (44.1%)ది ఈ జట్టులో అత్యధిక వాటా. ఎమర్జింగ్ స్పోర్ట్స్ మీడియాకు చెందిన మనోజ్ బదాలెకు 32.4 శాతం వాటా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్: ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్‌ది ఈ జట్టు. ఇతడు బీసీసీఐ కార్యదర్శి కూడా. బీసీసీఐలో అత్యుతన్నత పదవి ఉండడం వల్లే శ్రీనివాసన్‌కు చెన్నై హక్కులు దక్కాయన్న విమర్శలూ లేకపోలేదు. త్వరలో ఈ జట్టును స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదు చేసే అవకాశముంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్: బాంబే డైయింగ్‌కు చెందిన నెస్‌వాడియా, మోహిత్ బర్మన్(డాబర్), కరణ్‌పాల్, ప్రీతిజింటా.. ఇంకా చాలా మంది భాగస్వామ్యులు. ఇందులో మోహిత్ బర్మన్ తమ్ముడు గౌరవ్.. లలిత్ మోడికి అల్లుడు. ప్రస్తుత ఈ జట్టును అమ్మేసే యోచనలో ఉన్నారు. వీడియోకాన్, హీరోహోండా కంపెనీలు కొనేందుకు పోటీపడుతున్నాయి. కోల్‌కత నైట్‌రైడర్స్: బాలీవుడ్ నటులు షారూక్‌ఖాన్, జూహీచావ్లా కలిసి ఏర్పాటు చేసిన రెడ్‌చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ జట్టుకు యజమాని. ఢిల్లీ డేర్‌డెవిల్స్: యజమాని జీఎమ్మార్ ఇండస్ట్రీస్‌కు చెందిన గ్రంధి మల్లికార్జునరావు. డెక్కన్ ఛార్జర్స్: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు చెందిన టి.వెంకట్రామ్‌రెడ్డి ఈ జట్టు యజమాని. ఇందులో గ్రూప్ ఎమ్ అనే సంస్థకు కూడా 20శాతం వాటా ఉందంటున్నారు! |




